Online Puja Services

హిరణ్యాక్ష సంహారం వెనుక దాగియున్న అంతరార్థం

3.139.240.142

బంగారంవంటి  కనులు కలవాడు 
సర్వేంద్రియాణాం నయనం ప్రధానం 
అలాంటి నయనేంద్రియాలకు వశుడు హిరణ్యాక్షుడు

భూమి  సమస్తం  ప్రకృతి 
తనదేనని గర్వాతిశయం

తాను చూచిన సమస్తం
తన వశం కావాలనే దురాశ 

సంపదను మూటగట్టినట్లు
భూమినంతా చాపచుట్టగాచుట్టి నీటిలో దాచాడు 

సంపదలను దాచుకొనే  దుస్స్వాభావం
గలవారికి ప్రతినిధి అతడు 

భౌతికవస్తువులనూ సమీకరించాలనే
భావనయే అజ్ఞానానికి సంకేతం 

* యద్భావం తద్భవతి *
వాని మనసులో భావన
చుట్టగట్టే పనికి పురికొల్పింది 

మరి  సృష్టికర్తయైన బ్రహ్మ 
గత్యంతరం లేక " రక్షించు " మని
శ్రీమన్మహావిష్ణువును ప్రార్థించాడు.  

పరదుడైన విష్ణువు అకస్మాత్తుగా .....
అంగుష్థమాత్ర ప్రమాణంలో వరహ శిశువు రూపంలో
బ్రహ్మముక్కులోనుండి ఊడిపడ్డాడు 

ఇక్కడ బుద్ధి
చైతన్యరూపమైన పరమాత్మను అడిగింది 

బ్రహ్మ > విష్ణుని .....
ఆశ్రయించడం వెనుక రహస్యమిదే 

అజ్ఞానమంటే మరేదో కాదు  --
ఐహిక భావలంపటం 

చైతన్యాన్ని వదిలిపెట్టి జడంలోకి వెళ్లడమే 
జలగ్రస్త తత్త్వం * శ్రేష్ఠమైన ఆహంభావమే వరాహం *

సాధకునిలో శ్రేష్ఠమైన ఆహంభావన కలిగినపుడు
లౌకికవాంచలు నశి స్తాయి * అవి నశ్వరాలు )

అదే హిరణ్యాక్షసంహారం
వెనుక దాగియున్న అంతరార్థం 

సాధకునిలో > ఆహం భావన కల్గితే 

వెంటనే అసత్యమైన హిరణ్యాక్ష
భావన దూరమౌతుంది 

ఐతే చాలా మంది  సాధకులలో .....
ఈ హిరణ్యాక్షుడు శాశ్వతంగా
తిష్టవేసుకుని కూచొంటాడు 

జన్మజన్మల పాపఫలాన్ని వారు అనుభవిస్తారు  

పరమాత్మను ఆరాధించి వస్తువ్యామోహాలను
వదలి సత్యాన్ని తెలుసుకొని  
ముక్తిమార్గాన్ని అనుసరించాలని 
ఈ భాగవతగాథ  మనకు తెలియజేస్తుంది 

- మీ  రాజు సానం 

Quote of the day

We should not fret for what is past, nor should we be anxious about the future; men of discernment deal only with the present moment.…

__________Chanakya