Online Puja Services

సుఖం సంతోషం ఆనందం

18.119.111.9
ఫ్రెండ్స్ మన జీవితంలో ప్రతి క్షణం సుఖం సంతోషం ఆనందం అనే మూడు పదాలను పర్యాయ పదాలు వాడుతూ ఉంటాం. కానీ ఈ మూడుంటీ అర్థాలు వేరు. సుఖం అనేది శరీరానికి సంబంధించింది. ఇది అన్నమయ ప్రాణమయ కోశాలకు పరితృప్తి కలిగించడం ద్వారా లభిస్తుంది. ఇది భౌతికావసరాలను తెలుపుతుంది. సంతోషం మనసుకు సంబంధించింది.

అనుకున్నది సాధించడం వల్ల గాని అనుకోనిది లభించటం వల్ల గానీ కళలను దర్శించడం వలన గాని మనసుకి కలిగేది సంతోషం ఇది మనోమయ కోశానికి పరితృప్తిని కలిగించడం ద్వారా లభిస్తుంది. చివరిది అసలైనది 'ఆనందం' ఆత్మకు సంబంధించిన జ్ఞానాన్ని పొందడం వలన ఇది లభిస్తుంది. జ్ఞానమయ ఆనందమయ కోశాలకు పరితృప్తి కలిగించడం వలన ఇది లభిస్తుంది. మానవుడు తాను సత్ప్రవర్తన కలిగి అవసరమున్న తోటి మానవులకు సహాయపడుతూ, ఆత్మగౌరవం అంతర్దృష్టి వివేకం కలిగి తాత్విక తాయి నందుకొని ఆనందాన్ని పొందడమే జీవితం. మానవ దేహంలో ఉంటూ ఆధ్యాత్మికంగా జీవించాలంటే బాధలు లేకుండా ఉండటం అనేది ఎంత మాత్రం జరగదు. మానవుడు తన జీవితాన్ని పూర్తిగా భగవదార్పణం చేసేవరకూ రకరకాల బాధల ద్వారా మానవుడు మానసికంగా ఎదగడం అనేది ఒక యజ్ఞంలా జరుగుతూనే ఉంటుంది. అందుకే మనిషి జీవితమే ఒక యజ్ఞం అంటుంది చాందోగ్యోపనిషత్తు.

మానవుడికి దైవసముఖం ప్రాప్తించే వరకూ అతని జీవితం యాతనా మయమై నిత్యమరణంలా ఉంటుంది. మానవుడికి దివ్యమైన జీవితం లభించాలి అంటే తన మనసులోని కోరికలు, భ్రమలు అన్నీ పటాపంచలవ్వాలి. ఆతని హృదయంలో ఈ ప్రపంచంలోని అశాశ్వతమైన వాటి గురించి తానూ దాచుకున్న కలలన్నీ చెదిరిపోయే వరకు మానవుడిలోని ఆత్మ ఆ పరమాత్ముడిని పొందాలని నిరంతరం తపిస్తూ ఉంటుంది. మానవుడికి ఆ స్థితి కలిగే వరకూ లోపలున్న ఆ అంతరాత్మ ఎంత మాత్రమూ ఉపశమించదు.

ఫ్రెండ్స్ చాలామంది మాకు సుఖము సంతోషము లేవు అసలు అస్తమాను బాధలు కష్టాలు అనేసి అనుకుంటారు. అది తప్పు ఆలోచన సుఖము సంతోషము అనేవి మన ఆలోచనలోనే ఉన్నయి చూసేరా అవి శాశ్వతం కాదు.అవి మనం ఎలా ఆలోచిస్తే అవి అలా తందాన అంటాయి మన తో పట్టు వంత పాడతాయి. అలాగే బాధలు కష్టాలు వచ్చాయని బాధపడవద్దు .ఏ జన్మలోనో తెలిసీ తెలియక చేసిన కర్మలు తొలగిపోతున్నాయి అనుకుంటూ శాశ్వతమైన ఆనందం కోసం భగవద్గీత పురాణాలు చదువుతూ జ్ఞానాన్ని పెంపొందించుకుందాం శాశ్వతమైన ఆనందాన్ని నా తండ్రి పాదాల చెంత చేరే వరకు ప్రతిక్షణం పొందుదాం .

Quote of the day

You can't cross the sea merely by standing and staring at the water.…

__________Rabindranath Tagore

© 2022 Hithokthi | All Rights Reserved