Online Puja Services

పచ్చని మూలికల కొండమీద వెలసిన నరహరి ఆరోగ్యప్రదాత !

3.22.181.81

పచ్చని మూలికల కొండమీద వెలసిన నరహరి ఆరోగ్యప్రదాత !
లక్ష్మీ రమణ 

ప్రకృతిమాత పచ్చని చీరకట్టుకొని ఎదురుగా నిలుచుంటే ఎలా ఉంటుంది. ఊహే అందంగా, దైవాన్ని కనులముందు నిలిపినట్టు అనిపిస్తుందికదూ! ఇక ఆ కనులముందు నిలిచినా దైవం కోరిన కోరిక ఏదైనా సరే, తీర్చేస్తానంటే , అంతకంటే, భక్తునికి కావలసినది ఏముంటుంది ? అలా దైవం తన దేవాలయంతోపాటుగా స్వయంభువుగా వెలిసి కోరినకోర్కెలు తీర్చే క్షేత్రం ఈ తెలుగునేలమీదనే ఉంది. 

గోదారమ్మ గలగలలనడుమ పచ్చని ప్రకృతితో , అంతకు మించిన స్వచ్ఛమైన సంప్రదాయం, అచ్చమైన తెలుగుదనం ఉట్టిపడే ప్రదేశం రాజమహేంద్రవరం . ఆ నీటిలో జ్ఞానాధారాలు , ఆనేలమీద దేవతలా పాదముద్రలు , ఆ గాలిలో వారి ఆశీస్సులూ కలగలసి ఉంటాయి . అదే నేటి రాజమెండ్రి. రాజమెండ్రికి కేవలం 20 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది కోరుకొండ అనే ఊరు . అక్కడే ఉంది మనం చెప్పుకున్న పచ్చని కొండ. ఔషధసంపదని నిలువెల్లా నింపుకున్న ఆ వైద్యానారాయణుడి నెలవు ఈ కల్పతరువు. గమనించండి ఎక్కడైతే, ఆ హరి నరహరిగా (నారసింహునిగా) కొలువై ఉంటాడో, అక్కడ వ్యాధులు తలెత్తవు . ఆయన క్షేత్రాలలో ఈ మహత్యం నిబిడీకృతమై ఉంటుంది . అలాగే ఈ క్షేత్రంలోని నారసింహుడు కూడా ఆరోగ్యప్రదాత. 

ఇక్కడి విశేషం ఏమిటంటే, ఆ నారసింహుడు వెలసినమూర్తి ఒక ఎత్తైన కొండమీద, తన ఆలయంతో సహా వెలిశాడు .దాదాపు 360కి పైగా ఉన్న మెట్లెక్కి ఆ స్వామిని దర్శించుకోవాలి .  స్వామీ! నీవు అంత  ఎత్తైన కొండమీద ఉన్నావు . నేనెలా నిన్ను చేరేది ? అని తపనపడే భక్తుల కోసం స్వామీ కొండ కింద కూడా ఒక విగ్రహాన్ని ప్రతిష్ఠ చేశారు . ఆ స్వామిని అటువంటివారు దర్శించుకొని ఆర్తిని తీర్చుకోవచ్చు. 

కొండపైన ఉన్న ఆలయం చక్కని శిల్ప శోభతో అలరారుతుంటుంది. రామాయణ కావ్యానికి సంబంధించిన శిల్పాలు చాలా ఆలయాలలో కనిపిస్తూనే ఉంటాయి . కానీ , ఈ ఆలయంలో రామరావణ యుద్ధ ఘట్టం అద్భుతంగా ఉంటుంది . ,రాముడు  రావణుడూ ఒక్కరిపైనా ఒకరు విసురుకునే బాణాల ప్రయాణాన్ని వివరించే శిల్పాలు బహుశా ఇవేనెమో!

కొండమీద స్వామికి  ఇరువైపులా శంఖ చక్రాలు ద్వారపాలకులుగా ఉన్న చిన్న మందిరం ఉంటుంది. ఇది ఆ దేవతలే స్వయంగా ప్రతిష్టించారని స్థానిక విశ్వాసం . ఈ స్వామి దక్షిణాభిముఖుడై ఉండడం మరో విశేషం . ఈ బుజ్జి ఆలయంలో అయ్యవారు లక్ష్మీమాతతో సహా కొలువై ఉండడం చాలా అద్భుతంగా ఉంటుంది . ఈ ఆలయం చేరుకోవడానికి దగ్గఱి రైల్వే, విమానాశ్రయం, బస్సుస్టేషన్ రాజమెండ్రి నే . అక్కడినుండి ఆటోలు బస్సులు ఉన్నాయి .  

Quote of the day

You can't cross the sea merely by standing and staring at the water.…

__________Rabindranath Tagore