Online Puja Services

రంగులుమారే శివలింగం. మానసిక ప్రశాంతతనిచ్చే క్షేత్రం .

18.223.32.230

రంగులుమారే శివలింగం. మానసిక ప్రశాంతతనిచ్చే క్షేత్రం . 
- లక్ష్మి రమణ 

 భక్త జనకోటి హృదయాలపై ఆధ్యాత్మిక పరిమళాలను వెదజల్లే సుప్రసిద్ధ పంచారామ క్షేత్రాలలో 'సోమారామం' ఒకటి. ఈ ఆలయాన్ని సోమేశ్వర జనార్దన స్వామి ఆలయం అంటారు. తూర్పు గోదావరి జిల్లా , భీమవరం సమీపంలోని 'గుణిపూడి' గ్రామంలో ఈ క్షేత్రం వెలసింది. భక్త సులభుడైన శివయ్య ఇక్కడ 'సోమేశ్వరస్వామి' పేరుతో నిత్య పూజలందుకుంటూ ఉంటాడు. 

ఇక్కడి శివలింగం పౌర్ణమి రోజుకి తెలుపు రంగులోకి . అమావాస్య నాటికి నలుపు రంగులోకి మారుతూ వుంటుంది. చంద్రుడు ప్రతిష్టించిన కారణంగానే, ఆయనని అనుసరిస్తూ ఈ శివలింగం రంగుమారుతూ ఉంటుందని చెబుతుంటారు. మరి ఇలా మారడనికి అసలు రహస్యం ఏంటి, ఆలయ విశేషాలేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

పంచారామాలలో రెండవదైన సోమారామము రాజమండ్రి కి 59 కి.మీ. దూరంలో, విజయవాడకు 91 కి.మీ. దూరంలో ఉన్న పశ్చిమ గోదావరి జిల్లా బీమవరం పట్టణానికి 2 కి.మీ. దూరంలో ఉన్న గునిపూడి లో కలదు.

ఇక్కడ స్వామి వారు సోమేశ్వరునిగా పూజలు అందుకుంటున్నాడు. చంద్రుడికి సోముడన్న పేరు ఉన్న విషయం తెలిసిందే. అందువల్లే ఈ క్షేత్రాన్ని సోమారామం అని సోమేశ్వర క్షేత్రమని కూడా పిలుస్తారు. ఇక ఇక్కడ కొలువై ఉన్న స్వామివారిని సోమేశ్వరుడని పిలుస్తారు.

ఇక్కడున్న శివలింగానికి ఒక ప్రత్యేకత ఉంది అదేమిటంటే ఇక్కడున్న శివలింగానికి ఒక ప్రత్యేకత ఉంది అదేమిటంటే, మామూలు రోజుల్లో తెలుపు రంగు లో ఉండే శివలింగం అమావాస్య రోజు వచ్చేసరికి మాత్రం గోధుమ రంగులో మారుతుంది. తిరిగి పౌర్ణమి వచ్చేసరికి మామూలు స్థితికి వచ్చేస్తుంది.ఇది శతాబ్దకాలంగా జరుగుతోందిని ఇక్కడి పూజారులు చెబుతున్నారు. ఈ మార్పులను గమనించాలంటే అమావస్యతో పాటు పౌర్ణమి రోజున దేవాలయాన్ని సందర్శించాల్సి ఉంటుంది.

పురాణ కథ ఈ విశేషాన్ని తిలకించడానికి వివిధ ప్రాంతాల నుంచి భక్తులు వేలాదిగా ఇక్కడి తరలి వస్తుంటారు. ఇక్కడ గల స్వామి వారిని చంద్రుడు ప్రతిష్టించినాడని ప్రతిథి. ఇక ఈ శివలింగాన్ని చంద్రుడు ప్రతిష్టించడం వెనుక కూడా ఓ పురాణ కథ వుంది.

ఈ ఆలయం రెండు అంతస్తులుగా ఉంటుంది. సోమేశ్వరుడు కింది అంతస్తులోనూ, అన్నపూర్ణాదేవి పై అంతస్తులోనూ ఉంటారు.

ఇలా శివుడి పైన అమ్మవారు ఉండటం దేశంలో మరెక్కడా లేదని చెబుతారు. ఈ ఆలయానికి క్షేత్రపాలకుడు జనార్దన స్వామి.

 దేవాలయం ముందు భాగంలో రెండు నందులు ఉండగా ధ్వజస్తంభం వద్ద మరో నంది ఉంటుంది. అటు పై ఆలయ ప్రాంగణంలో ఒక నంది, దేవాలయం ఎదురుగా ఉన్న చంద్ర పుష్కరిణిలో మరో నంది ఉంటుంది. ఈ మొత్తం ఐదు నందులున్న క్షేత్రరాజం ఈ సోమారామం .  పంచ నందీశ్వర ఆలయం కావడం చేత ఈ క్షేత్రానికి పంచనందీశ్వర దేవాలయం అని కూడా పేరు.

ఈ క్షేత్రంలోని 'చంద్ర పుష్కరిణి' లో స్నానం చేస్తే పాపాలు పటాపంచలవుతాయని విశ్వసిస్తూ వుంటారు. తూర్పు చాళుక్యరాజైన చాళుక్య భీముడు ఈ దేవాలయాన్ని మూడో శతాబ్దంలో నిర్మించాడు. ఈ దేవాలయానికి ప్రాకారాలను, గోపురాన్నిఆయనే నిర్మించాడనడానికి చారిత్రక ఆధారాలు కనిపిస్తున్నాయి. అందువల్లే ఈ క్షేత్రానికి భీమారామం అనే పేరు కూడా ఉంది.

ప్రతి ఏడాది ఇక్కడ 'మహా శివరాత్రి' సందర్భంగా స్వామివారి కళ్యాణోత్సవాలు ఐదు రోజులపాటు బ్రహ్మాండంగా జరుగుతాయి. ఈ ఉత్సవాలకు కొన్ని లక్షల మంది వస్తుంటారు. అలాగే 'దేవీనవరాత్రులు' కూడా ఎంతో వైభవంగా నిర్వహించడం జరుగుతూ వుంటుంది. ఈ పర్వదినాల్లో ఆదిదంపతులను దర్శించడంవలన సకల పుణ్యఫలాలు ప్రాప్తిస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు.

ఎలా వెళ్ళాలి?

సోమారామంకు రోడ్,  రైలు మార్గాలు అన్ని ప్రధాన నగరాల నుండి ఉన్నాయి . విజయవాడ, ఏలూరుల  నుండి భీమవరానికి బస్సులు ఉన్నాయి. భీమవరం చేరుకున్న తరువాత గునిపూడికి ఆటోలో వెళ్ళవచ్చు. కార్తీక మస్సంలో ఒకే రోజులో పంచరామాలను సందర్శించడానికి టూర్ ప్యాకేజ్ ను APSRTC ప్రత్యేకంగా నిర్వహిస్తుంది. భీమవరం రైల్వే స్టేషన్ సోమేశ్వర ఆలయం నుండి 2 కిలోమీటర్ల దూరంలో ఉంది. గుణిపుడికి దగ్గరలో ఉన్న విమానాశ్రయాలు విజయవాడ / రాజమండ్రి.

shiva, Siva, Somaramam, Someswaram, pancharamam, 

Quote of the day

The Vedanta recognizes no sin it only recognizes error. And the greatest error, says the Vedanta is to say that you are weak, that you are a sinner, a miserable creature, and that you have no power and you cannot do this and that.…

__________Swamy Vivekananda