Online Puja Services

తీర్ధం 3 సార్లు ఎందుకు తీసుకోవాలో తెలుసా?

18.116.36.192

తీర్ధం యొక్క విశిష్టత ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇంట్లో, దేవాలయంలో లేదా ఇంకెక్కడైనా దేవుడిని దర్శించుకున్న తర్వాత తీర్ధం తీసుకుంటాం. కాని తీర్ధాన్ని మూడుసార్లు ఎందుకు తీసుకోవాలి అన్నది ఎప్పుడైనా ఆలోచించరా? ఇప్పుడు అదే విషయం గురించి తెలుసుకుందాం..!!

దేవునికి పూజ చేసిన తర్వాత తీసుకునే తీర్ధంలో పంచామృతాలు, తులసి దళాలు, సుగంధ ద్రవ్యాలు, మంత్ర శక్తులు ఉంటాయి. దీంతో ఆ తీర్ధం అత్యంత పవిత్రంగా మారుతుంది. తీర్ధం తీసుకోవడం ద్వారా మన ఆరోగ్యం, ఆధ్యాత్మికత మెరుగవుతాయి...

మొదటిసారి తీర్ధం తీసుకుంటే శారీరక, మానసిక శుద్ధి జరుగుతుంది.

రెండవసారి తీర్ధం తీసుకుంటే న్యాయ, ధర్మ ప్రవర్తనలు చక్కదిద్దుకుంటాయి. ఇక మూడవది పవిత్రమైన పరమేశ్వరుని పరమ పదం అనుకుని తీసుకోవాలి. మన పురాణాల ప్రకారం తీర్ధం అంటే తరింపజేసేది అని అర్ధం. దీన్ని మూడుసార్లు తీసుకుంటే.. 

భోజనం చేసినంత శక్తి వస్తుందని అంటారు. తీర్ధం తీసుకునేటప్పుడు ఆరోగ్యకరమైన భావంతో తీసుకోవాలి. ఈ తీర్ధం నాకు మంచి చేస్తుంది, నా ఆరోగ్యానికి మరియు నా ఆధ్యాత్మికతను మెరుగు పరుస్తుంది అనే సద్భావంతో తీసుకోవాలి.

దేవుడికి పూజలు చేసే పూజారులు ఈ మంత్రం జపిస్తూ భక్తులకు తీర్ధాన్ని ఇస్తారు... అకాల మృత్యు హరణం సర్వవ్యాధి నివారణం! సమస్త పాపక్షయకరం పాదోదకం పావనం శుభం!!

మూడు సార్లు కూడా కుడిచేయి కింద ఎడమ చేయిని ఉంచి తీర్థం తీసుకోవాలి. కుడిచేయి చూపుడు వేలు మధ్యలోకి బొటన వేలిని మడిస్తే గోముఖం అనే ముద్ర వస్తుంది. ఈ ముద్రతో తీర్థాన్ని తీసుకోవాలి...

తీర్థాన్ని తీసుకున్నాక తలపై తుడుచుకుంటారు. కాని అలా చేయకూడదు. తల పైన బ్రహ్మ దేవుడు ఉంటాడు. మన ఎంగిలిని బ్రహ్మకు అర్పణం చేసిన వారమవుతాము. కనుక కళ్లకద్దుకోవడం మంచిది. ముఖ్యంగా మీ కుటుంబసభ్యులకు, బంధుమిత్రులకు ఇలాంటి వాటిపై అవగాహన కలిపించండి..!

Quote of the day

Anger and intolerance are the enemies of correct understanding.…

__________Mahatma Gandhi