ఈ శివలింగం చాలా మహిమ కలది గురూ

3.231.220.225

ఓంకారేశ్వర్ జ్యోతిర్లింగ క్షేత్రం. 

మధ్యప్రదేశ్ లోని ఓంకారేశ్వర్ లో కల గౌరీ సోమనాథ్ మందిర్ లో మహాశివునికి అద్భుతమైన సోమవారం ఉదయం పూజ వీడియో ఇది. 

ఈ మందిరం లో 6 అడుగుల ఎత్తున్న శివలింగం వుంది. దీని ప్రత్యేకత ఏంటంటే ఇద్దరు పెద్దలు రెండువైపులా నుంచి ఆ లింగాన్ని ఆలింగనం చేసుకున్నా వారి చేతులు కలవలేవు. కానీ అదే మేనమామ మేనల్లుడు అయితే వారి చేతులు కలుస్తాయి. అదే విచిత్రం. 

పూర్తి మృదువైన నల్ల రాతితో తయారు చేయబడిన ఈ శివలింగం చాలా పాతది అయినప్పటికీ, ఇప్పటికి కొత్తదానిలా నిగనిగలాడుతూ ఉంటుంది. . అలాగే బయట కూర్చుని వున్న భంగిమలో వున్న నంది కూడా ఇదే మృదువైన రాతితో, అదేవిధంగా నిగనిగలాడుతూ ఉంటుంది. . పురాణ కధనాల ప్రకారం ఈ ఆలయంలో ఎవరైనా నంది కొమ్ముల నుంచి శివుడిని చూస్తే వారి మరుజన్మకి సంబంధించిన విషయాలు గోచరిస్తాయని అని నమ్మకం.

Quote of the day

If you desire to be pure, have firm faith, and slowly go on with your devotional practices without wasting your energy in useless scriptural discussions and arguments. Your little brain will otherwise be muddled.…

__________Ramakrishna