శ్రీకృష్ణుని గురించి అద్భుతమైన సమాచారం

35.172.203.87

శ్రీకృష్ణుని గురించి అద్భుతమైన సమాచారం

1. శ్రీకృష్ణుడు 5,252 సంవత్సరాల క్రితం జన్మించాడు
2. పుట్టిన తేది క్రీ. పూ. 18.07.3228
3. మాసం : శ్రావణం
4. తిథి: అష్టమి
5 . నక్షత్రం : రోహిణి
6. వారం : బుధవారం
7. సమయం : రాత్రి గం.00.00 ని. 
8  జీవిత కాలం : 125 సంత్సరాల 8 నెలల 7 రోజులు
9. మరణం: క్రీ పూ 18.02.3102
10. శ్రీకృష్ణుని 89వ యేట కురుక్షేత్రం జరిగినది
11  కురుక్షేత్రం జరిగిన 36సం. తరువాత మరణించెను
12. కురుక్షేత్రం క్రీ.పూ. 08.12.3139న మృగసిర శుక్ల ఏకాదశినాడు ప్రారంభమై 25.12.3139 న ముగిసినది. క్రీ.పూ 21.12.3139న 3గం. నుంచి 5గం.లవరకు సంభవించిన సూర్య గ్రహణం జయద్రదుని మరణానికి కారణమయ్యెను.
13. భీష్ముడు క్రీ.పూ. 02.02.3138న ఉత్తరాయణంలో మొదటి ఏకాదశినాడు ప్రాణము విడిచెను.
14. శ్రీకృష్ణుడిని వివిధ ప్రాంతాలలో వివిధ నామాలతో పూజిస్తారు. అవి:

మధురలో కన్నయ్య
ఒడిశాలో జగన్నాధ్
మహారాష్ట్ర లో విఠల (విఠోబ)
రాజస్తాన్ లో శ్రీనాధుడు
గుజరాత్ లో ద్వారకాదీసుడు & రాంచ్చోడ్
ఉడిపి, కర్ణాటకలో కృష్ణ

15. జన్మనిచ్చిన తండ్రి వసుదేవుడు
16. జన్మనిచ్చిన తల్లి దేవకీ
17. పెంచిన తండ్రి నందుడు
18. పెంచిన తల్లి యశోద
19. సోదరుడు బలరాముడు
20. సోదరి సుభద్ర
21. జన్మ స్థలం మధుర
22. భార్యలు : రుక్మిణీ, సత్యభామ, జాంబవతీ, కాళింది, మిత్రవింద, నగ్నజితి, భద్ర, లక్ష్మణ
23. శ్రీ కృష్ణుడు జీవితంలో కేవలం నలుగురిని మాత్రమే హతమార్చినట్టు సమాచారం. వారు : ఛణురా - కుస్తీదారు
కంసుడు - మేనమామ
శిశుపాలుడు మరియు దంతవక్ర - అత్త కొడుకులు
24. శ్రీకృష్ణుని జీవితం కష్టాల మయం. తల్లి ఉగ్ర వంశమునకు, తండ్రి యాదవ వంశమునకు చెందిన వారు. వారిది కులాంతర వివాహం. 
25. శ్రీ కృష్ణుడు దట్టమైన నీలపు రంగు కలిగిన శరీరముతో పుట్టాడు. తన జీవితం మొత్తం లో తనకి నామకరణ జరగలేదు. గోకులమంతా నల్లనయ్య / కన్నయ్య అని పిలిచేవారు. నల్లగా పొట్టిగా ఉన్నాడని, పెంచుకున్నారని  శ్రీ కృష్ణుడుని అందరూ ఆటపట్టిస్తూ, అవమానిస్తూ ఉండేవారు. తన బాల్యమంతా జీవన్మరణ పోరాటాలతో సాగింది. 
26. కరువు, ఇంకా అడవి తోడేళ్ళ ముప్పు వలన శ్రీకృష్ణుని 9 ఏళ్ల వయసులో గోకులం నుంచి బృందావనం కి మారవలసి వచ్చింది. 
27  14-16 ఏళ్ల వయసు వరకు బృందావనం లో ఉన్నాడు. తన సొంత మేనమామ కంసుడిని 14-16 వయస్సులో మధుర లో చంపి తనను కన్న తల్లిదండ్రులను చెరసాల నుంచి విముక్తి కలిగించాడు.
28. తను మళ్ళీ ఏపుడూ బృందావనానికి తిరిగి రాలేదు.
29. కాలయవన అను సింధూ రాజు  నుంచి ఉన్న ముప్పు వలన మధుర నుంచి ద్వారకకి వలస వెళ్ళవలసి వచ్చింది.
30. వైనతేయ తెగకు చెందిన ఆటవికులు సహాయంతో జరాసందుడిని గోమంతక కొండ (ఇప్పటి గోవా) వద్ద ఓడించాడు.
31. శ్రీకృష్ణుడు  ద్వారకాను పునర్నిర్మించారు.
32. అప్పుడు విద్యాభ్యాసం కొరకు 16-18 ఏళ్ల వయసులో ఉజ్జయినిలో గల సాందీపని యొక్క అశ్రమంకు తరలివెళ్ళెను.
33. గుజరాత్ లో గల ప్రభాస అను సముద్రతీరం వద్ద ఆఫ్రికా సముద్రపు దొంగలతో యుద్ధం చేసి అపహరణకు గురి ఐన తన ఆచార్యుని కుమారుడగు పునర్దత్త ను కాపడెను.
34. తన విద్యాభ్యాసం తరువాత పాండవుల వనవాసమును గురించి తెలుసుకుని వారిని లక్క ఇంటి నుంచి కాపాడి తదుపరి తన సోదరి అగు ద్రౌపదిని పాండవులకు ఇచ్చి పెండ్లి చేసెను. ఇందులో చాలా క్రియాశీలంగా వ్యవహరించెను.
35. పాండవులు ఇంద్రప్రస్థ నగరమును ఏర్పాటు చేసి రాజ్యమును స్తాపింపజేసెను.
36. ద్రౌపదిని వస్త్రాపహరణం నుంచి కాపాడెను.
37. రాజ్యము నుండి  వెడలగొట్టునపుడు పాండవులకు తోడుగా నిలిచారు.
38. పాండవులకు తోడుగా ఉండి కురుక్షేత్రంలో విజయమును వరించునట్టు చేసెను.
39  ఎంతో ముచ్చటగా నిర్మించిన ద్వారక నగరము నీట మునిగిపోవుట స్వయముగా చూసేను.
40. అడవిలో జర అను వేటగాడి చేతిలో మరణించెను.
41. శ్రీకృష్ణుడు ఎప్పుడూ అద్భుతాలు చెయ్యలేదు. అతని జీవితం విజయవంతమైనదేమీ కాదు. జీవితములో ఒక్క క్షణం కూడా ఎటువంటి సంఘర్షణ లేకుండా ప్రశాంతముగా గడిపినది లేదు. జీవితపు ప్రతీ మలుపులో సంఘర్షణలు మాత్రమే ఎదుర్కొన్నాడు. 
43. జీవితములో ప్రతీ వ్యక్తిని, ప్రతీ విషయాన్ని బాధ్యతతో ఎదుర్కొని చివరకు దేనికి / ఎవరికీ అంకితమవ్వలేదు.
అతను గతాన్ని, భవిష్యత్తును కూడా తెలుసుకోగల సమర్థుడు ఐనప్పటికీ తను ఏపుడు వర్థమానములోనే బ్రతికారు. 
44. శ్రీకృష్ణుడు ఇంకా అతని జీవితము మానవాళికి ఒక నిజమైన ఉదాహరణ.

 జై శ్రీకృష్ణ 

- వాట్సాప్ సేకరణ 

Quote of the day

We live in a wonderful world that is full of beauty, charm and adventure. There is no end to the adventures that we can have if only we seek them with our eyes open.…

__________Jawaharlal Nehru