Online Puja Services

మోక్షప్రదం సులువైన శివషడాక్షరీ స్తోత్రం!!

18.218.55.14

పాపహరణం, కామ్య లాభం, జ్ఞాన, మోక్షప్రదం సులువైన శివషడాక్షరీ స్తోత్రం!!
- లక్ష్మి రమణ 

పాపం చేయనివాడు ఈ జగతిని ఎవరైనా ఉన్నారంటే, అతను ఖచ్చితంగా భగవంతునితో సమానమే కాదు స్వయంగా భగవానుడే ! తెలిసో తెలియకో, ప్రతి ఒక్కరమూ ఎంతో కొంత పాప, పుణ్యాల మూటలు మోస్తూనే ఉంటాము. వచ్చే ధనం కన్నా, పోయే  ఖర్చులు ఎప్పుడూ ఎక్కువగానే ఎలా కనిపిస్తాయో, అలాగే చేసే పుణ్యాల కన్నా పాపాల చిట్టా ఎక్కువగా ఉంటూ ఉంటుంది. పాపపుణ్యాల విచారణ లేనివారికి, ధర్మాచరణ మీద నమ్మిక లేనివారికి మనం చెప్పవలసిన అవసరం లేదు . వారి కర్మని వారు అనుభవిస్తారు . కానీ సనాతన ధర్మాన్ని పాటించే వారందరికీ ఈ చింత ఖచ్చితంగా ఉంటుంది . అటువంటి పాపము ఎంత ఘోరమైనదైనా, పస్చాత్తాప హృదయంతో, శివ సాన్నిధ్యంలో  శివషడాక్షరీ స్తోత్రం నిత్యమూ చదివితే, ఖచ్చితంగా తొలగిపోతుంది అని మహేశ్వరుడే స్వయంగా చెప్పిన మాట. ప్రతి సోమవారం (కుదిరితే ప్రతి రోజూ)  ఖచ్చితంగా ప్రతి మాసంలో వచ్చే మాస శివరాత్రి / పక్షంలో వచ్చే చతుర్దశి తిధి రోజునా చేసుకోవడం చాలా మంచిది. కేవలం ఏడు వరుసలు ఉండే ఈ చిన్న స్తోత్రం చక్కని ఫలితాన్ని ఇస్తుంది.  పాపాలని తొలగించడం , ఇస్టకామ్యాలని సిద్ధింపజేయడం , అంతాన శివలోకప్రాప్తి ఇంతకన్నా మహిమాన్వితం ఇంకేముంటుంది ? 

శివషడాక్షరీ స్తోత్రం: 

ఓంకారం బిన్దుసంయుక్తం నిత్యం ధ్యాయన్తి యోగినః |
కామదం మోక్షదం చైవ ఓంకారాయ నమో నమః ||౧||

నమన్తి ఋషయో దేవా నమన్త్యప్సరసాం గణాః |
నరా నమన్తి దేవేశం నకారాయ నమో నమః ||౨||

మహాదేవం మహాత్మానం మహాధ్యాన పరాయణమ్ |
మహాపాపహరం దేవం మకారాయ నమో నమః ||౩||

శివం శాన్తం జగన్నాథం లోకానుగ్రహకారకమ్ |
శివమేకపదం నిత్యం శికారాయ నమో నమః ||౪||

వాహనం వృషభో యస్య వాసుకిః కణ్ఠభూషణమ్ |
వామే శక్తిధరం దేవం వకారాయ నమో నమః ||౫||

యత్ర యత్ర స్థితో దేవః సర్వవ్యాపీ మహేశ్వరః |
యో గురుః సర్వదేవానాం యకారాయ నమో నమః ||౬||

షడక్షరమిదం స్తోత్రం యః పఠేచ్ఛివసన్నిధౌ |
శివలోకమవాప్నోతి శివేన సహ మోదతే ||౭||

ఇతి శ్రీరుద్రయామలే ఉమామహేశ్వరసంవాదే శివషడక్షరస్తోత్రం సంపూర్ణమ్ ||

#shadaksharistotram #shiva

Tags: Shiva, siva, shadakshari, stotram

Quote of the day

The Vedanta recognizes no sin it only recognizes error. And the greatest error, says the Vedanta is to say that you are weak, that you are a sinner, a miserable creature, and that you have no power and you cannot do this and that.…

__________Swamy Vivekananda