కరువు సమయంలో పేడ పట్టించుకోనే కాలభైరవుని ఆలయం

3.230.142.168

కరువు సమయంలో పేడ పట్టించుకోనే కాలభైరవుని ఆలయం !
-లక్ష్మీ రమణ 

కాలభైరవుడు ఉత్తర ప్రదేశ్ లోని కాశీ క్షేతం తర్వాత దక్షిణ భారత దేశంలో ఇసన్నపల్లిలో శ్రీ కాలభైరవ క్షేత్రంలో నెలకొని ఉన్నాడు. ఈ కాలభైరస్వామి దేవాలయం గురించి మనం ఈ రోజు తెలుసుకుందాం. 

శ్రీ కాలభైరవ స్వామి ఆలయం శ్రీ కాలభైరవ స్వామి ఆలయం దాదాపు రెండు వేల సంవత్సరాల క్రితం నాటి గుడి. రామారెడ్డి పేటలోని శివాలయం, రామాలయాల నిర్వహణకోసం దోమకొండ సంస్థానాధీశులు రాసిచ్చిన అగ్రహారమే ఇసనపల్లి. ఈగుడికి వెళ్ళే మార్గంలో చుట్టూ పచ్చటి పొలాలు, ప్రశాంతమైన వాతావరణం కనబడుతుంది. ఇక్కడున్న గ్రామానికి ఎనిమిది దిక్కులా అష్టభైరవులున్నారు. ఈ ఆయం దగ్గరకు వెళ్ళగానే కాస్తంత దూరం నుండే ఈ గుడి సిందూరం రంగులో దర్శనమిస్తుంటుంది . కాలభైరవుని అభయం అల్లంతదూరం నుండే భక్తులకి అనుభవమవుతుంది .

ఈ ఆలయంలో ఉన్న కాలభైరవుని విగ్రహం క్రీ.శ.13వ శతాబ్ధ కాలం నాటిదని చెబుతారు. సహజంగా ఈ గుడిలోని స్వామి పురాణాలు, తంత్ర గ్రంథాలు చెప్పిన విధంగా దిగంబర స్వరూపంగా కనిపిస్తుంది .  కాలమే తానైనవాడికి , వస్త్రాలతో పనియేముంది ? నిత్యానిత్యాలు, గోచరాగోచారాలు , అన్ని విభూతులూ తానైనవాడికి, వస్త్రంబరాలతో అవసరమేముంది ? 

ఏ ఆలయంలోని ప్రత్యేకత ఏమంటే, కరువు సమయంలో ఈ కాలభైరవుడు వర్షాలని కురిపిస్తాడు . అందుకోసం ఈ మూర్తికి స్థానికులు నిలువెల్లా పేడ పూస్తారట . ఆ పేడని ఆ స్వామే స్వయంగా తొలగించుకోవాలి . వర్షాలు పడి , ఆ నీటిధారలకి పేడ నాని , కరిగి వదిల్తే , సరేసరి ! లేదా ఆ పేడతోనే పాపం స్వామికి సహజీవనం . దానికోసమైనా ఆ స్వామి వర్షాలు కురిపిస్తారని ,  అలా  వర్షాలు బాగా పడతాయని  అక్కడ ప్రజలు ప్రగాఢమైన నమ్మకం.

కాలభైరవుడు దుష్టగ్రహ బాధలు నివారించగల శక్తి మంతుడు ఎవరైతే చేతబడి కలిగి ఉంటారో అలాంటి వారు ఈ దేవాలయంలో 21 రోజులు లేదా 41 నిద్ర చేస్తే మంచిదని, ఆలయ ప్రాంగణంలో ఉండే కోనేరులో స్నానం ఆచరిస్తే ఆరోగ్యం కుదుట పడుతుందని భక్తుల నమ్మకం. ఈ కాలభైరవుడు దుష్టగ్రహ బాధలు నివారించగల శక్తి మంతుడు. గ్రహబలాలను అధిగమించి అదృష్ట జీవితాన్ని , సంకల్ప సిద్ధిని పొందడం కాలభైరవ ఉపాసనతో సాధ్యమని శాస్త్రాలు చెబుతున్నాయి.

కాలస్వరూపం తెలిసినవాడు , కాలమే తానైనవాడు కాలభైరవుడు.  రుద్రాంశసంభూతుడు . ఇక్కడ  సంతానభాగ్యం పొందడానికి, వివాహ మరియు ఉద్యోగ సమస్యలున్నవారు ఈ ఆలయాన్ని సందర్శించి నియమం చేస్తే వారి కోరికలు తప్పక తీరుతాయని భక్తులు విశ్వసిస్తారు. భక్తులకు అనుగ్రహాన్ని , అతీంద్రమైన శక్తులను ప్రసాధించే కాలభైరవునికి గారెలతో మాల వేస్తారు.బెల్లం, కొబ్బరి నైవేద్యంగా పెడతారు. ఈశ్వరుడు ఆయుష్షుని ప్రసాదిస్తాడు. ఆయనకు పరమ విధేయుడైన కాలభైరవుడిని ఆరాదిస్తే ఆయుష్షు పెరుగుతుందని ప్రతీతి.

శ్రీ శివపురాణం ప్రకారం శ్రీ శివపురాణం ప్రకారం ప్రధానంగా అష్టభైరవులు వరుసగా చండభైరవ, అసితాంగ భేరవ, సంహార భైరవ, రురు భైరవ, క్రోథ బైరవ, కపాల భైరవ, భీషణ భైరవ, ఉన్మత్త భైరవ. ఈ ఇస్సన్నపల్లి గ్రామంలో అష్టభైరవులు వెలసినట్లు అక్కడివారు చెబుతారు.

అష్టబైరవులలో కాశీభైరవుడు 

అష్టబైరవులలో కాశీభైరవుడు పైభాగంలో ఉంటాడు, క్రింది ఈశాన్య భాగంలో కాలభైరవుడు ఉంటారు, ఈశ్యాన్య దిక్కును ఈవానుడు పాలించడం వల్ల ఈ గ్రామానికి ఇస్సన్నపల్లి అని పేరు వచ్చింది. భైరవుడంటే పోషకుడని, భయంకురడనే అర్థాలు వస్తాయి. భైరవుని దగ్గర కాలుడు (కాలం)కూడా అణిగి ఉంటాడు, కనుకనే కాలబైరవుడయ్యాడు. భైరవుణ్ణి శరణు కోరితే మృత్యు భయం తొలగిపోతుంది.

కార్తీక మాసంలో ఇక్కడ కార్తీక మాసంలో ఘనంగా స్వామివారికి ఉత్సవాలు నిర్వహిస్తారు. ఇసన్నపల్లిలో వెలసిన ఈ కాలభైరవున్ని దర్శించుకోవడానికి చుట్టుపక్కల జిల్లాల నుండే కాకుండా ఇతర రాష్టాల నుండీ కూడా భక్తులు సందర్శిస్తుంటారు.

తెలంగాణా రాష్ట్రంలోని కామారెడ్డి జిల్లాలో ఇసన్నపల్లి క్షేత్రం ఉంది . హైదరాబాదు నుండీ బస్సు సౌకర్యం ఉంది . 

Quote of the day

The season of failure is the best time for sowing the seeds of success.…

__________Paramahansa Yogananda