శివయ్యా నీవే దిక్కయ్యా

3.80.3.192

శివయ్యా 

వేద మంత్రాల
పఠనము ఎరుగను 
భక్తితో చేయు  భజనలు తప్ప 

యజ్ఞ యాగాల 
జ్ఞానము లేదు 
అన్నినీవేనన్న ఆలోచన తప్ప

శ్రుతులు క్రతువుల
పరిజ్ఞానము లేదు 
నీవున్నావన్న నమ్మకము తప్ప 

పురాణముల  స్మృతులు  
పరిభాష తెలియదు 
ఆర్తితో నిను వేడుకొనుట తప్ప 

ఏమీ ఎరుగకపోవటము
జ్ఞానమో అజ్ఞానమో ఎరుగను 

కానీ

నిన్ను మెప్పించిన కన్నప్ప 
నాకు ఆదర్శము 

నిన్ను ఒప్పించిన నయనార్లు 
నాకు మార్గదర్సకులు 

ఏమీ ఎరుగకున్నా 
నీవున్నావని త్రికరణ శుద్ధిగా 
నమ్మితే చాలదా 

గుండె గుడిలో ప్రతిష్ఠితమై 
ఆర్తితో జనించిన కన్నీటినే 
అభిషేక జలముగా  స్వీకరించి 
జనన మరణాల చక్ర భ్రమణమును నిలిపి 
నీ పదసన్నిధిని ఒసగగల కరుణాసముద్రుడవు నీవయ్యా 

శివయ్యా నీవే దిక్కయ్యా 

- మురళి కలికోట

Quote of the day

Citizenship consists in the service of the country.…

__________Jawaharlal Nehru