Online Puja Services

చక్కని పుత్ర సంతానాన్ని ఇచ్చే పుత్రగణపతి వ్రతం

18.191.102.112

చక్కని పుత్ర సంతానాన్ని ఇచ్చే పుత్రగణపతి వ్రతం . 
సేకరణ 

పూర్వకాలంలో రాజులు వంశాన్ని నిలబెట్టే పుత్ర సంతానం కోసం ఎదురుచూసేవారు . ఎందుకంటె, తమ వారసత్వాన్ని పుణికి పుచ్చుకొని ఆ తర్వాత కూడా తమ సామ్రాజ్యాన్ని విస్తరించి , ప్రజలని రక్షించాల్సిన బాధ్యత వహించాల్సినవారు ఉండాలి కదా ! ఇక, పున్నామ నరకం నుండీ రక్షించగలిగినవాడు పుత్రుడే ననే విస్వాసమా ఉంది కనుక ఆ విధంగా కూడా తమకి కొడుకే కావాలనుకునే వారు ఈ రోజుల్లో కూడా తక్కువేమీ కాదు . అలా ఆనాటినుండి ఈనాటివరకూ పుత్ర సంతానాన్ని పొందాలనుకునే వారికి ఆ వరాన్ని అనుగ్రహించే వ్రతం ఒకటుంది. అదే పుత్ర గణపతి వ్రతం. ఆ విధానం ఇక్కడ మీకోసం . 

ఫాల్గుణ శుద్ధ చవితినాడు ఈ వ్రతాన్ని ఆచరించాలి . దాదాపుగా మనం వినాయక చవితి చేసుకుంటాం కదా ! అదే విధానంలో ఈ వ్రతం కూడా ఉంటుంది . కేతు గ్రహ అనుగ్రహానికి ఈ విధంగా వినాయక చవితి , సంకష్టహర చతుర్థి , పుత్రగణపతి వేరాలని ఆచరిస్తే, ఫలితం ఉంటుందని మన హైందవ సిద్ధాంతాలు ప్రబోధిస్తున్నాయి . 

గణపతి ఓంకార స్వరూపుడు . గణపతి స్వరూపాన్ని జాగ్రత్తగా పరిశీలించండి . మీకు ఆయన స్వరూపంలో ఆ ప్రణవనాద రూపం కనిపిస్తుంది . మంత్రానికి ఆదిగా ఓం కారాన్ని ఉచ్చరించినట్టే, ప్రతిపూజకీ ముందుగా ఆ గణపతిని ఆరాధించడం మన సంప్రదాయంగా ఉంది . ఈ విదాహముగా ఓంకార స్వరూపంగా గణపతిని ‘ గణపత్యధర్వ శీర్షం కూడా పేర్కొంటూ ఉండడం విశేషం . 

ఈ ఫాల్గుణ శుద్ధ చవితి నాడు చక్కగా తలంటి స్నానం చేసి , ఉపవాసం ఉండి,  స్వామివారిని షోడశ ఉపచారాలతో పూజించాలి . ఆయనకీ ఇష్టమైన పళ్ళు , వంటలు, పిండివంటలు  చేసి నైవేద్యంగా సమర్పించాలి . తిరిగి సాయంత్రం కూడా యధోచితంగా విఘ్నేశ్వరుని పూజించి , ఆ తర్వాత ఉపవాస దీక్షని విరమించాలి . ఈ విధంగా నియమ నిష్ఠలతో పుత్రగణపతి వ్రతాన్ని చేయడం వలన మనోభీష్టం నెరవేరుతుంది.

 ఈ విధంగా వ్రతాన్ని ఆచరించినవారికి వంశాన్ని నిలబెట్టగలిగిన సామర్ధ్యం గలిగిన కొడుకులు జన్మిస్తారని స్వయంగా ఆ మహాదేవుడే , పార్వతీదేవితో చెప్పినట్టు మన ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి .  కాబట్టి దంపతులు  యథా శక్తి ఆ గణపతిని ఫాల్గుణ మాసములో అర్చించి ఆయన కృపకి పాత్రులు కాగలరని ఆశిస్తూ , శలవు !!  

Quote of the day

You can't cross the sea merely by standing and staring at the water.…

__________Rabindranath Tagore