కార్తీక మాసములో కొన్ని ప్రాంతాలలో నవగ్రహ దీపాల నోమును కూడా నోస్తారు.ఈ నోములో నవగ్రహాలదే ప్రధాన తాంబూలం. కార్తీక మాసంలో మూడు రోజులపాటు ఈ నోమును యజ్ఞభావనతో చేస్తారు.


ముందుగా గణపతి ఆరాధన చేసి, తరువాయి శివలిం గార్చన చేసి, నవధా న్యాలను కొద్ది కొద్దిగా తీసి వాటిపై దీప ప్రమి దల నుంచి ఓం నమఃశ్శివాయ మంత్రా న్ని నూట ఎనిమిది సార్లు స్మరిస్తారు. తరువాత అమ్మవారికి సంబంధించి స్తోత్ర పారాయణ చేసి తొమ్మండు గురు బ్రాహ్మణులకు ఆ దీపాల ను దానం ఇస్తారు. దానం చేసేటప్పుడు యథాశక్తి దక్షిణను మాత్రం నిండు మనసుతో సమర్పించాలి. ఈ నోము శుభతిథులలో సాయం వేళ లలో మాత్రమే జరగాలి. నోము అనంతరం అక్షతలను గృహం ఈశా న్యభాగంలో కొద్దిగా చల్లి, కుటుం బంలో అందరూ శిరస్సుపై చల్లుకో వాలి... ఈ నోము తరతరాలుగా అనే ప్రాంతాలలో జరుగుతోంది. ఇది సర్వ రక్షాకరంగా కుటుంబాన్ని కాపాడుతుందని భారతీయుల ప్రగా ఢ విశ్వాసం. ఈ నోము ఫలితాలు కార్తీక మహా పురాణాలలో వివరింగా కన్పిస్తాయి.
మరో ముఖ్య విశేషమేమంటే... కార్తీ క మాసంలో శ్రీ రమాసహిత సత్య నారాయణ స్వామి వారి పుణ్య వ్రతా న్ని లక్షలాది కుటుంబాల్లో తప్పనిసరి గా జరిపిస్తారు. ఈ పుణ్యదినాలలో ఈ వ్రతం ఆచరించ డం వల్ల సర్వ భోగభాగ్యా లు శ్రీ సత్యనారాయణ స్వామి కటాక్షంగా లభిస్తాయని హిందువుల ప్రగాఢ విశ్వాసం. ఆంధ్ర ప్రాంతీయులకంటే తెలంగాణా ప్రాంతంలో ఈ వ్రతాచరణ ఒక విధివిధానమవ్వడం, ఆచరించే విధానం లో ఉండే పద్ధతులు ఆశ్చర్యపరుస్తాయి. కొన్ని ప్రాంతాల లో శ్రీ కేదారేశ్వరస్వామి వ్రతాన్ని ఈ మాసంలోనే జరప డం మరో విశేషం. ఉత్తర భారతదేశంలో ఈ మాసంలో బిల్వపత్ర వ్రతాన్ని జరిపిస్తారు. ఇంటింటా లక్షలాది మారే డు దళాలతో ఈ మాసం పవిత్రమౌతుంది. శక్తి ఉన్న వారు స్వర్ణ బిల్వపత్రాలను చేయించి తొమ్మిది రోజులు శివసన్ని ధిలో ఉంచి బ్రాహ్మణోత్తములకు లేదా వృద్ధ ముత్తయిదు వులకు దానమిచ్చి బిల్వాష్టకమును పారాయణ చేస్తారు.
ఏఏ ప్రాంతాలలో ఏ ఏ దానాలు చేసినా, వ్రతాలు చేసినా కార్తీక వైభోగం కార్తీక వైభోగమే! ఒక్క బిల్వాన్ని శివుడికి అర్పిస్తే చాలు జన్మ ధన్యమౌతుంది. ఒక పొద్దు ఉపవాస ముంటే చాలు కైలాసవాసం ప్రాప్తిస్తుంది. ఒక్క దీపాన్ని దానమిస్తే చాలు జీవితం ఐశ్వర్యమయమౌతుంది. అంతటి మహత్వపూర్ణం కార్తీక మాసం. ఈ మాసంలో అన్నీ పర్వదినాలే.
కొరతలేని జీవనానికి కార్తీక మాసంలో పుణ్యవ్రతాలను మంగళప్రదంగా ఆచరించండి. శివతత్త్వాన్ని గృహంలో ప్రతిష్ఠించండి. కార్తిక పురాణ కథలను పదిమంది ముందు పఠించండి. భక్తికి ప్రాధాన్యత ఇస్తూ అర్థనారీశ్వర చైతన్యాన్ని హృదయంలో నింపుకోండి. ఆ ప్రార్థనా శక్తి ఆవిర్భవింప చేసే మహాతేజస్సు శివం... శివం అంటూ హృదయాన్ని ప్రకాశింపజేస్తుంది.