Online Puja Services

శ్రీ సుబ్రహ్మణ్యస్వామి చరితం

18.117.153.38
కుండలిని శక్తిలో మొదటిది మూలాధారం చక్రం తిరుపురంకుoడ్రo లో మేల్కొలుప బడు తుంది. తరువాత ది స్వాధిష్టానం. ఇది తిరు చెందూర్ లో మేల్కొలుప బడుతుంది. 

తిరుచెందూర్ యొక్క  విశేషం ఏమన సుబ్రహ్మణ్యుడి ఆలయాలన్నియు కొండలపైనే ఉండగా ఇక్కడ మాత్రం సముద్ర తీరంలో ఉoటుంది. ఈ సముద్రాన్ని గల్ఫ్ ఆఫ్ మన్నార్ అంటారు. ఈ సముద్రంలో స్నానమాచరించి భక్తులు ఆలయ ప్రవేశం చేస్తారు. ఇక్కడ అలలు తక్కువ. సముద్రంలో నడుచు కుంటూ కొంత దూరం పోవచ్చును. ఇది ఒక గొప్ప అనుభూతి. 

ఈ ఆలయానికి ప్రధాన ద్వారం దక్షిణ దిశలో ఉంటుంది. దీనిని షణ్ముఖ విలాసమండపం అంటారు. పూర్వము ఈ ఆలయాన్ని ఇసుకతో నిర్మించారని చెబుతారు. అది శిథిల మయ్యాక తిరిగి గ్రానైట్ రాయితో నిర్మించారు. ఎర్రటి ఇసుకతో నిర్మించారు. 

బలసుబ్రహ్మణ్యుడు రాక్షసుడు శూరపద్ముడిని  ఓడించుటకు ముందు, తరువాత కూడా ఇక్కడే విడిది చేశారట. తప్పని పరిస్థితిలో ఆ రక్కసుని దునిమినందున పశ్చాత్తాపంతో తన తండ్రి పరమశివుడి లింగము ముందు ప్రణమిల్లి ఇక్కడ ప్రార్థన చేశారట. రాక్షసుడి వధకు సంతసించిన దేవతలందరూ వచ్చి అభినందించగా, లేచి నిలబడి వారిని ఆశీర్వధిస్తాడు. ఆ భంగిమలోనే గ్రానైట్ రాయితో విగ్రహాన్ని ప్రతిష్టించారు.

స్వామి ఒక చేతిలో పూలు, మరోచేతిలో రుద్రాక్షమాలతో మురుగన్  ప్రకాశిస్తుంటాడు. మూర్తికి పైనుండి ఆపాదమస్తకం గంధం పూస్తారు. తరువాత గంధం తొలగించి నూనె, పంచామృతముతో పాలతో అభిషేకాలు చేస్తారు. విశేషం ఏమన భారత  దేశంలో ఏ ఆలయము లోను ఖర్చు పెట్టనంతగా ప్రతిరోజు 75 లక్షల రూపాయలు,  పరిమళ గంధమునకై  వాడుతారు. అలా అద్దిన గoధాన్ని భక్తులకిస్తారు. దాన్ని భక్తులు ముఖానికి, చేతులకు శరీరమంతటా పూసుకుంటారు. 

ప్రధానమూర్తికి దగ్గర్లో  దక్షిణముఖంగా ఒక ఉత్సవమూర్తి ఉన్నది. ఆ విగ్రహం స్వర్ణకాంతు లీనుతుంటుంది.   దీనికి ఒక కథనం ఉన్నది. 3 వ ప్రాకారంలోని చిత్రాల ద్వారా 17 వ శతాబ్దంలో డచ్ ఆక్రమణ దారులు ఈ విలువైన విగ్రహాన్ని తస్కరించి తీసుకు పోతుండగా సముద్రంలో పెద్ద ఉరుము శబ్దం రావడంతో భయపడి, తాము చేసిన నేరానికి శాపమునకు గురి అవుదుమని, భయంతో విగ్రహాన్ని సముద్ర తీరం లో పడవేసినారట. తర్వాత నాయకరాజు స్థానిక వడమలయప్ప పిళ్ళై కి మరో విగ్రహం తయారు చేయుమని చెప్పగా, వడమలయపిళ్ళై కి స్వప్నంలో స్కందుడు కనిపించి , సముద్ర తీరంలో అసలు విగ్రహం పడి ఉన్న చోటు చూపించారు.

సముద్రతీరం లో విగ్రహం పడివున్న చోటుకు ఓ పక్షి ఎగురుతూ వెళ్లి దారి చూపినదట. అయితే ఆలయ వారసత్వ పూజారులు ఆ విగ్రహం అపవిత్రమైనదని పూజలు చేయ తిరస్కరించారట. అపుడు ఆ అసలు విగ్రహాన్ని  పునఃప్రతిష్ఠ చేసి పూజలు నిర్వహించ ఆది శైవపూజారులను రాజు నియమించారట. నేటికిని ఆ విగ్రహానికి ఇతర విగ్రహాలతో సంభందం లేక ఆ వంశీయులే పూజలు నిర్వహిస్తుంటారు.     మురుగన్ రాక్షస సంహారం తరువాత తన శూలాన్నీ శుభ్రం చేసిన బావిలో నేటికిని స్వచ్ఛమైన నీరు లభిస్తున్నది. ఈ బావి కరువుకాటకాలప్పుడు కూడా ఎండిపోలేదు. ఈ నీరు సర్వరోగనివారిణి అని భక్తుల నమ్మకం. 

మరియొక విశేషం ఏ మన ఎన్ని సముద్ర అల్లకోలాలు ఏర్పడినా, సునామీ వచ్చినా ఆలయం సముద్ర తీరంలోనే ఉన్నను ఆలయంలోకి సముద్రం నీరు రాదు. 

 హరోం హర. వెట్రివేల్ మురుగనుక్కు
హరోంహార. వెల్ వెల్ వెట్రి వేల్ హరోంహార


ఇట్లు
మీవిధేయుడు
*L. Rajeshwar * 

Quote of the day

You can't cross the sea merely by standing and staring at the water.…

__________Rabindranath Tagore