Online Puja Services

భగవంతునికి మన కోరికలు ఇలా విన్నవించుకోవాలట !

3.145.111.183

భగవంతునికి మన కోరికలు ఇలా విన్నవించుకోవాలట !
-లక్ష్మీ రమణ 

భగవంతుడికి అందరమూ ఏదొక కోరిక నివేదించుకుంటూనే ఉంటాము.  భగవంతునికి ఏ కోరికా నివేదించనివాడు , తానె స్వయంగా భగవంతుని స్వరూపమై ఉంటాడు . ఆయనకీ , తనకీ ఉన్న అబేధనని తెలిసికొన్నవాడై ఉంటాడు . తానకి తానూ పూజలూ పునస్కారాలూ చేసుకోరుకదా మరి ఎవరైనా కానీ ! సరే, అసలు  ఆ భగవంతుడిని మన్మ ఏదైనా కోరుకునేప్పుడు, ఆ విధానం  ఎలా ఉండాలనే సందర్భాన్ని కృష్ణపరమాత్మే స్వయంగా చెప్పారు. అదేమిటో తెలుసుకుందామా ?

బిల్వమంగళుడు, గురూరమ్మ దంపతులు గొప్ప కృష్ణ భక్తులు . నిత్యం ఆ దంపతులు కృష్ణ భక్తిలో మునిగితేలుతూ ఉండేవారు . ఇక కృష్ణపరమాత్మకి తన భక్తులపై అవాజ్యమైన ప్రేమానురాగాలు.    వారి ఇంటికి నిత్యం తానె స్వయంగా  వచ్చి విందుభోజనం చేసి వెళ్ళే వారు కృష్ణయ్య . ఈ భాగ్యానికే వారేంత అదృష్టవంతులో ! అనుకోకండి . బిల్వమంగళుడు ఏకాదశీ , దశమి మరియు శ్రవణ నక్షత్రం రోజులలో తులసి తీర్ధం మాత్ర పుచ్చుకుని ఉపవసించడం ఆచారంగా అనుసరిస్తూ ఉండేవాడు .  కాని ఈ రోజులలో చక్కెర పొంగలి, పాల పాయసం మాత్రం అడిగి చేయమని చెప్పి, గురూరమ్మ చేత  ప్రియంగా చేయించుకొని మరీ  తినే వాడు కృష్ణపరమాత్మ. వీరిద్దరి స్నేహానుబంధం , సాన్నిహిత్యం ప్రపంచమంతా తెలిసిందే! 

ఇదిలా ఉంటే, ఒకనాడు బిల్వమంగళుని ఇంటికి అతని స్నేహితుడు వచ్చాడు. ఆటను  కడుపునొప్పితో బాధపడుతున్నాడు .  భగవాన్ కృష్ణునికి తన మాటగా నివేదించి , ఈ కడుపునొప్పి నుండీ రక్షించమని బిల్వమంగళుణ్ణి అడిగాడు ఆ స్నేహితుడు. నిజానికి ఆయన వైద్యుని దగ్గరికి వెళ్ళవలసింది . కానీ మనం కూడా ఎవరైనా స్నేహితునికి ఫలానా అధికారి తెలుసు అంటే, మనం ప్రయత్నం చేసే ముందే ,ఆయన చేత సిఫారసు పత్రాలు ఇప్పించమని ఆ స్నేహితుణ్ని ఆశ్రయిస్తాం కదా ! ఇదీ అలాంటిదేనన్నమాట !

సరేనని  బిల్వమంగళుడు కృష్ణ భగవాన్ ని  దర్శించి " తన స్నేహితుడు కడుపు నొప్పితో బాధపడుతున్నాడు , మీతో మొరపెట్టమని చెప్పాడు." ఆని అన్నాడు. వెంటనే,  శ్రీ కృష్ణుడు " ఇది పూర్వ జన్మ కర్మ ఫలితం. నేనేమి చేయలేను” అన్నాడు.

ఈ బదులే తన మిత్రునికి తెలిపాడు బిల్వమంగళుడు. ఆ మిత్రుడు మనసు నొచ్చుకున్నాడు . ఇది పని కాదని,  ఆ మిత్రుడు గురూరమ్మని కలిసి తన బాధ మొరపెట్టుకున్నాడు . ఆ తరువాత , ప్రతిరోజూ వస్తున్నట్టే తమ ఇంటికి వచ్చిన శ్రీకృష్ణుని ప్రేమగా ఆహారం వడ్డించింది గురూరమ్మ. తర్వాత , మిత్రుని కడుపు నెప్పి బాధ చెప్పి , “నీవల్లనే అతని బాధ తగ్గించబడుతుంది.  కాబట్టి కాస్త కనికరించవయ్యా కన్నయ్యా”  అని ఆప్యాయంగా  చెప్పింది . భక్తితో ప్రార్ధించింది . .

ఆమె ప్రార్ధనను స్వీకరించిన శ్రీ కృష్ణుడు మిత్రుని కడుపునెప్పిని  తగ్గించి కటాక్షించాడు. 
ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అయ్యాడు మిత్రుడు. బిల్వమంగళుని వద్దకు వెళ్ళాడు. గురూరమ్మ ప్రార్ధనతో తన ఉదర బాధ తీరినట్టు చెప్పాడు.

బిల్వమంగళునికి కోపం మెచ్చింది .  తాను వేడుకొన్నప్పుడు భగవంతుడు తన మాట  వినిపించుకోలేదే  అనే చింత అతణ్ణి కలిచివేశింది. అప్పుడిక ఆగలేక, ఆ  భగవంతుని అడగనే అడిగాడు. అప్పుడు కిట్టయ్య  " బిల్వమంగళా ! మిత్రుని ఉదరబాధను గురించి నీవు చెప్పడం ఏదో విషయం చెప్పినట్లు మాత్రమే వున్నది. అందుకే ఉదర బాధ వచ్చిన కారణం మాత్రమే నీకు తెలిపాను”. కానీ , గురూరమ్మ ప్రార్ధన మాతృప్రేమతో  నిండి వున్నది. నాకు కమ్మగా భోజన్మ పెట్టి, నిండైన మనసుతో తన బిడ్డని అడిగినట్టు అడిగింది . ఆత్మార్ధమైన పవిత్ర భక్తి , ప్రేమలతో వేడుకునే భక్తుల కోరికలు నేను తప్పక నెరవేరుస్తాను. " అని విశిద పరిచాడు. సత్యం గ్రహించిన బిల్వమంగళుడు, కన్నీటితో భగవాన్ శ్రీ కృష్ణునికి అభివందనాలు సమర్పించాడు.

Quote of the day

A coward is incapable of exhibiting love; it is the prerogative of the brave.…

__________Mahatma Gandhi