Online Puja Services

తరచుగా ఇంట్లో కీచులాడుకుంటున్నారా ?

3.142.174.55

తరచుగా ఇంట్లో కీచులాడుకుంటున్నారా ? ఇలా చేయండి !!
- లక్ష్మి రమణ 

ఏ ఇంట్లో అయినా, సభ్యుల మధ్య  సంబంధాలు, అనుబంధాలూ సవ్యంగా ఉంటేనే మనః శాంతి ఉంటుంది . అటువంటి గృహాలలోనే లక్షీదేవి శాశ్వతంగా ఉంటుంది . తగవులు పడే భార్యాభర్తలు, నిత్యమూ కీచులాడుకునే అత్తా - కోడళ్ళు , తండ్రీ - కొడుకులు ఇలా అనుబంధాల మధ్య మనస్పర్థలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఇంట్లో శాంతికి విఘాతం కలిగిస్తాయి . ఎక్కడైతే, శాంతీ సామరస్యాలు లోపిస్తాయో అక్కడ దేవతా శక్తులు నిలవవు అని శాస్త్రం . కాబట్టి మన ప్రవర్తనని దిద్దుకోవడం, వీలైనంత సౌమ్యంగా ఉండడం, ఇతరులని అర్థం చేసుకొని ప్రవర్తించడం అవసరం. ఇంకా సమస్యలు వేధిస్తుంటే, పరిష్కారం కోసం ఇలా ఆంజనేయుని అర్చించండి . తప్పక ఫలితం ఉంటుంది . 

ఆంజనేయుడు శ్రీరాముని భక్తుడు అనేది లోకవిదితమైన విషయమే . ఆయన రామునికి యెంత భక్తుడంటే, అసలు మనం ఆయన్ని పన్నెత్తి పిలవకపోయినా, తలుచుకోకపోయినా సరే, ‘రామా ! రామా !’ అని తలుస్తే చాలు, నా స్వామిని తలిచారని అటువంటి వారి రక్షణ కోసం స్వయంగా తరలివస్తారు. అటువంటివారు హనుమ . 

ఇంతటి భక్తి ఉన్న భక్తుని భగవంతుడు ఉపేక్షిస్తారా !!హనుమని పూజించేవారింట ఆ శ్రీముడే కొలువవుతారట ! అందుకేకదా తులసీ దాసు అంటారు ‘తుమ్హరో భజన రామ్ కో పావై జనమ జనమకె దుఃఖ పిశరావై || అంతకాల రఘుపుర పురజాయీ , జహా జన్మ హరి భక్త కహాయీ || ‘ అంటారు . హనుమని పూజించిన వారికి ఆ శ్రీరాముని కృప లభిస్తుంది . జన్మజన్మల దుఃఖం నశించిపోతుంది . మరణం తరువాత వారు విష్ణులోకాన్ని పొందుతారు .  అక్కడ హరి భక్తులుగా జీవిస్తారు . అంటారాయన . అనడం కాదు, హనుమ కృపతోటె , రామ దర్శనం చేసుకున్న కృతార్థుడు కూడా ! రాముడంటే, శాంతికి మారుపేరు . శరణాగత వత్సలుడైన ఆయన ఇచ్చే ధైర్యం, రక్షణా తిరుగులేనివి .  ఆ రాముని చేరుకొనే దారి హనుమచూపిన దారి . 

అందువల్ల అటువంటి రాముని కీర్తిస్తున్న హనుమ , రామ భజన చేస్తున్న హనుమ రూపాన్ని ఇంట్లో ఉంచుకుంటే, ఇంట్లో శాంతి సమకూరుతుంది.   

హనుమ గొప్ప సంగీత విద్వాంసుడు. సహజంగానే రామ భక్తి తత్పరుడైన ఆయన కీర్తనలన్నీ రాములవారిమీదనే కదా ! అందువల్ల వీణని వాయిస్తున్నట్టున్న హనుమ రూపాన్ని ఇంట్లో ఉంచుకున్నా , చక్కని ఫలితాలుంటాయి . కుటుంబంలో చిలికి చిలికి  గాలి వానలుగా మారే కలహాలు ఉపశమిస్తాయి . 

అటువంటి పటానికి నిత్యమూ లఘువుగా పూజ చేసుకోండి . వీలైనంత రామనామం జపించండి . శుభం . 
  

#hanuma #hanuman #anjaneya #peaceathome

Tags: hanuma, hanuman, anjaneya, peace, fighting, at home,

Quote of the day

Anger and intolerance are the enemies of correct understanding.…

__________Mahatma Gandhi