Online Puja Services

"Yanmaya Vashvarti Vishwamkhilambrahamadidevasura,

Yat Sat Vadmrishave Bhati Sakalam Rajoo Yadhaahaibharama,

Yatpadah Palvmaive Bhati Hi Bhavambhodhaisitatti Shravtam,

Vandeaham Tamsheshkaranparam Ramakhayamesham Harim"

జయ రామ లింగ జయ సుందరాంగ భజన పాట | Jaya Rama Linga Jaya Sundaranga Bhajana Song | Lyrics in Telugu


జయ రామ లింగ జయ రామ లింగ 
జయ రామ లింగ జయ సుందరాంగ 

జయ రామ లింగ జయ రామ లింగ 
జయ రామ లింగ జయ సుందరాంగ 

నంది తురంగ నగజాత సంగ 
బంధుర మణి భూషణ భూషితాంగ 

నంది తురంగ నగజాత సంగ 
బంధుర మణి భూషణ భూషితాంగ 

పార్వతి సంగ ప్రణమిత లింగ 
సర్వాంతరంగ సత్యతరంగ 

పార్వతి సంగ ప్రణమిత లింగ 
సర్వాంతరంగ సత్యతరంగ 

పన్నగ హార భవభయ దూర 
మన్నన మీర మనవి చేకోర 

పన్నగ హార భవభయ దూర 
మన్నన మీర మనవి చేకోర 

వారాసి తూణీర వైభవాకార 
హర హార కర్పూర శశిధర 

వారాసి తూణీర వైభవాకార 
హర హార కర్పూర శశిధర 

జయ రామ లింగ జయ రామ లింగ 
జయ రామ లింగ జయ సుందరాంగ 

వరస నీ మాట వరహాల మూట 
కరుణ నా చోట కలిగింది మాట 

వరస నీ మాట వరహాల మూట 
కరుణ నా చోట కలిగింది మాట 

బాలేందు భూష భవభయ శోష 
లాలిత వేష రత్న విభూష 

బాలేందు భూష భవభయ శోష 
లాలిత వేష రత్న విభూష 

నిను నమ్మి యుంటి నీ వాడ నంటి 
కరుణింపు మంటి ఘనత నీ దంటి 

నిను నమ్మి యుంటి నీ వాడ నంటి 
కరుణింపు మంటి ఘనత నీ దంటి 

జయ రామ లింగ జయ రామ లింగ 
జయ రామ లింగ జయ సుందరాంగ 

ఇతరుల వేడ ఏలిన వాడ 
మది నిన్ను వీడ మరి నమ్మినాడ 

ఇతరుల వేడ ఏలిన వాడ 
మది నిన్ను వీడ మరి నమ్మినాడ 

ఎవరు నీ పాటి ఎవరు నీ సాటి 
రారు నీ తోటి రాజుల మేటి 

ఎవరు నీ పాటి ఎవరు నీ సాటి 
రారు నీ తోటి రాజుల మేటి 

పరగ శ్రీ గురజాడ పురమధ్యవాస 
శరణంటి పువ్వాడ శ్రీ రామదాస 

పరగ శ్రీ గురజాడ పురమధ్యవాస 
శరణంటి పువ్వాడ శ్రీ రామదాస 

జయ రామ లింగ జయ రామ లింగ 
జయ రామ లింగ జయ సుందరాంగ 

జయ రామ లింగ జయ రామ లింగ 
జయ రామ లింగ జయ సుందరాంగ 

జయ రామ లింగ జయ సుందరాంగ 
జయ రామ లింగ జయ సుందరాంగ 

 


jaya Rama Linga, Sundaranga, Song, Bhajan, Rama, 

Videos View All

శ్రీ రామ పంచ రత్న స్తోత్రం
జన్మ సాఫల్య మంత్రం - శ్రీ రామ రక్షా స్తోత్రం
శ్రీ రామరక్షా స్తోత్రం
రామకోటి రాయడానికి పాటించాల్సిన నియమాలు
నీ పదములె చాలు రామా పాట
నిద్రా ముద్రాంకింతమైన  మీ కన్నుల పాట

Quote of the day

What matters is to live in the present, live now, for every moment is now. It is your thoughts and acts of the moment that create your future. The outline of your future path already exists, for you created its pattern by your past.…

__________Sai Baba