Online Puja Services

|| Om Vakratunda Mahakaya Koti Surya Samaprabha
Nirvighnam Kurumedeva Sarvakaryeshu Sarvada ||

వినాయక మంగళహారతి | వినాయక చవితి మంగళ హారతి | Vinayaka Chaviti Mangala Harati | Lyrics in Telugu


శ్రీ శంభు తనయునకు సిద్ధిగణనాథునకు
వాసిగల దేవతా వంద్యునకును 
ఆ సరస విద్యలకు ఆదిగురువైనట్టి
భూసురోత్తమ లోకపూజ్యునకును 

జయమంగళం నిత్య శుభమంగళం
జయా జయమంగళం నిత్య శుభమంగళం 

నేరేడు మారేడు నెలవంక మామిడి
దూర్వార చెంగల్వ వుత్తరేణు
వేరువేరుగ తెచ్చి వేడ్కతో పూజింతు 
పర్వమున దేవగణపతికినిపుడు

జయమంగళం నిత్య శుభమంగళం
జయా జయమంగళం నిత్య శుభమంగళం 

సుచిరముగ భాద్రపద శుద్ధ చవితియందు
పొసగ సజ్జనులచే పూజగొల్తూ 
శశి చూడరాదన్న చేకొంటినొక వ్రతము
పర్వమున దేవగణపతికినిపుడు

జయమంగళం నిత్య శుభమంగళం
జయా జయమంగళం నిత్య శుభమంగళం 

పానకము వడపప్పు, పనసమామిడి పండ్లు
దానిమ్మ ఖర్జూర ద్రాక్షపండ్లు
తేనెతో మాగిన తియ్యమామిడి పండ్లు
మాకు బుద్ధినిచ్చు గణపతికినిపుడు

జయమంగళం నిత్య శుభమంగళం
జయా జయమంగళం నిత్య శుభమంగళం 

ఓ బొజ్జగణపయ్య నీ బంటు నేనయ్య
ఉండ్రాళ్ల మీదికి దండుబంపు
కమ్మని నెయ్యయ్య  కడుముద్ద పప్పయ్య 
బొజ్జవిరుగగ దినుచు పొరలుచున్ 

జయమంగళం నిత్య శుభమంగళం
జయా జయమంగళం నిత్య శుభమంగళం 

వెండి పళ్లెములోన వేయి వేల ముత్యాలు
కొండలుగ నీలములు కలయబోసి
మెండుగను హారములు మెడనిండ వేసికొని
దండిగా నీకిత్తు ధవళారతి

జయమంగళం నిత్య శుభమంగళం
జయా జయమంగళం నిత్య శుభమంగళం 

పువ్వులను నిను గొల్తు పుష్పాల నిను గొల్తు
గంధాన నినుగొల్తు కస్తూరినీ 
ఎప్పుడును నిను గొల్తు ఏకచిత్తమ్మున 
పర్వమున దేవగణపతికినిపుడు

జయమంగళం నిత్య శుభమంగళం
జయా జయమంగళం నిత్య శుభమంగళం 

ఏకదంతంబును ఎల్ల గజవదనంబు
బాగైన తొండంబు వలపు కడుపు
జోకయిన మూషికము పరక నెక్కాడుచు 
భవ్యుడగు దేవగణపతికినిపుడు

జయమంగళం నిత్య శుభమంగళం
జయా జయమంగళం నిత్య శుభమంగళం 

మంగళము మంగళము మార్తాండతేజునకు
మంగళము సర్వజ్ఞవందితునకు
మంగళము ముల్లోక మహితసంచారునకు
మంగళము దేవగణపతికినిపుడు

జయమంగళం నిత్య శుభమంగళం
జయా జయమంగళం నిత్య శుభమంగళం 

సిద్ధి విఘ్నేశ్వరా ప్రసిద్ధిగా పూజింతు 
ఒనరంగ నిరువదియొక్క పత్రి 
దానిమ్మ మరువమ్ము దర్భ విష్ణుక్రాంత 
యుమ్మెత్త దుర్వార యుత్తరేణి 

కలువలు మారేడు గన్నేరు జిల్లేడు 
దేవకాంచన రేగు దేవదారు 
జాజి బలురక్కసి జమ్మిదాసాన పువ్వు 
గరికి మాచీపత్రి మంచి మొలక 

జయమంగళం నిత్య శుభమంగళం
జయా జయమంగళం నిత్య శుభమంగళం 

అగరు గంధాక్షత ధూప దీప నైవేద్య 
తాంబూల పుష్పోపహారములను 
భాద్రపద శుద్ధ చవితిని కుడుములు 
నాన్బ్రాలు ఉండ్రాళ్ళు పప్పు పాయసము 

జయమంగళం నిత్య శుభమంగళం
జయా జయమంగళం నిత్య శుభమంగళం 

బంగారు చెంబుతో గంగోదకము తెచ్చి 
సంగతిగ శిశువునకు జలకమార్చి 
మల్లెపూవులు దెచ్చి మురహరిని పూజింతు 
రంగైన నా ప్రాణలింగమునకు 

జయమంగళం నిత్య శుభమంగళం
జయా జయమంగళం నిత్య శుభమంగళం 

పట్టు చీరలు మంచి పాడిపంటలు గల్గి 
ఘనముగా కనకములు కరులు హరులు 
ఇష్టసంపదలిచ్చి ఏలిన స్వామికి 
పట్టభద్రుని దేవ గణపతికి నిపుడు 

జయమంగళం నిత్య శుభమంగళం
జయా జయమంగళం నిత్య శుభమంగళం 

ముక్కంటి తనయుడని ముదముతో నేనును 
చక్కనైన వస్తు సమితి గూర్చి 
నిక్కముగా మనమును నీయందే నేనిల్పి 
ఎక్కువగు పూజ లాలింపజేతు 

జయమంగళం నిత్య శుభమంగళం
జయా జయమంగళం నిత్య శుభమంగళం 

మల్లెలా మొల్లలా మంచి సంపెంగలా 
చల్లనైనా గంధ సారములను 
ఉల్లమలరగ మంచి ఉత్తమపు పూజలు 
కొల్లలుగ నేజేతు కోరి విఘ్నేశ 

జయమంగళం నిత్య శుభమంగళం
జయా జయమంగళం నిత్య శుభమంగళం 

దేవాధిదేవునకు దేవతారాధ్యునకు 
దేవేంద్రవంద్యునకు దేవునకును 
దేవతలు మిముగొల్చు తెలిసి పూజింతురు 
భవ్యుడగు దేవ గణపతికినిపుడు 

జయమంగళం నిత్య శుభమంగళం
జయా జయమంగళం నిత్య శుభమంగళం 

చెంగల్వ చామంతి చెలరేగి గన్నేరు 
తామరలు తంగేడు తరచుగాను
పుష్పజాతులు దెచ్చి పూజింతు నేనిపుడు 
బహుబుద్ధ గణపతికి బాగుగాను 

జయమంగళం నిత్య శుభమంగళం
జయా జయమంగళం నిత్య శుభమంగళం 

మారేడు మామిడి మాదీ ఫలంబులు 
ఖర్జూర పనసలును కదళికములు 
నేరేడు నెలవంది టెంకాయ తేనెయు 
చాలగా నిచ్చెదరు చనువుతోడ 

జయమంగళం నిత్య శుభమంగళం
జయా జయమంగళం నిత్య శుభమంగళం 

ఓ బొజ్జ గణపతి! ఓర్పుతో రక్షించి
కాచి నన్నేలు మీ కరుణతోను
మాపాల గలవని మహిమీద నెల్లపుడు
కొనియాడుచుందును కోర్కెదీర

జయమంగళం నిత్య శుభమంగళం
జయా జయమంగళం నిత్య శుభమంగళం 
జయా జయమంగళం నిత్య శుభమంగళం

 


vinayaka, chaviti, chavithi, ganesh, chaturthi, chathurdhi, chathurthi, mangala, harathi, harati, aarti,

Videos View All

వినాయక చవితికి ఇవి సిద్ధంగా ఉంచుకోండి
వినాయక చవితి పూజా విధానం..2023 (తెలుగు)
గణపతి తాళం మహిమ
కార్యసిద్ధి గణపతి క్షేత్రం .
అపూర్వ మహిమాన్వితాలైన అష్ట వినాయక క్షేత్రాలు.
పాహి పాహి గజానన

Quote of the day

In a controversy the instant we feel anger we have already ceased striving for the truth, and have begun striving for ourselves.…

__________Gautam Buddha