Online Puja Services

అవ్యభిచారణ భక్తి

3.12.41.106

అవ్యభిచారణ భక్తి కలిగి ఉండమని భగవంతుడు చెప్పడంలోని అంతరార్థం ఏమిటి ? 
- లక్ష్మి రమణ 

భగవద్గీత భగవంతుడే స్వయంగా చెప్పిన జీవన వేదం . భగవద్గీతని ఫాలో అయ్యామంటే , విజయం మనని మానకుండా ఫాలో చేయడం ఖాయం . భక్తి గురించి, భక్తులు కలిగి ఉండాల్సిన భక్తి గురించి శ్రీకృష్ణుడు గీతలో చాలానే చెప్పారు . ఆ వరుసలోనే అర్జనుడితో , అర్జనుడు అంటే మానవుడు, కృష్ణుడు అంటే భగవంతుడు అని అర్థం చేసుకోవాలి.  ఆ విధంగా శ్రీ కృష్ణుడు అర్జునుడికి గీతోపదేశం చేస్తూ కాస్తంత కటువుగా  'అవ్యభిచారణ భక్తి' కలిగి ఉండు” అన్నారు .   దీని అర్థం ఏమిటంటే.. 

 భక్తిలో వ్యభిచారము ఉండకూడదు అని. దాని అంతరార్ధము  ఏమిటి తిరుమలేశా ? అని ఆలోచిస్తే, పెద్దల అనుగ్రహంతో బుద్ధికి తోచిన నాలుగు మంచి విషయాలు మీతో పంచుకుందాం అని . 

మనం ఎందరో దేవీ దేవతలని అర్చిస్తూ ఉంటాం . సోమవారం - శివుడు , మంగళవారం ఆంజనేయుడు, శుక్రవారం లక్ష్మీదేవి , ఇట్లా.  ఆలయాలైతే ఇక చెప్పక్కర్లేదు . గురువారం సాయిబాబా ఆలయం ముందు ఉన్న క్యూలు, శుక్రవారం అమ్మవారి ఆలయం ముందు, శనివారం శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయం ముందు కనిపిస్తాయి.

ఇలా అనేకానేక మంది దేవీ దేవతలని అర్చించవచ్చు . అయితే అది ఏ విగ్రహానికి హారతి ఇవ్వకపోతే ఎవరికి కోపం వస్తుందో అని  హారతులు, నివేదనలు సమర్పించడంలో మునిగిపోయే లాంటి భక్తి కాకూడదు. దీన్నే పరమాత్మ వ్యభిచారినీ భక్తి అన్నాడు!  *

“సర్వదేవ నమస్కార: కేశవం ప్రతిగచ్ఛతి" అని తెలుపుతున్నాయి శాస్త్రాలు. సర్వదేవతల్లోనూ ఉన్న పరమాత్మ ఒక్కరే అన్న ఎరుకతో భగవంతునికి సర్వశ్య శరణాగతి చేయడం నిజమైన భక్తి . ఆ విధంగా ఎవరికి నమస్కరించినా, ఆ పరమేశ్వరునికే చెల్లుతుంది. కనుక భగవంతుడు ఒక్కడే అని భావించి  స్థిర చిత్తముతో ఆయన మీద సంపూర్ణమైన విశ్వాసంతో నిండిన భక్తి కలిగి ఉండాలి . ఆ విధమైన అంతరంగాన్ని అనుగ్రహించమని పరమాత్మని ప్రార్ధిస్తూ .. 

“ భగవాదానుగ్రహ ప్రాప్తిరస్తు” . శుభం . 

Quote of the day

To be idle is a short road to death and to be diligent is a way of life; foolish people are idle, wise people are diligent.…

__________Gautam Buddha