Online Puja Services

గురువాయూరప్ప మహిమ

13.59.36.203

మేల్పత్తూరు నారాయణభట్టాద్రి నంబూద్రి 16వ శతాబ్దపు గొప్ప పండితుడు , గణితశాస్త్ర , ఖగోళశాస్త్రవేత్త. అంతకుమించిన దైవభక్తుడు.
అలాటి వ్యక్తి వాత వ్యాధి బారినపడడం జరిగింది.

ఎంతమంది ప్రముఖ వైద్యులు వైద్యం చేసినా ఆ వ్యాధి గుణమవలేదు. చివరకు నారాయణ భట్టాద్రి, ఏదైనా పరిహారం సూచించి తన వ్యాధి నయమయే తరుణోపాయం కోసం తన సేవకుడైన గోపాలుని పేరు పొందిన ఒక జ్యోతిష్కుని వద్దకు పంపాడు.

భట్టాద్రి జాతకం పట్టుకుని జోస్యుని వద్దకు వెళ్ళిన గోపాలన్ , కొద్ది సేపటిలోనే గాభరాగా కంగారుపడుతూవచ్చాడు. " అయ్యా ! తమరు 
గురువాయూరప్పన్ ఆలయంలో మీరు నాలిక మీద చేపని పెట్టుకొని, నములుతూ పాట పాడితే , మీ వాత వ్యాధి గుణమవుతుందని జోస్యుడు చెప్పాడని , కానీ అతి పవిత్రమైన గురువాయూరప్పన్ ఆలయంలో మీరు ఆపని చేయవచ్చా? జోస్యుడు ఇటువంటి పరిహారం చెప్తాడని తెలిసి వుంటే , నేను ఆయన వద్దకి వెళ్ళి వుండే వాడిని కాదు. " అని విచారపడుతూ అన్నాడు.

"గోపాలా! జ్యోతిష్కుడు చెప్పిన మాటల అర్ధాన్ని నీవు సరిగా గ్రహించలేదు. జ్యోస్యుడు చెప్పింది చేపని నమిలి పాడమని అర్ధంకాదు. శ్రీమహావిష్ణువు అవతారాలలో మొదటి అవతారమైన మీనముతో ఆరంభించి దశావతారాలను స్తోత్రం చేయమని అర్ధం. రా ! మనం గురువాయూరప్పన్
ముందు దశావతారాలను కీర్తిస్తూ పాడితే స్తుతి ప్రియుడైన శ్రీ హరి ఆనందించి నా వాత వ్యాధిని గుణపరుస్తాడు. అని చెప్పాడు భట్టాద్రి.

వాత వ్యాధితో బాధపడుతున్న భట్టాద్రిని పల్లకీలో మోసుకుని , పదిమంది వెంటరాగా గురువాయురుకు తీసుకువెళ్ళారు. మరునాడు ప్రాతఃకాలమున గురువాయూరు చేరేరు. అక్కడ వున్న నది మెట్లమీద భట్టాద్రికి స్నానం చేయించి నూతనవస్త్రాలు ధరింపచేసి 
గురువాయూరప్పన్ ముందు దక్షి ణంగా వున్న అరుగు మీద ఆశీనుని చేశారు. 

అరుగు మీద కూర్చున్న భట్టాద్రికి ముఖం తిప్పి గురువాయూరప్పన్ ను దర్శించలేకపోయాడు. వాత వ్యాధి వలన దేహంలోని అన్ని అవయవాలు పనిచేయడం మానేశాయి.

అప్పుడు "భట్టాద్రి! మెడ త్రిప్పడానికి మీరు శ్రమపడవద్దు? నా మెడ రెండు ప్రక్కలా బాగానే వుందికదా , నేనే మీ వైపు తిరుగుతాను " అని గురువాయూరప్పన్ తన తలను తిప్పి భట్టాద్రికి అనువుగా దర్శనాన్ని కటాక్షించాడు. 

"మీనం తో మీరు గానం ఆరంభించ వచ్చును.అని గురువాయూరప్పన్ భట్టాద్రికి ఉత్తరువు యిచ్చాడు. అప్పుడు భక్తి తత్పరతతో నారాయణ భట్టాద్రి మత్స్యావతారంతో ఆరంభించి దశావతారాలను కీర్తిస్తూ స్తోత్రం చేశాడు. మొత్తం వేయి శ్లోకాలు కలిగిన ఆ స్తోత్రావళే తర్వాత నారాయణీయంగా లోకప్రసిధ్ధి పొందింది. నారాయణ భట్టాద్రి స్తోత్రగానం చేస్తున్నంతసేపు గురువాయూర్ కృష్ణుడుతన తలని ఊపుతూ తన ప్రమోదాన్ని
తెలిపాడు. 

నారాయణ భట్టాద్రి పరవశంతో స్తోత్రాలు సంపూర్ణం చేసిన మరుక్షణమే భట్టాద్రి యొక్క వాత వ్యాధి పరిపూర్ణంగా గుణమైనది. వ్యాధి నయమైన పిదప తనకి యీ ఉపాయం తెలిపి మార్గం చూపిన జ్యోతిష్కుని కలసి తన ధన్యవాదాలు తెలిపాడు భట్టాద్రి. 

జ్యోతిష్కుని చూసి, అయ్యా! గురువాయూరప్పన్ కృష్ణుని రూపంలో కదా దర్శన మనుగ్రహిస్తున్నాడు. కాని మీరు కృష్ణుని కాదని 
ఎందుకు మత్స్యమూర్తితో మొదలు పెట్టి దశావతారములను పాడమని ఆదేశించారు. అందులోని అంతరార్ధమేమిటి? అని అడిగాడు భట్టాద్రి.

దానికి జ్యోతిష్కుడు"మత్స్యమూర్తి గా అవతరించిన శ్రీ హరి, ఎవరివల్ల ఉపదేశించ సాధ్యం కాని వేద రహస్యాలను, సత్యవ్రతునికి, బ్రహ్మ దేవునికి సప్త ఋషులకు మాత్రమే ఉపదేశించాడు. మత్స్యపురాణాన్ని, బోధించిన శక్తిమంతుడై వున్నందున మత్స్యమూర్తి "వాచస్పతిః" (వాక్కులకు అధిపతి) అని పిలవబడుతున్నాడు. వేయి శ్లోకాలను మీరు వ్రాయాలంటే , వాక్కులకు అధిపతి అయిన మత్స్యమూర్తి మిమ్ములను కరుణించి అనుగ్రహించాలి. అందుకనే చేపని నోట్లో నాన పెట్టమని చెప్పాను అని "జోస్యుడు బదులిచ్చాడు.

' వాక్' అంటే మాట.

'వాచస్పతి' అంటే మాటలకి అధిపతి అని అర్ధం. 

జ్ఞానబోధకి అనువైన పలు వేద రహస్యాలు వంటి మరెన్నో గొప్ప విషయాలను మత్స్యమూర్తి మత్స్య పురాణంలో విశదపరిచి అనుగ్రహించినందున
మత్స్యమూర్తి 'వాచస్పతిః' అని పిలువ బడుతున్నాడు.

ఆ నామమే విష్ణు సహస్రనామాలలో 218 వ నామం. "వాచస్పతయేనమః" అని నిత్యం పారాయణం చేసే భక్తులకు, శ్రీమహావిష్ణువు వాక్శ్శక్తిని
ప్రసాదిస్తాడు.

Quote of the day

Facts are many, but the truth is one.…

__________Rabindranath Tagore