మనం కోరుకున్న కోరికలు దిగ్విజయంగా పూర్తవ్వాలని కోరుకుంటూ పూజలు, పునస్కారాలు చేయడం పరిపాటి. అనుకున్నది జరగాలని కోరుకుంటూ వివిధ రకాల యజ్ఞయాగాదులు, పూజలు చేస్తుంటాం.
ముఖ్యంగా జ్యోతిష్యుల సలహాల ప్రకారం నవగ్రహ అనుగ్రహం కోసం ప్రత్యేక పూజలు చేస్తుంటాం. ఇలా నవగ్రహాల అనుగ్రహం కోసం ప్రత్యేక పూజలు, ప్రదక్షిణలు చేయడంతో పాటు కొన్ని వ్రతాలను ఆచరిస్తే నవగ్రహ ప్రభావంచే ఏర్పడే దుష్పలితాలకు దూరంగా ఉండవచ్చునని పురోహితులు చెబుతున్నారు. నవగ్రహాల అనుగ్రహానికి చేయవలసిన వ్రతాలను ఓ సారి పరిశీలిద్ధాం...!
సూర్యగ్రహ అనుగ్రహముకు రథసప్తమి, శ్రీరామనవమి, కేదారేశ్వర, సూర్య చంద్ర వ్రతము చేయాలి. అలాగే చంద్ర గ్రహానికి అమావాస్య సోమతి వ్రతం, కృష్ణాష్టమి వ్రతం, సోమవార వ్రతం, కుజుడు అనుగ్రహానికి నాగుల చవితి, నాగ పంచమి, అంగారక చవితి, కాత్యాయనీ వ్రతము, కుజగౌరీ వ్రతము చేయాలి.
బుధగ్రహ అనుగ్రహానికి శ్రీ అనంత పద్మనాభ వ్రతము, శ్రీ సత్యనారాయణ వ్రతము, తులసీ వ్రతము, గురు గ్రహానికి శ్రీ సత్యసాయి వ్రతము, శ్రీ సత్యదత్త వ్రతము, త్రినాథ వ్రతాలను చేయాల్సి ఉంటుంది.
అలాగే శుక్రుడు అనుగ్రహానికి వరలక్ష్మీ వ్రతం, వైభవలక్ష్మీ వ్రతం, శ్రీలక్ష్మి కుబేర వ్రతం, సంతోషిమాత, అనఘాదేవి వ్రతాలను చేయాలి. శని గ్రహం అనుగ్రహానికి హనుమద్వ్రతము, శివరాత్రి, శనైశ్చర వ్రతాలు, రాహు గ్రహానికి శ్రీదేవి నవరాత్రి, సావిత్రీ, షోడశగౌరీ వ్రతం, కేతువు అనుగ్రహానికి వినాయక చవితి, సంకష్టహర చతుర్థి, పుత్రగణపతి వ్రతాలు చేస్తే ఫలితం వుంటుందని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు.
There are currently 1 users browsing this thread. (0 members and 1 guests)
Bookmarks