Online Puja Services

కర్ణాటక లోని శివగంగ లో అన్ని అద్భుతాలే..

18.226.96.61
కర్ణాటక లోని శివగంగ లో అన్ని అద్భుతాలే..    
 
పరమశివుడు స్వయముగా ఇచ్చే తీర్థం మకరజ్యోతినాడు మాత్రమే 
 
 
     అన్ని దేవాలయాల లోను తీర్థం,  పూజారి స్వాములు తాము తయారు చేసిన తీర్థం భక్తులకు ఇవ్వడం ఆనవాయితి. కాని శివుడే ఉత్పన్నం చేసి ఇచ్చే తీర్థం ఇక్కడ ప్రత్యేకం. అది పుచ్చుకోవాలి అన్న,  ఆ తీర్థం శివుడు ఇవ్వాలన్న,  మకర సంక్రమణము జరుగ వలసినదే.
       
       కర్ణాటక లో శివగంగ అనే క్షేత్రం. సముద్ర మొత్తానికి 3000 అడుగుల ఎత్తులో కల కొండ.  ఈ కొండ తూర్పు నుంచి చూస్తే పడుకున్న నందిలా కనిపిస్తుంది. పడమటి నుంచి చూస్తే   కూర్చొన్న వినాయకుడిలా కనిపిస్తుంది. ఉత్తరం నుంచి చూస్తే పెద్ద పాములా, దక్షిణము నుండి లింగాకారంలో కనిపిస్తుంది.
 
     ఈ కొండపైనకు చేరడం చాలా కష్టం. అక్కడ ఒక రాతి స్థంభం ఉంటుంది. స్థంభం క్రింద ఒక పాదులో ఒక చిన్న రాతి తొట్టి ఉంటుoది. ఈ తొట్టిలో మకర సంక్రాంతి నాడు,    ఉదయాన నలభై ఔన్సుల నీరు ఉద్భవిస్తుంది. మరెప్పుడు ఇక్కడ నీటి జాడ కూడా ఉండదు. ప్రక్కనే మరో రాతి స్థంభం ఉంటుంది. దాని పై అఖండ జ్యోతిని వెలిగిస్తారు. అక్కడికి కొద్ది సమీపంలో ఒక కొండ బీటలో ఊట బావి ఒకటి ఉంటుంది. దీనినే పాతాళ గంగ అంటారు. వింత ఏమిటంటే వర్షా కాలములో బాగా వర్షం కురిసే రోజులలో నీరు పొంగే బదులు అడుగంటి పోతుంది. ఎండా కాలములో మాత్రము మట్టం కంటే పైకి నీరు ఉబుకుతుంటింది. 
 
       ఈ పవిత్ర ప్రదేశము లో ఆలయము గంగాధరేశ్వరుని ఆలయముగా ప్రసిద్ధి. ఇక్క శివుడి దేవేరి హున్నాదేవి. ఆమెకు అక్కడే ప్రత్యేక దేవాలయం కలదు. ఈ రెండు ఆలయాలకు ఇటుక, సున్నంతో కట్టిన పెద్ద పెద్ద గోడలు కలవు. 
 
      ఇక్కడ మకర సంక్రాంతి ఉదయాన కొండమీద స్థంభం మొదటి భాగంలో ఉన్న పై తొట్టిలో నీరు ఉద్భవించు కాలాన్ని గంగోత్పత్తి కాలమంటారు. ఇక మరెప్పుడు ఇక్కడ నీరు ఊరదు. ఆ నీటికి ప్రత్యేక పూజ చేస్తారు. 
 
       పై నీటిని ఏటా, స్వర్ణ పాత్ర లో పట్టి శివగంగ దేవాలయం నీటితో కలిపి , సగం పాత్ర నీరు,  మైసూర్ మహారాజు దర్బారు కు పంపుతారు. మిగిలిన తీర్థం అక్కడ చేరిన భక్తులకు పంచుతారు.
 
       మకర సంక్రాంతి రోజు శబరిమలలో శంకరుడు తనయుడు జ్యోతి రూపంలో భక్తులకు దర్శనం ఇస్తే, శివగంగ లో శివుడు భక్తులకు తీర్థం ఇస్తాడు. పవిత్ర పుణ్య భక్తులు ఉదయం ఇక్కడ తీర్థం పుచ్చుకొని, ఆకాశ మార్గాన సూక్ష్మరూపమున పయనించి, పొంన్నంబలమేడు లో హరిహర పుత్రుని జ్యోతి స్వరూపం దర్శించు కొంటారు. వారు కదా పుణ్యాత్ములు. హరుఁడు, హర పుత్రుని కరుణా కటాక్షములకు నోచుకొన్నవారు. 
 
      శివగంగ క్షేత్రమునకు వెళ్ళాలంటే కర్ణాటక రాష్ట్రం బెంగళూరు జిల్లాకు పోవాల్సినదే. పూనా--బెంగుళూరు రై లు మార్గం నుండి రెండు మైళ్ళ దూరం. 
 
 హర హర మహాదేవ శంభో శంకరా! పాహిమాం, త్రాహిమాం, రక్షమాo. హర హర    ఓం నమశివాయ 
 
- L. రాజేశ్వర్ 
 

Quote of the day

The life of an uneducated man is as useless as the tail of a dog which neither covers its rear end, nor protects it from the bites of insects.…

__________Chanakya