Online Puja Services

అమ్మవారికి శ్రీ చక్రానికి సంబంధం ఏమిటి ?

18.116.90.141

అమ్మవారికి శ్రీ చక్రానికి సంబంధం ఏమిటి ?
- లక్ష్మి రమణ 

అమ్మవారు శ్రీచక్ర నివాసిని. శ్రీచక్రం అంటే ఏమిటి? ఈ విషయాన్ని సనాతనులకు వివరించాల్సిన అవసరం లేదు. ప్రణవనాదమైన ఓంకారమే ఆ శ్రీచక్రము. ఆ విషయాన్ని మన పూర్వీకులు , ఋషులు యుగాల క్రితమే దర్శించి మనకి చెప్పారు . వాటిని విశ్వశించ కూడదని కొందరు కుహనా మేధావులు మన బ్రెయిన్ ని ట్రైన్ చేసేసి, నింపాల్సిన విషాన్ని గట్టిగా నింపేశారు. అది వేరే విషయం.  కానీ ఫాదరాఫ్ సైన్స్ గా పిలుచుకునే హాన్స్ జెన్నీ (HANS JENNY) ఈ విషయాన్ని నిరూపించారు . ఆయన "టోనొ స్కోప్" అనే ఓ అద్భుతమైన పరికరాన్ని కనిపెట్టాడు. ఏదైనా శబ్ద తరంగానికి విజువల్ రిప్రెసెంటేషన్ ని గీయడమే ఆ పరికరం చేసే పని! వివిధ ధ్వనులని చేసి, "టోనొ స్కోప్" సహాయంతో వాటి రూపాలని స్టడీ చేయడం మొదలు పెట్టాడు.ఆ ప్రయోగాల్లో భాగంగా, 'ఓంకారాన్ని ' సుస్ఫష్టంగా చదివించి, ఆ శబ్ద తరంగాల ద్వారా వచ్చే బొమ్మని పరిశీలించారు. ఆశ్చర్యం! ఓంకారం చదివినప్పుడు వచ్చిన ఆకారం శ్రీచక్రం !

శ్రీచక్రమంటే అమ్మవారి శరీరమని మన వేదాలు చెప్తాయి (శ్రీచక్రం శివయోర్వపుః)

అలాగే మన వేదాలూ, ఋషులూ అమ్మవారిని "ఓంకార పంజర శుకీ" అనీ, "ఓంకార రూపిణీ మాతా..." అనీ కీర్తించడం మనం విన్నాముగా. ఇదే ఓంకారానికీ, అమ్మవారికీ (శ్రీచక్రానికీ) మధ్యనున్న సంబంధం!ఈ విషయం మన పురాణాలు ఎప్పుడో చెప్పినా, సైన్సుకి మాత్రం తెల్సుకోవడానికి ఇంతకాలం పట్టిందంతే!

శ్రీ చక్రం ఈ విశ్వానికి ప్రతిరూపం. ఇందులో అన్ని త్రిభుజాలే ఉంటాయి . అవి అనేకానేక విభజనలతో తిరిగి అనేక రూపాంతరాలు పొందుతాయి . ఇటువంటి  బిందువు, వృత్తం, త్రిభుజి, చతుర్భుజి అనేవి లేకుండా ఏ యంత్రమూ ఉండదు. అయితే బిందువు విశ్వానికి మూలం. బిందువు వ్యాసార్థం లేని ఒక వృత్తమే కదా . కాబట్టి బిందువూ, వృత్తమూ ఒకటే.  బిందువును విస్తరింపజేస్తే వృత్తం అవుతుంది. దానిని అనంతంగా విస్తరిస్తూ పోతే విశ్వంగా మారుతుంది. త్రిభుజి, చతుర్భుజి, పంచభుజి ఇలా ఉన్నాయి కదా! విశ్వాన్ని ఒక అనంతముఖాలు ఉన్న బహుభుజి ( infinite sided polygon ) అనుకుంటే, దానిని తగ్గిసూ వెళ్తే మనకు మిగిలేది ఒక త్రిభుజమే. ఎందుకంటే అతి తక్కువ రేఖలతో ఏర్పడే జ్యామితీయ ఆకారం త్రిభుజం మాత్రమే. ఇచ్చాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తుల ప్రతీక . కాబట్టి బిందువు, త్రిభుజం, వృత్తం, చతుర్భుజం అలా… శ్రీచక్రం ఉంటుంది.

ముందే చెప్పుకున్నట్టు ఈ శ్రీ చక్రం అమ్మవారి శరీరము అనుకుంటే, ఆ శరీరంలో దాగిన అనంతవిశ్వ దర్శనం అమ్మ స్వరూపం అవుతోంది కదా ! కాబట్టి అనంత విశ్వ స్వరూపమే అమ్మ లలితా పరమేశ్వరి. ఆమెని శబ్దంగా భావిస్తే , ఆ ప్రణవ నాదమైన ఓంకారం అమ్మ రూపం . ఒక్కసారి ఇప్పడు ఈ భావనతో ఓంకారం చేస్తే, అమ్మ రూపం సౌందర్యలహరిగా , సమ్మోహనంగా మన కనుల ముందు సాక్షాత్కరించడడం ఖాయం . ఆ విధంగా శ్రీచక్ర నివాసిని ఐన అమ్మని ఆరాధించడం , ధ్యానించడం , చివరికి భావన చేయడం ద్వారా సకల శుభాలూ కలుగుతాయి . అన్నిటికీ మించి, మానవ జన్మకి ఉద్దేశించిన సార్ధకత ఏదైతే ఉందొ అది సాధనచేత అమ్మ అనుగ్రహంతో సిద్ధిస్తుంది . శుభం !

Quote of the day

A coward is incapable of exhibiting love; it is the prerogative of the brave.…

__________Mahatma Gandhi