Radhakalyanam Day - Divyanamam - Ramabadra rara..Alangudi Radhakalyanam - 2013
Pallavi
rāmabhadra rārā śrī rāmacandra rārā
tāmarasalōcana sītā samēta rārā
Anupallavi
muddumuddugāraga navamōhanāṅga rārā
niddampu cekkiḷḷa vāḍa nīrajākṣa rārā
Charanams
1.
cuńcu ravirēkhatō nī sompucūtu rārā
pańcadāra cilaka nāto palukuduvu rārā
paṭṭarāni prēma nā paṭṭugomma rārā
gaṭṭigā kausalya muddupaṭṭi vēga rārā
2.
ninnu mānalēnurā nīlavarṇa rārā
kannula paṇḍuvugā kandu kannataṇḍri rārā
andelu muvvala cēta sandaḍimpa rārā
kundanapu bomma entō andagāḍa rārā
3.
nā yeḍala dayayuńci nallanayya rārā
bāyaka eppuḍu nī baṇṭunayya rārā
pādukonna prēma nibbaramāye rārā
pāda sēvakuḍanu nē pratyakṣamuga rārā
4.
mujjagamulakunādi mūlabrahma rārā
gajjala cappuḷḷu ghallughallumana rārā
sāmagānalōla nā cakkanayya rārā
rāmadāsunēlina bhadrādrivāsa rārā
పల్లవి
రామభద్ర రారా శ్రీ రామచంద్ర రారా
తామరసలోచన సీతా సమేత రారా
అనుపల్లవి
ముద్దుముద్దుగారగ నవమోహనాంగ రారా
నిద్దంపు చెక్కిళ్ళ వాడ నీరజాక్ష రారా
చరణములు
1.చుంచు రవిరేఖతో నీ సొంపుచూతు రారా
పంచదార చిలక నాతొ పలుకుదువు రారా
పట్టరాని ప్రేమ నా పట్టుగొమ్మ రారా
గట్టిగా కౌసల్య ముద్దుపట్టి వేగ రారా
2.నిన్ను మానలేనురా నీలవర్ణ రారా
కన్నుల పండువుగా కందు కన్నతండ్రి రారా
అందెలు మువ్వల చేత సందడింప రారా
కుందనపు బొమ్మ ఎంతో అందగాడ రారా
3.నా యెడల దయయుంచి నల్లనయ్య రారా
బాయక ఎప్పుడు నీ బంటునయ్య రారా
పాదుకొన్న ప్రేమ నిబ్బరమాయె రారా
పాద సేవకుడను నే ప్రత్యక్షముగ రారా
4.ముజ్జగములకునాది మూలబ్రహ్మ రారా
గజ్జల చప్పుళ్ళు ఘల్లుఘల్లుమన రారా
సామగానలోల నా చక్కనయ్య రారా
రామదాసునేలిన భద్రాద్రివాస రారా
There are currently 1 users browsing this thread. (0 members and 1 guests)
Bookmarks