Online Puja Services

రుద్రాభిషేకం ఎన్నిసార్లు చేయాలి ?

18.222.22.244

రుద్రాభిషేకం ఎన్నిసార్లు చేయాలి ?
కూర్పు లక్ష్మీ రమణ 

రుత్ అంటే - దుఃఖం ద్రానయతి అని అర్థం . దుఃఖాన్ని నాశనం చేయువాడు రుద్రుడు . వశా  అనే ధాతువు నుండీ పుట్టిన శబ్దం శివ ! వశతి అంటే, ప్రకాశిస్తున్నవాడు అనిఅర్థం . ప్రకాశం అంటే, చీకటిని అంతం చేసేది . చీకటి అజ్ఞానానికి రూపమైతే, వెలుగు దాని నిరోధకం అంటే, జ్ఞానం . జ్ఞానం అంటే, మంలో ఉన్న ఆత్మే ! మొత్తంగా మనలోని పరమాత్మ ప్రకాశమే రుద్రుడు .  

కార్తీక మాసంలో మహాన్యాసపూర్వక రుద్రాభిషేకాలు ఆ పరమేశ్వరునికి విరివిగా చేస్తుంటారు . అయితే, ఈ రుద్రాభిషేకం చేసేందుకు ఒక లెక్కుంది .  ఏకాదశ రుద్రాభిషేకం అనేది మనం సాధారణంగా వినేమాటే . కానీ వీటిలో రుద్రం, మహారుద్రం, లఘు రుద్రం, అతి రుద్రంలోతేడాలు ఉన్నాయి. యజుర్వేదంలో మంత్రభాగమైన 11 అనువాకాల'శతరుద్రీయా'నికి 'రుద్రం' అని పేరు. దానిని ఒకసారి పఠిస్తూ చేసే అభిషేకం రద్రాభిషేకం అంటారు. దానికి 'రుద్రం', 'ఏకరుద్రం' అని పేర్లుకూడా ఉన్నాయి.

ఈ 11 అనువాకాల 'రుద్రం' పదకొండుసార్లుచెబుతూ చేస్తే 'ఏకాదశ రుద్రాభిషేకం' లేదా 'రుద్రి'అంటారు. రుద్రం అంటే - నమకం + చమకాలు . వీటిని కలుపుతూ చేసేదే రుద్రాభిషేకం .  పదకొండుసార్లు నమకం చేస్తే , ఒక్కసారి చమకం చెప్పాలి. ఈ లెక్కనే , చేసే విధానాన్ని బట్టి, సంఖ్యని బట్టి ఆవృత్తి , రుద్రమని , ఏకాదశ రుద్రమని , శత రుద్రమని, లఘు రుద్రమని , మహా రుద్రమని, అతిరుద్రమని పిలుస్తారు .   

వీటిల్లో ఆవృత్తి – నమకం 121 సార్లు, చమకం 11 సార్లు చెప్పితే ఆవృత్తి అంటారు.
2. రుద్రం- నమకం 121 సార్లు, చమకం – 11 సార్లు
3. ఏకాదశ రుద్రం- నమకం 14,641 సార్లు, చమకం-1331 సార్లు
4. శతరుద్రం- నమకం 1,61,051 సార్లు,చమకం 14,641 సార్లు
5. లఘురుద్రం- నమకం 17,71,561 సార్లు, చమకం- 1,61,051 సార్లు
6. మహారుద్రం- నమకం 1,94,87,171 సార్లు, చమకం- 17,71,561 సార్లు
7. అతిరుద్రం- నమకం 21,43,58,881 సార్లు, చమకం -1,94,87,171 సార్లు


ఈ రుద్ర మంత్రాలను అభిషేకానికి వాడితే 'రుద్రాభిషేకం', హోమంలో వినియోగిస్తే 'రుద్రయాగం'. ఈ అభిషేక తీర్థాన్ని భక్తితోగ్రహించటం ద్వారా జీవాత్మను ఆశ్రయించి ఉన్నసమస్త మాయాదోషాలు తొలగి, జీవుడు పరమాత్మ లోనికి ఐక్యం చెందుతాడు.

Quote of the day

God is to be worshipped as the one beloved, dearer than everything in this and next life.…

__________Swamy Vivekananda