Online Puja Services

చండీ యాగం ఎందుకు చేస్తారు ?

3.145.203.23

చండీ యాగం ఎందుకు చేస్తారు ? 
-సేకరణ: లక్ష్మి రమణ  

లోక రక్షకులైన అమ్మవారి స్వరూపాల్లో చండీ ఒకటి. లోక కల్యాణం కోసం, విశేష కార్యసిద్ధి కోసం సకల చరాచర జగత్తు సృష్టికి, స్థితికి, లయకు మూల కారణమైన జగన్మాతను ఆరాధించడం అనాదిగా వస్తోంది. ఆదితత్త్వాన్ని స్త్రీమూర్తిగా భావించి చేసే ప్రకృతి ఉపాసనే శ్రీవిద్య. అది లలితా పారాయణం, చండీ పారాయణం అని రెండు రకాలు. బ్రహ్మాండ పురాణం, దేవీ భాగవతం లలితాదేవి మహిమలను చెబితే, మార్కండేయ పురాణం చండీ మహత్మ్యాన్ని వివరిస్తుంది. కలియుగంలో చండీ పారాయణకు మించిన శక్తిమంతమైన ఫలసాధనం మరొకటి లేదని శాస్త్రవచనం. ఇహపర సాధనకు చండీ హోమం ఉత్తమం. ఏడు వందల మంత్రాలతో కూడిన చండీ సప్తశతిని పారాయణ చేసి, హోమం నిర్వహించడమే చండీ హోమం.

సమస్త వేదాంగాదిశాస్త్ర వినుతే బ్రహ్మాది భిర్వందితే
చండ ముండాసురాది సంహరకరే భక్తాళి రక్షాకృతే
కరవీరాది పుష్పమాలాంకృతే  సౌందర్యరత్నాకరే
మాలిన్యాది సమస్తదోష రహితే శ్రీ చండికే పాహిమాం ||

అమ్మ ఆది పరాశక్తి అని తెలిసిన విషయమే..! చండీ మాత ఓ ప్రచండ శక్తి. భూగ్రహంపై మాత్రమే కాకుండా విశ్వాంతరాళాలని అంటిపెట్టుకునే ఉంటుంది. సృష్టి జరగడానికి, అది వృద్ది చెండానికి తిరిగి లయం కావడానికి అవసరమైన శక్తి అంతా ఆమెలోనే ఉంది. ఆమె ఆదిశక్తి, పరాశక్తి, జ్ఝానశక్తి, ఇచ్ఛాశక్తి, కుండలినీ శక్తి! అందుకే ఆమెకు అంత ప్రాధాన్యం ఉంది.

బ్రహ్మాండ పురాణం, దేవీ భాగవతం లలితా దేవీ మహిమలను చెబితే, మార్కెండేయ పురాణం చండీ మహత్మ్యాన్ని వివరిస్తుంది. చండీ లేదా దుర్గా దేవి విజయాలను వివరించడంతో పాటు బ్రహ్మాది దేవతలు ఆమె వైభవాన్ని కీర్తించే శక్తిమంతమైన మంత్రాల కదబంమే చండీ లేదా దుర్గా సప్తశతి .

చండి హోమంలో ఉన్న మంత్రాలు , అధ్యాయాలు:

చండీ సప్తశతిలో 700 మంత్రాలుంటాయని ప్రతీతి. అయితే , ఇందులో ఉన్న మంత్రాలు 578 మాత్రమే. ఉవాచ మంత్రాలు, అర్థశ్లోక, త్రిపాద శ్లోక మంత్రాలతో కలిపి మొత్తం 700 మంత్రాలయ్యాయి. బ్రహ్మీ, నందజా, రక్తదంతికా, శాకంబరీ, దుర్గా, భీమా, భ్రామరీ అనే ఏడుగురు దేవతామూర్తులకు సప్తసతులు అని పేరు. వారి మహాత్మ్య వర్ణనతో కూడిన మంత్రాలు కాబట్టి దీనికి చండీ సప్తసతి అనే పేరు వచ్చింది. ఇది శాక్తేయ హోమం కనుక నిష్టగా చేయాల్సి ఉంటుంది.

దుర్గ లేదా చండీ సప్తశతి మూడు చరిత్రలుగా, 13 అధ్యాయాలుగా ఉంటుంది. తొలి భాగంలో ఒకే ఒక అధ్యాయం ఉంటుంది. రెండో భాగంలో మూడు అధ్యాయాలు, మూడో భాగంలో తొమ్మిది అధ్యాయాలు ఉన్నాయి, వీటిలో మధుకైటభ సంహారం, మహిషాసుర సంహారం, శుంభనిశుంభుల వధతో పాటు బ్రహ్మాది దేవతలు చేసిన పవిత్ర దేవీ స్తోత్రాలు ఉంటాయి.

చండీ పారాయణ వల్ల సమాజానికి జరిగే మేలు..

ఎక్కడ చండీ ఆరాధనలు జరుగుతాయో అక్కడ దుర్భిక్షం ఉండదు. దు:ఖం అనేది రాదు. ఆ ప్రాంతంలో అకాల మరణాలు ఉండవు. లోక కల్యాణం, సర్వజనుల హితం కోసం పరబ్రహ్మ స్వరూపిణి అయిన చండికా పరమేశ్వరులను పూజించాలని సూతసంహిత ఉద్ఘాటిస్తోంది.కలియుగంలో చండీ పారాయణకు మించిన శక్తిమంతమైన ఫలసాధనం మరొకటి లేదని, శాస్త్రవచనం. ఇహపర సాధనకు చండీహోమం ఉత్తమం. ఏడు వందల మంత్రాలతో కూడిన చండీ సప్తశతిని పారాయణ చేసి, హోమం నిర్వహించడమే చండీ హోమం. దేశోపద్రవాలు శాంతించడానికి, గ్రహాల అనుకూలతకు, భయభీతులు పోవడానికి శత్రుసంహారానికి, శత్రువులపై విజయం సాధించడానికి తదితర కారణాలతో చండీ యాగం చేస్తారు.

చండి ఎన్ని సార్లు:.

కలియుగంలో గణపతి, చండి ఆరాధన విశేష ఫలితాలను
ఇస్తుందని పెద్దలు చెప్పారు. చండీ హోమానికి సంబంధించి నవ చండీ యాగం, శత చండీ యాగం, సహస్ర చండీ యాగం, అయుత (పది వేలు) చండీ యాగం, లక్ష చండీ యాగం చేస్తారు. చండీ హోమం, నవ చండీ, శత చండీ యాగాలను తరచుగా, సహస్ర చండీ యాగాలను అరుదుగా చేస్తుంటారు. ఆయుత చండీ యాగాలను చేయడం చాలా అరుదు. గత 200 ఏళ్లలో అయుత చండీ యాగాన్ని రెండే రెండుసార్లు చేశారు. మొదటిసారి శృంగేరీ పీఠాధిపతి షష్టిపూర్తి సమయంలో చేస్తే. రెండోసారి  తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేశారు.

వీటిలో నవ చండీ యాగం చేస్తే వాజపేయం చేసినంత ఫలితం పొందుతారట. ఏకాదశ చండీ చేస్తే రాజు వశమవుతాడని, ద్వాదశ చండి చేస్తే శత్రు నాశనమని, మను చండీ(చతుర్ధశ చండీ)తో శత్రువు వశమవుతాడాని, మార్కెండేయ పురాణం చెప్పినట్లు శాంతి కమలాకరంలో ఉంది.

ఇక శత చండి చేస్తే కష్టాలు, వైద్యానికి లొంగని అనారోగ్యం, ధన నష్టం తదితరాలు తొలగుతాయి. సహస్ర చండితో లక్ష్మీదేవి వరిస్తుంది. కోరికలు నెరవేరతాయి. లక్ష చండీ చేస్తే చక్రవర్తి అవుతాడని మార్కెండేయ పురాణంలో ఉంది, దీనినే నియుత చండి అంటారు. ప్రయుత చండి అంటే పది లక్షల చండీ సప్తశతి పారాయణాలు.

సాధారణంగా గణపతి హోమం, అయుష్య హోమం, మృత్యుంజయ హోమం తదితరాలను ఎవరో ఒక దేవుడు లేదా దేవతను ఉద్దేశించి చేస్తారు. కానీ, చండీ యాగంలో మాత్రం మహాకాళి, మహాలక్ష్మి, మహా సరస్వతి ముగ్గురికీ కలిపి పూజలు నిర్వహిస్తారు. చండీ దేవత చాలా ప్రచండ శక్తి. ఎక్కడ చండీ ఆరాధనలు జరుగుతాయో అక్కడ దుర్భిక్షం ఉండదని, దుఖం అనేది రాదని, ఆ ప్రాంతంలో అకాల మరణాలు ఉండవని వేదాలు చెబుతున్నాయి. 

అయుత చండీ యాగంలో పది వేల పారాయణలు, కోటి నవార్ణ మంత్ర జపం చేస్తారు. పారాయణలో పదో వంతు హోమం, పదో వంతు తర్పణాలు ఇస్తారు. శత చండీ యాగంలో పది మంది; సహస్ర చండీ యాగంలో వంద మంది; అయుత చండీ యాగంలో వెయ్యి మం ది రుత్విక్కులు పాల్గొంటారు. అన్ని యాగాల్లోనూ మొదటి నాలుగు రో జులూ ప్రతిరోజూ నవావరణ పూజ, చతుష్షష్టి యోగినీ పూజ, దీప స హిత బలి, కల్పోక్త పూజతోపాటు కుంకుమార్చన చేస్తారు. ఐదో రోజు అ గ్ని ప్రతిష్ట చేసి, ఆహుతులతో అమ్మవారికి పరమాన్న ద్రవ్యంతో ఆజ్య హోమం, అంగ, ఆవరణ, పీఠ దేవతలకు ఆజ్య హోమం, తర్పణం చేసి, ఇంద్ర శక్త్యాది దేవతలకు బలిదానం, పూర్ణాహుతి, దంపతి, సువాసిని, క న్యక పూజలు, అవభృత్యం, అన్న సంతర్పణతో హోమాన్ని పూర్తి చేస్తారు.

Quote of the day

God is to be worshipped as the one beloved, dearer than everything in this and next life.…

__________Swamy Vivekananda