Online Puja Services

సఖిగోపాల్ ఆలయం

18.117.183.150

సఖిగోపాల్ ఆలయం

ఒడిశా రాష్ట్రంలోని పూరీకి 20km దూరంలో ఉన్నది ఈ ఆలయం
(కుర్ధ రోడ్ జంక్షన్ నుంచి పూరి వెళ్లే మార్గం మధ్యలో ఉన్నది)

"మానవుడు అన్యాయం చేసిన, మాధవుడు అన్యాయం చేయడు" అనే ఆర్యోక్తికి నిలువెత్తు నిదర్శనం ఈ ఆలయం...తాను నమ్మిన దైవం ఎప్పుడూ/ఎల్లప్పుడూ తన వెంటే ఉంటాడు అని భక్తునికి రుజువుచేసిన అద్భుతమైన ప్రదేశం... 
"ఆర్తత్రాణపరాయణస్సభగవాన్ నారాయణో మే గతిః" అని విశ్వసించి, ఆర్తితో ఒకసారి పిలిచినా చాలు "స్వామి అంటే హామీనేనై ఉంటా" అని అభయం ప్రసాదించే కరుణాసాగారుడు ఆ పరంధాముడు...

కొన్నేళ్ళ క్రితం ఈ దివ్యాధామం గురించి నాకు తెలిసింది..ఎప్పుడెప్పుడు దర్శించుకుందామా అని ఎన్నాళ్లనుంచో అనుకున్నాను కానీ ఇప్పుడు అవకాశం కలిగించాడు ఆ మధుసూదనుడు...

Story of Sakhigopal:-

పూర్వం ఇప్పుడు ఉన్న సఖిగోపాల్ ప్రాంతంలో ఇంకో ఊరు ఉండేది. దానిలో ఒక యువకుడు ఉండేవాడు, కృష్ణుని భక్తుడు, అతను కటిక బీదవాడైయిన కూడా ఉన్న దాంట్లో ఒకరికి పెటె మనసుకలవాడు...అతను ఆ గ్రామపెద్ద కూతురిని ప్రేమించాడు. అన్ని కథలలో మాదిరిగానే అతన్ని ఆ గ్రామపెద్ద అల్లుడిగా చేసుకునేందుకు ఇష్టపడలేదు. కొద్ది రోజ్జుల తరువాత ఆ గ్రామ ప్రజలలో కొంతమంది వారణాశి తీర్థయాత్రకి వెళ్ళారు, వెళ్లిన వాళ్లలో ఈ యువకుడు, గ్రామపెద్దకూడా ఉన్నారు. వారణాశిలో గ్రామపెద్ద జబ్బుపడి తనతోటివారినుంచి వేలివేయబడ్డాడు కానీ అప్పుడు ఆ యువకుడు మాత్రం ఆ గ్రామపెద్దను వదిలివేయకుండా అన్నిరకాల సపర్యలుచేసి తిరిగి ఆ గ్రామపెద్దను మామూలు స్థితికి తీసుకువచ్చాడు. ఆ యువకుడి మంచి మనసు నచ్చి, మెచ్చి ఆ గ్రామపెద్ద తన కూతురిని ఇచ్చి వివాహంచేయడానికి సమ్మతించి ఆ ఒడంబడికకి సాక్ష్యంగా అక్కడ దగ్గరలో ఉన్న శ్రీకృష్ణుని గుడికివెళ్లి ఆయన సమక్షంలో ఆ గ్రామపెద్ద ఆ యువకుడికి వాగ్దానం చేశాడు. తీర్థయాత్ర తరువాత తిరిగి గ్రామానికి చేరుకున్న ఆ గ్రామపెద్ద తన కుటుంబసభ్యులతో పై విషయం చెప్పి ఒప్పించేందుకు ప్రయత్నం చేశాడు కానీ దానికి కుటుంబసభ్యులు ససేమిర అని, ఒప్పుకోకుండా తిరిగి ఆ గ్రామపెద్ద మనసుని మార్చివేశారు. ఆ యువకుడు తనకు ఆ గ్రామపెద్ద ఇచ్చిన మాట నిమిత్తం గ్రామపెద్ద ఇంటికి వేళాడు కానీ గ్రామపెద్ద అలాంటి ఒడంబడిక ఏమిలేదు అని ఉంటే సాక్ష్యం చూపించమని పెద్దల సమక్షంలో యువకుడ్ని అడిగాడు. దానికి సమాధానం చెప్పాలి అని ఆ యువకుడు తిరిగి కాశికి ప్రయాణం అయి ఆ ఒడంబడికకు సాక్ష్యంగా ఉన్న గోపాలుని విగ్రహం దగ్గరకే వెళ్లి స్తుతిసుమాంజాలి సమర్పించి పలు విధాలుగా వేడుకొనగా ఆ అనంత కృపసాగారుడు,
పరమదయాకరుడు, అవ్యాజకారుణమూర్తి అయిన దేవకినందనుడు ఆ యువకుడి భక్తికి మెచ్చి, పరీక్షించదలచి (పరీక్ష ఆయనే పెడతాడు, దానికి శక్తి ఆయనే ఇస్తాడు.) "నేను వొట్టి విగ్రహాన్ని కదా!!! నేను వచ్చి సాక్ష్యం ఎలా చెప్పగలను?!" అంటే దానికి ఆ యువకుడు, "స్వామీ, మీరు నాతో చెప్పిన మాట మా ఊరు వచ్చి ఆ పెద్దల సమక్షంలో చెప్పకూడదా?!" అనగానే "సరే వస్తా కానీ ఒక షరతు నువ్వు వెనుకకు తిరగకుండా ముందుకు నడుస్తూ ఉండాలి ఎట్టి పరిస్థితులలో కూడా నువ్వు వెనుకకు తిరగకూడదు" అని ఒక షరతు విధించి ఆ యువకుడితో రావడానికి బయలుదేరాడు. స్వామి వస్తున్నాడు అని తెలియడానికి ఆయన చిరుమువ్వల శబ్దం చేసుకుంటూ వస్తున్నాడు. ఆ యువకుడి గ్రామ పొలిమేరలోకి వచ్చేసరికి ఆ మువ్వల శబ్దం ఆగిపోయింది. అంతే వెనుతిరిగి చూడబోతే ఆ యువకుడికి అక్కడ గోపాలుని విగ్రహం కనిపించింది. స్వామివారిని తిరిగి వేడుకొనగా కూడా ఫలితం లేకుండాపోయింది కానీ ఈలోపు ఈ విషయం తెలుసుకున్న ఆ ఊరి జనం ఊరి పొలిమేర లోకి వచ్చి ఆ స్వామిని దర్శించుకున్ని తమ కోసమే స్వామి ఇక్కడకు వచ్చారు అని సంతోషించి అక్కడే ఆ యువకుడికి, గ్రామపెద్ద యొక్క కూతురిని ఇచ్చి వివాహం చేశారు. ఆ ప్రాంతమే అప్పటి సాక్షిగోపాల్, నేటి సఖిగోపాల్. 

సర్వకాలసర్వావస్థలయందు ఆ గోపిజనలోలుని అపార కరుణకటాక్షవీక్షణాలు ఆ హృదయేశ్వరుని పాదములను నమ్మిన వారిపై ఎల్లప్పుడూ వర్షిస్తూ ఉంటాయి.

Here, I'd like to say a few words about this for those who believe no proof is necessary...for those who don't no proof is sufficient.

 
- సుబ్రహ్మణ్యం బాబు మైలవరపు
 
 
 

Quote of the day

The life of an uneducated man is as useless as the tail of a dog which neither covers its rear end, nor protects it from the bites of insects.…

__________Chanakya