పూరి జగన్నాధ స్వామి వారి పున్నమి స్నానం

3.239.58.199

పూరి జగన్నాధ స్వామి వారి పున్నమి స్నానం  

పూరిజగన్నాథుడి ఆలయంలో మూలవిరాట్టుకు నిత్యం అభిషేకాలు ఉండవు. 
అయితే ప్రతి రోజు దర్పణస్నానం నిర్వహిస్తారు.

 అంటే మూల విరాట్టుకు ఎదురుగా ఒక పెద్ద అద్దాన్ని ఉంచి అందులో కనిపించే ప్రతిబింబానికి అభిషేకం నిర్వహిస్తారు. 

 జేష్ట శుద్ధ పౌర్ణమి రోజునఅయితే ఏడాదికి ఒకసారి మాత్రం మూలవిరాట్టుతో పాటు బలభద్రుడు, సుభద్రలకు కూడా అభిషేకం చేస్తారు. 
అభిషేకం పూర్తి అయిన తర్వాత ముగ్గురు దేవతామూర్తులను ఆలయ ప్రాంగణంలోని చీకటి మందిరంలో ఉంచుతారు.  

జలుబు చేస్తుందని నీటిలో తడిసిన దేవతలకు జలుబు చేస్తుందని, జ్వరం వస్తుందని అక్కడి వారి నమ్మకం. అందుకే దేవతా మూర్తులను సరిగ్గా పదిహేను రోజుల పాటు చీకటి మందిరంలో ఉంచి ప్రత్యేక సేవలు చేస్తారు.  

ఆయుర్వేద మూలికలు అంటే స్వామివారికి ఈ పదిహేను రోజుల పాటు సమర్పించే నైవేద్యాల్లో ఆయుర్వేద మూలికలు వాడుతారు.
 ఈ మూలికలు జలుబు, జ్వరం రాకుండా అరికట్టేవి కావడం గమనార్హం. 

ఇక పదిహేను రోజుల పాటు జగన్నాథుడితో పాటు బలభద్రుడు, సుభద్రల దర్శనం ప్రజలకు లభించదు..

- సేకరణ 

Quote of the day

And as long as you're subject to birth and death, you'll never attain enlightenment.…

__________Bodhidharma