కార్తీక మాసంలో నవగ్రహ దీపాల నోమును ఆచరించినట్లైతే...అష్టైశ్వర్యాలు చేకూరుతాయని విశ్వాసం. ఈ నోములో నవగ్రహాలదే ప్రధాన తాంబూలం. కార్తీక మాసంలో మూడు రోజుల పాటు ఈ నోమును నిష్ఠనియమాలతో పాటిస్తారు.


ముందుగా... ఆదిపూజ్యుడైన గణపతి ఆరాధన చేసి, ఆ తర్వాత శివలింగార్చన చేయాలి. తర్వాత నవధాన్యాలను కొద్దికొద్దిగా తీసి వాటిపై దీప ప్రమిదల నుంచి "ఓం నమఃశివాయ" మంత్రాన్ని 108 సార్లు స్మరించాలి.
తర్వాత అమ్మవారికి సంబంధించిన స్తోత్ర పారాయణ చేసి తొమ్మిదిమంది బ్రాహ్మణులకు ఆ దీపాలను మనస్ఫూర్తితో.. ఇష్టదైవాన్ని స్మరించుకుని దానం చేయాలి. ఈ నోమును శుభతిథులలో సాయంత్రం సమయాన మాత్రమే చేయాలని పురాణాలు చెబుతున్నాయి.
నోము పూర్తయిన తర్వాత అక్షతలను గృహం ఈశాన్య భాగంలో కొద్దిగా చల్లి, కుటుంబంలోని సభ్యుల శిరస్సుపై చల్లుకోవాలి. ఈ నోమును నియమాలతో మూడు రోజుల పాటు ఆచరించినట్లైతే ఆ గృహంలో సిరిసంపదలు, సుఖసంతోషాలు వెల్లివిరుస్తాయని విశ్వాసం.