Online Puja Services

పాలకడలి నిజంగా ఉందా ?

3.23.101.60

పాలకడలి నిజంగా ఉందా ? చతుర్వ్యూహ్యుని శేషతల్పం ఎక్కడుంది ?
-సేకరణ 

‘పాలకడలిపై శేషతల్పమున పవళించేవా దేవా
బాలుని నను దయపాలించుటకై కనుపించేవా మహానుభావ’  

అని సినీ గీతం. ఈ మధ్య ఒక పెద్దాయన ‘పాలకడలి అంటే పాల సముద్రం అని కదండీ అర్థం.  ఈ కడలి ఎక్కడుంది ? ఒక లీటరు పాలు తెచ్చుకుంటాను’  అన్నాడు. సరే బానే ఉంది.  అర్థం చేసుకుంటే, చూడగలిగే కన్నులు మనసుకి, అంతరార్థాన్ని తెలుసుకోగల విజ్ఞత ఉంటె ఆ ప్రశ్న అడగరు, అది వేరేవిషయం . అయినా ఈ పాలకడలి ఎక్కడుంది ? తోడెడితే, ఆ పాలు పెరుగవుతాయా ?  విష్ణువు పవళించిన  ఆ శేష తల్పం నిజంగా ఉందా ? 

55 Cancri E అని ఒక గ్రహం వుంది. మన మిల్కీ వే గ్యాలెక్సి (Milkyway Galaxy) లోనే ఇదీ వుంది. దానికో సూర్యుడున్నాడు. మన భూమిలాగా దాని సూర్యుడి చుట్టూ అది తిరుగుతూ వుంటుంది. మనభూమి కన్నా రెండింతలు వుంటుంది. చాలా పెద్దది. కేవలం 17గంటలలోనే తన సూర్యునికి ఒక ప్రదక్షిణం చేస్తుంది. అంటే మనకు 12 నెలలకి ఒక ఏడాది కదా! కానీ దానికి  ఈ సమయం కేవలం 17గంటలు. కేవలం 17 గంటలకి  ఏడాదన్నమాట . వాతావరణం చాలా వేడిగా వుంటుంది. 3900డిగ్రీలు. మన భూమికి చాలా వరకూ ఆక్సీజన్ కదా, ఆ గ్రహం చాలా వరకూ కర్బనమన్నమాట.

కార్బన్ అంత ఎక్కువ వుండీ, అంత ఎక్కువ ప్రెషర్ తో తిరిగీ తిరిగీ వేడెక్కీ వేడెక్కీ వుండటం వలన, ఆ కర్బనం కాస్తా వజ్రమై కూర్చుంది. కార్బన్ కీ వజ్రానికీ ఒకటే అణువు తేడా! అంటే ఇప్పుడు ఆ గ్రహమంతా ఒక వజ్రమన్నమాట. గ్రహమంత వజ్రం! మన మొత్తం భూమికన్నా రెండింతల వజ్రం.

ఎలా వచ్చింది అక్కడికి?

రాలేదు, కొన్ని ప్రత్యేక పరిస్థితులవలన ఏర్పడింది. అంతే.

55 Cancri E అంటే విన్నారుగా, మరి "విష్ణువు పాలసముద్రంలో వుంటాడు" అంటే పాల సముద్రానికి ఈ ప్రశ్నలేంటి? పాలెక్కడివి?, పెరుగు అవుతుందా? తోడు ఎక్కడిది? అన్ని గేదెలెక్కడివి? అసలవి గేదెపాలా గాడిదపాలా… అని అడగకూడదు.

అయినా తుత్తికోసం చెప్పుకోవాల్సిన విషయాలు చాలానే ఉన్నాయి.  గెలాక్సీ అంటే, మన పాలపుంత.  పాలపుంత అంటే కూడా  ఓ పాలసముద్రమనేగా అర్థం. మన గెలాక్సీకి ఇంగ్లీషువారు, మనమూ పెట్టుకున్న పేరు, Milkyway Galaxy! ఇందులో వ్యాపించినవాడు విష్ణువు.  ‘విశ్వం విష్ణుర్ వషట్కారో’ అని మన విష్ణు సహస్రం చెబుతోందిగా ! ఆ విధంగా పాల సముద్రంలో విస్తరించినవాడేగా విష్ణువు. పాముల్లాగా చుట్టాలు చుట్టుకున్న గ్రహాల కక్షలని ఆదిశేషుడిగా భావించవచ్చునుగా  !

#vishnu #milkywaygalaxy

Quote of the day

A coward is incapable of exhibiting love; it is the prerogative of the brave.…

__________Mahatma Gandhi