Page 1 of 10 12345678910 LastLast
Results 1 to 10 of 97

Thread: Sumati Satakam

          
   
 1. #1
  Super Moderator
  status.
   
  lakikishan's Avatar
  Join Date
  11th January 2012
  Posts
  8,961
  Rep Power
  341

  Sumati Satakam

  శ్రీరాముని దయచేతను
  నారూఢిగ సకలజనులు నౌరాఁయనగా
  ధారాళమైన నీతులు
  నోరూరఁగఁ జవులుపుట్ట నుడివెద సుమతీ!

  తాత్పర్యం: మంచిబుద్ధి గలవాడా! శ్రీరాముని దయవల్ల నిశ్చయముగా అందరు జనులనూ శెభాషని అనునట్లుగా నోటి నుంచి నీళ్లూరునట్లు రసములు పుట్టగా న్యాయమును బోధించు నీతులను చెప్పెదను.

  With the grace of Rama
  Certainly to gain acceptance by one and all
  Unimpeded flow of morals
  I'll narrate, with mouth-watering taste, O! wise one

 2. #2
  Super Moderator
  status.
   
  lakikishan's Avatar
  Join Date
  11th January 2012
  Posts
  8,961
  Rep Power
  341

  Akkaraku raani chuttamu

  అక్కరకు రాని చుట్టము
  మ్రొక్కిన వరమీని వేల్పు మోహరమునఁదా
  నెక్కినఁ బారని గుర్రము
  గ్రక్కున విడువంగ వలయుఁ గదరా సుమతీ!


  తాత్పర్యం:అవసరమునకు పనికిరాని చుట్టమును, నమస్కరించి వేడిననూ కోరిక నెరవేర్చని భగవంతుని, యుద్ధ సమయమున ఎక్కినప్పుడు ముందుకు పరిగెత్తని గుర్రమును వెంటనే విడిచిపెట్టవలయును.

 3. #3
  Super Moderator
  status.
   
  lakikishan's Avatar
  Join Date
  11th January 2012
  Posts
  8,961
  Rep Power
  341

  Adigina Jeethambiyyani

  అడిగిన జీతంబియ్యని
  మిడిమేలపు దొరనుగొల్చి మిడుకుటకంటెన్‌
  వడిగల యెద్దుల గట్టుక
  మడి దున్నుకు బ్రతుకవచ్చు మహిలో సుమతీ!  తాత్పర్యం:అడిగినప్పుడు జీతమును ఈయని గర్వి అయిన ప్రభువును సేవించి జీవించుట కంటే, వేగముగా పోగల ఎద్దులను నాగలికి కట్టుకుని పొలమును దున్నుకొని వ్యవసాయం చేసుకోవడం మంచిది.

 4. #4
  Super Moderator
  status.
   
  lakikishan's Avatar
  Join Date
  11th January 2012
  Posts
  8,961
  Rep Power
  341

  Adiyasa koluvu

  అడియాస కొలువుఁ గొలువకు
  గుడిమణియము సేయఁబోకు కుజనులతోడన్‌
  విడువక కూరిమి సేయకు
  మడవినిఁదో డరయఁకొంటి నరుగకు సుమతీ!  తాత్పర్యం:వృధా ప్రయాస అగు సేవను చేయకుము. గుడి ధర్మకర్తృత్వమును చేయకుము. చెడ్డవారితో స్నేహము చేయకుము. అడవిలో సహాయం లేకుండా ఒంటరిగా పోకుము.

 5. #5
  Super Moderator
  status.
   
  lakikishan's Avatar
  Join Date
  11th January 2012
  Posts
  8,961
  Rep Power
  341

  Appugone seyu vibhavamu

  అప్పుగొని సేయు విభవము
  ముప్పునఁ బ్రాయంపుటాలు మూర్ఖుని తపమున్‌
  దప్పురయని నృపురాజ్యము
  దెప్పరమై మీఁదఁ గీడు దెచ్చుర సుమతీ!  తాత్పర్యం:రుణము తెచ్చుకొని అనుభవించు సౌఖ్యము, ముసలితనంలో పడుచు భార్య, తప్పులను కనిపెట్టని రాజు రాజ్యము సహింపరానివి. చివరకు హాని కలిగించేవి.

 6. #6
  Super Moderator
  status.
   
  lakikishan's Avatar
  Join Date
  11th January 2012
  Posts
  8,961
  Rep Power
  341

  Alluni manchithanambunu

  అల్లుని మంచితనంబును
  గొల్లని సాహిత్యవిద్య, కోమలి నిజమున్‌
  బొల్లున దంచిన బియ్యముఁ
  దెల్లని కాకులును లేవు తెలియర సుమతీ!  తాత్పర్యం:అల్లుడి మంచితనం, గొల్లవాని పాండిత్యజ్ఞానం, ఆడదానియందు నిజం, పొల్లు ధాన్యములో బియ్యం, తెల్లని కాకులూ లోకములో ఉండవు.

 7. #7
  Super Moderator
  status.
   
  lakikishan's Avatar
  Join Date
  11th January 2012
  Posts
  8,961
  Rep Power
  341

  Aakonna koode yamruthamu

  ఆఁకొన్న కూడె యమృతము
  తాఁకొందక నిచ్చువాఁడె దాత ధరిత్రిన్‌
  సోఁకోర్చువాఁడె మనుజుఁడు
  తేఁకువగలవాఁడె వంశ తిలకుఁడు సుమతీ!  తాత్పర్యం:లోకంలో ఆకలి వేసినప్పుడు అన్నమే అమృతము, బాధ పొందకుండా ఇచ్చువాడే దాత, ఆవేశాన్ని ఓర్చుకొనేవాడే మానవుడు, ధైర్యం కలవాడే వంశశ్రేష్ఠుడు.

 8. #8
  Super Moderator
  status.
   
  lakikishan's Avatar
  Join Date
  11th January 2012
  Posts
  8,961
  Rep Power
  341

  Immuga jaduvani norunu

  ఇమ్ముగఁ జదువని నోరును
  అమ్మాయని పిలిచి యన్నమడుగని నోరున్‌
  దమ్ములఁ బిలువని నోరును
  గుమ్మరిమను ద్రవ్వినట్టి గుంటర సుమతీ!  తాత్పర్యం:ఇంపుగా పరి౮ంపని నోరు, అమ్మా అని పిలిచి అన్నం అడగని నోరు, తమ్ముడూ అని పిలవని నోరు కుమ్మరివాడు మన్ను తవ్విన గోయితో సమానం సుమా!

 9. #9
  Super Moderator
  status.
   
  lakikishan's Avatar
  Join Date
  11th January 2012
  Posts
  8,961
  Rep Power
  341

  Vudumundade noorendlunu

  ఉడుముండదె నూరేండ్లును
  బడియుండదె పేర్మి బాము పదినూరేండ్లున్‌
  మడుపునఁ గొక్కెర యుండదె
  కడు నిల బురుషార్థపరుడు గావలె సుమతీ!  తాత్పర్యం:ఉడుము నూరేళ్లు, పాము పది వందల ఏళ్లు, కొంగ చెరువులో చిరకాలం జీవిస్తున్నాయి. వాటి జీవితాలన్నీ నిరుపయోగాలే. మానవుని జీవితం అలా కాక ధర్మార్థకామమోక్షాసక్తితో కూడినది కావాలి.

 10. #10
  Super Moderator
  status.
   
  lakikishan's Avatar
  Join Date
  11th January 2012
  Posts
  8,961
  Rep Power
  341

  Vuttama Gunamulu

  ఉత్తమ గుణములు నీచు
  కెత్తెర గునగలుగనేర్చు నెయ్యడలం దా
  నెత్తిచ్చి కరగిపోసిన
  నిత్తడి బంగారుమగునె ఇలలో సుమతీ!  తాత్పర్యం:బంగారానికి సమానమైన ఎత్తు ఇత్తడిని తీసుకొని ఎన్నిసార్లు కరిగించిపోసినా బంగారం ఎట్లు కానేరదో అదేవిధంగా లోకంలో నీచునకు ఎక్కడా ఏ విధంగానూ మంచి గుణాలు కలగవు.

Page 1 of 10 12345678910 LastLast

Thread Information

Users Browsing this Thread

There are currently 1 users browsing this thread. (0 members and 1 guests)

Members who have read this thread: 0

Bookmarks

Posting Permissions

 • You may not post new threads
 • You may not post replies
 • You may not post attachments
 • You may not edit your posts
 •