Online Puja Services

కృష్ణుడు దేవకీదేవికి అన్యాయం చేశాడా ?

52.14.121.242

గురుమాత గర్భశోకాన్ని తీర్చగలిగిన కృష్ణుడు దేవకీదేవికి అన్యాయం చేశాడా ?
-లక్ష్మీ రమణ 

కంసుడు దేవకీదేవి గర్భంలో కృష్ణుడికి ముందర జన్మించిన సంతానాన్నీ కడతేర్చాడు.ఆ తల్లి పుత్రశోకంతో తల్లడిల్లిపోయింది.  అందుకు నారదుడి కారణమయ్యాడు. కానీ తన గురువైన సాందీపునికి  గురుదక్షిణ చెల్లించడానికి యమునితో పోరాడి ఆయన పుత్రుణ్ణి తీసుకురాగలిగిన కృష్ణుడు , దేవకీదేవి పుత్రశోకాన్ని ఎందుకు తీర్చిలేకపోయాడు ?  

సాందీపుని దగ్గర బలరామ కృష్ణుల  విద్యాభాసం ముగిసింది. తిరిగి ఆయన రాజ్యభారాన్ని వహించేందుకు రాజ్యానికి వెల్లసిన సమయం వచ్చేసింది . అప్పుడు వారు తమ గురువు దగ్గరికి వెళ్లి, గురుదక్షిణగా ఏమివ్వాలని అడుగుతారు . అప్పుడాయన , ప్రభాసతీర్థంలో తప్పిపోయిన తమ పుత్రుణ్ణి వెతికి తెచ్చిఇయ్యమని అడుగుతారు . పరమాత్మకు అసాధ్యమైనదేముంటుంది. 

ఆయన ఆ గురుపుత్రుడు సముద్రగర్భంలో దాగిన పాంచజనుడనే రాక్షసుని గర్భంలో ఉన్నాడని తెలుసుకొని వాడిని చంపి వాడి గర్భంలో వెతుకుతారు. అక్కడ పాంచజన్యమనే శంఖం తప్ప మరేమీ దొరకదు . అప్పుడు యమపురికి వెళ్లి అక్కడ తొలిసారి ఆ పాంచజన్యాన్ని (శంఖాన్ని ) పూరిస్తాడు  పరమాత్మ. ఆ శబ్దానికి అదిరిపడ్డ యముడు సరాసరి ఆ గురుపుత్రుణ్ణి తీసుకొచ్చి కృష్ణునికి అప్పగిస్తాడు . ఆయన ఆ పిల్లవాడిని గురువుగారికి అప్పగించి తన గురుదక్షిణ చెల్లిస్తారు . 

ఇంతటి వీరోచితంగా గురువుగారి బిడ్డని రక్షించిన స్వామీ కన్నతల్లికి ఏర్పడిన గర్భశోకాన్ని తీర్చలేకపోయారా ? ఆ దేవకీదేవి కడుపుతీపిని తిరిగి తేలేకపోయారా ? అంటే, దేవకీదేవి అడిగాక ఆపని ఆయన చేయకుండా ఉంటారా ?

దేవకీదేవి యముడివద్దకి వెళ్లి కృష్ణుడిని తన అన్నలని తీసుకురావలసిందిగా కోరినప్పుడు , వారు యమలోకంలో లేరు . బాలి అనేరాజు పరిపాలనలో ఉన్న సుతల లోకంలో ఉన్నారు . వారిని శ్రీకృష్ణుడు తీసుకువచ్చారు. అప్పుడామె తన ఎనిమిదిమంది సంతానాన్ని ఒకేదగ్గర చూసుకొని ఆనందించారు . కానీ వారు ఎక్కువకాలం దేవకీ దేవి దగ్గర ఉండలేకపోయారు . ఎందుచేతనంటే, వాళ్లకున్న శాపం అలాంటిది మరి . 

దేవకీ పుత్రులలో మొదటి ఆరుగురు గత జన్మలో కాలనేమి పుత్రులు. వారిని తండ్రే చంపుతాడు అని హిరణ్య కశిపుడు శపిస్తాడు. ఆవిధంగానే మరుజన్మ లో కంసుడిగా జన్మించిన కాలనేమి, దేవకీ గర్భాన మొదట పుట్టిన ఆరుగురిని చంపుతాడు. కాలనేమి పుత్రుల పేర్లు – హంస, సువికర్మ, కృత, దమన, రిపుర్మర్దన, క్రోధహంత.  వీరందరూ కూడా రాక్షసులే అయినా , పరమాత్మ అనుగ్రహం వలన, ఆయనకి సోదరులై జన్మించి మోక్షాన్ని పొందారు . అదీ కథ . 

Quote of the day

You can't cross the sea merely by standing and staring at the water.…

__________Rabindranath Tagore