Online Puja Services

హనుమంతుడికి ఒంటె ఎలా వాహనమయ్యింది?

3.19.31.73

హనుమంతుడికి ఒంటె ఎలా వాహనమయ్యింది?
లక్ష్మీ రమణ 

హనుమంతుడు యెజనాల కొద్దీ దూరాన్ని ఒక్క అంగలో అధిగమించగలిగినవాడు. స్వయంగా రుద్రాంశ సంభూతుడు. వాయు పుత్రుడూ ! సూర్యుణ్ణే  పండనుకొని భ్రమించి, సూర్య గ్రహం దాకా యెగిరి వెళ్లగలగడంలోనే ఆయన యెంత వేగంతో ఎలా ప్రయాణించగలరనేది అర్థమవుతోంది కదా ! అటువంటి స్వామికి ఒక వాహనం అవసరమేముంది. ఆమాటకొస్తే, త్రిమూర్తులకీ, వారి దేవేరులకీ, ఇలా దేవతా గణమందరికీ ఏదొక వాహనం ఉందికదా ! అయినా వానర రూపంలో ఉన్న ఆంజనేయునికి ఒంటె వాహనం అవ్వడం అనేది కాస్త ఆసక్తికరమైన కథే కదూ ! 
 
ఒంటె ఆంజనేయ స్వామి వాహనం అని తెలిస్తే ఆశ్చర్యంగా ఉంటుంది. దక్షణాదిన ఆంజనేయ స్వామి గుడులలో వాహనంగా ఒంటె కనిపించడం కొద్దిగా  అరుదనే చెప్పాలి . కొన్ని ప్రదేశాలలో, ఆంజనేయునికి నిర్మించిన ప్రత్యేకమైన  దేవాలయాలలో ఆయన ఎదురుగా ఒంటె వాహం ఉంటుంది . ఒంటె, ఆంజనేయ స్వామికి వాహనంగా మారడం వెనుక ఒక పురాణ గాఢ ఉంది . 

రావణుని బావమరిది దుందుభిని వాలి భీకరంగా పోరాడి వదిస్తాడు.  అతడి మృతదేహాన్ని రుష్యమూక పర్వతం (నేటి హింపీ ప్రాంతం) పై పడేశాడు. ఈ సంఘటనే వాలి, సుగ్రీవుల మధ్య వైరం రగులుకోవడానికి కారణమవుతుంది. మరో వైపు వాలి శాపాన్ని పొందేందుకు కారణమవుతుంది. ఆ ఋష్యమూక పర్వతం పైన తపస్సు చేసుకుంటున్న మాతంగ మహాముని దుందుభి మృతదేశాన్ని తానూ తపస్సు చేసుకుంటున్న ఆ పర్వతం పైన పడేయడాన్ని ఇది చూసి, వాలి కనుక రుష్యమూక పర్వతం మీద కాలు పెడితే మరణిస్తాడని శపిస్తాడు.

ఆ తర్వాత సుగ్రీవుణ్ణి - వాలి చంపడానికి వెంటపడినప్పుడు, శాపోదంతం తెలుసున్న  సుగ్రీవుడు రుష్యమూక పర్వతానికి వెళ్లి దాక్కుంటాడు. ఆ సమయంలో సుగ్రీవుణ్ణి చూడటానికి వచ్చిన హనుమంతుడు ఒకరోజు అక్కడే ఉన్న పంప సరోవరాన్ని తిలకించాలని అనుకుంటాడు. దాంతో మిత్రుడైన హనుమంతుడు  పంపా సరోవరం తీరంలో తిరగడానికి అనువుగా ఒంటెను సిద్ధం చేస్తాడు  సుగ్రీవుడు. అలా అది ఆయనకు వాహనం అయ్యిందని కథనం.

Quote of the day

From the solemn gloom of the temple children run out to sit in the dust, God watches them play and forgets the priest.…

__________Rabindranath Tagore