Online Puja Services

హనుమంతుడిని నమ్ముకోండి

18.217.228.35

హనుమంతుడు చిరంజీవి... సాక్షాతుడు మహా శివుడే ఆంజనేయుడిగా అవతరించాడని హిందూ పురణాలు పేర్కొంటున్నాయి. శివుడి అంశంతో జన్మించిన హనుమంతుడు నేటికీ హిమాయలయాల్లో సజీవంగా ఉన్నాడని భావిస్తారు. త్రేతా యుగంలో రాముడికి నమ్మిన బంటు, సీతాన్వేషణకు బయలుదేరిన హనుమ లంకలో ప్రవేశించి భీభత్సం సృష్టించాడు. తనకు నిప్పు పెట్టాలని రాక్షస మూకలు ప్రయత్నిస్తే దానితోనే లంకను దహనం చేశాడు. అంజనీ సుతుని ఆరాధిస్తే దుష్ట శక్తులు, పిశాచాలు దరిచేరవని బలంగా నమ్ముతారు. అయితే హనుమాన్ మంత్రాన్ని రోజు ఉచ్చరించడం వల్ల శక్తి, ధైర్యంతోపాటు శారీరక సామర్థ్యం కూడా పొందుతారు. 

రోజూ ఉదయాన్నే లేవగానే స్నానం ఆచరించి, రుద్రాక్ష మాలను పట్టుకుని హనుమంతుడి ముందు కూర్చోవాలి. ఆ తర్వాత ఈ కింది మంత్రాన్ని ఉచ్చరించాలి. ఓ హనుమంతాయ నమ:, హం పవన నందాయ స్వాహ అంటూ మంత్రోచ్ఛారణ గావిస్తే ధైర్యంతోపాటు శారీరక సామర్థ్యం కూడా పొందుతారు. 

హం హనుమంతాయ రుద్రాత్మక హం ఫట్ ఈ రహస్య మంత్రాన్ని పఠించడం ద్వారా అపరిమితమైన శక్తిని పొందవచ్చు. ఈ మంత్రం వల్ల తక్షణ ఫలితాన్ని పొందడమే కాకుండా, అనూహ్యమైన శక్తి సొంతమవుతుంది. 

ఓం నమో భగవతే ఆంజనేయ మహాబలాయ స్వాహ మంత్రాన్ని 21 వేల సార్లు ఉచ్ఛరిస్తే మొండి రోగాలు, దుష్ట శక్తులు పీడనం తొలగిపోవడమే కాదు, జీవితంలో ఎదురైన ఇతర ఆటంకాలు కూడా తొలగిపోతాయి. 

శ్రీ ఆంజనేయ దండకం తరాల నుంచి ప్రాచుర్యంలో ఉంది. ఆంజనేయస్వామి మహిమ, సుగుణాలు, సాధించిన ఘనకార్యాలు, రక్షణ, అనుగ్రహం మొదలైనవి ఈ దండకంలో పొందుపర్చారు. ఇందులో సంస్కృత పదాలు పొదగడం వల్ల శబ్దశక్తి, మంత్రశక్తి కలిగి ఉంది. తెలుగుభాషలోని క్రియాపదాలు, వాక్యాలు ఉండటం వాడటం వల్ల చదవగానే అర్థమవుతూ, భావశక్తి కూడా కలిగి ఉంది. అందువల్లనే ఈ దండకం శ్రద్ధగా పారాయణ చేసినవారికి కోరిన కోర్కెలు తీరుతాయని బలంగా నమ్ముతారు.

Quote of the day

You can't cross the sea merely by standing and staring at the water.…

__________Rabindranath Tagore