Online Puja Services

పరమ శివునకు ఐదు ముఖాలు

3.15.211.107

పరమ శివునకు ఐదు ముఖాలు.....!!

అవి తత్పురుష, వామదేవ, సద్యొజాత, అఘోర, ఈశాన ముఖములు. ఇవి పంచభూతములకు ప్రతీకలు.

ఈ 5 ముఖములు భగవానుని 5 మహా కృత్యములైన సృష్టి( పుట్టుక), స్థితి (పెరుగుట), లయ (గతించుట), తీరోధాన ( కర్మనుబట్టి ఏ జన్మ ఎత్తాలొ/ మరల పుట్టుట / బ్రహ్మాండ నాశనం), అనుగ్రహములు(కైవల్యం / మోక్షం / శివ సాన్నిధ్యం ప్రసాదించుట. గుర్తుంచుకోవలసిన విషయం పుణ్యము ఎక్కువ చేసిన పాపము ఎక్కువ చేసిన తిరిగి జన్మించాలి. పాపము - పుణ్యము లేని సమతుల్య స్థితి లో మాత్రమే మోక్షము) చేయబడును.

ఈ 5 ముఖములనుండి 7 (2+1+1+2+1) కోట్ల మహా మంత్రములు ఉద్భవించినవి. అవి:
సద్యొజాత ముఖము నుండి గాయత్రి మొదలైన 2 కోట్ల మంత్రములు ఉద్భవించినవి. వీటిని పూర్వమ్నాయ మంత్రములు అంటారు.

సద్యొజాత - పశ్చిమ దిశ - అధిపతి సుబ్రహ్మన్యుడు - పృధ్వి తత్వం(సమస్త ప్రాణులు భూమి నుండే పుట్టును) - స్రుస్టి.

వామదేవ ముఖము నుండి 1 కోటి మంత్రములు ఉద్భవించినవి. వీటిని దక్షిణాంమ్నాయ మంత్రములు అంటారు. శైవాగమమ్ ఇందులోనిదే.

వామదేవ - ఉత్తర దిశ - అధిపతి కల్ప వృక్షం క్రింద పార్వతీ సహిత ఈశ్వరుడు - జల తత్వం (సమస్త ప్రాణులు నీటి వలననే జీవించి / వృద్ది పొందును) - స్థితి.

అఘోర ముఖమునుండి వైష్ణవాగమంకు( విష్ణు తత్వాన్ని ఆరాధించే వారు) సంబంధించిన 1 కోటి మంత్రములు ఉద్భవించినవి. వీటిని పశ్చిమామ్నయమ్ మంత్రాలు అంటారు.
అఘోర - దక్షిణ దిశ - అధిపతి దాక్షిణామూర్తి - అగ్ని తత్వం ( అన్నిటినీ కాల్చి భస్మం చేయటం) - నాశనం.

తత్పురుష ముఖము నుండి శక్తేయములైన(శక్తి ని ఉపాశించే వారు ఆచరించే విధానం శాక్తేయం) 2 కోట్ల మంత్రములు ఉద్భవించినవి. మహావిద్యాది మంత్రములు ఇందులోనివే. వీటిని ఉత్తారాంన్యాయ మంత్రాలంటారు.

తత్పురుష - తూర్పు దిశ - వాయు తత్వం (ఒక చోటనుండి మరో చోటికి ప్రయాణం) - తిరొధానం, ఈశాన్య ముఖమునుండి ఆత్మ-ఆనందం కు సంబంధించిన 1 కోటి మంత్రములు ఉద్భవించినవి. వీటిని ఊర్ధ్వామ్న్యాయ మంత్రాలు అంటారు.

ఈశాన - ఊర్ద్వ దిశ - అధిపతి రుద్రుడు - ఆకాశ తత్వం – అనుగ్రహం.
అందువలన ఈ 5 ముఖములను స్తుతించటం వలన 7 కోట్ల మహా మంత్ర జప ఫలితం ఉంటుంది.

అంతే కాదు దేవునికి మహా నివేదన సమయములో ఈమహా మంత్రాలతోనే పవిత్రించబడును. 
వాటినే "సధ్యోజాతాది పంచబ్రహ్మ మహామంత్రాలు" అంటారు..

 
- రాజేంద్ర ప్రసాద్ తాళ్లూరి 

Quote of the day

Just as a candle cannot burn without fire, men cannot live without a spiritual life.…

__________Gautam Buddha