Online Puja Services

గురుశిష్యుల సంవాదం

3.129.67.26
శిష్యుడు.. నేను మీకోసం ఎంతో పని చేశాను.. నాకు అనేక విషయాలు నేర్పుతా అని అన్నారు ..
కానీ మీరు నాకేమీ నేర్పనేలేదు అన్నాడు !!

“నేను నీకేమీ నేర్పలేదని నీకెలా తెలుసు?” గురూజీ శాంతంగానే అడిగాడు.

“మరి, మీరు నాతో మాట్లాడనే లేదుగా? నేను మూడువారాలు పనిచేశాను, కానీ మీరు నాకేమీ నేర్పలేదు,” అన్నాడు బాధపడుతూ.

"నేర్పటం అంటే మాట్లాడటమూ, ఉపన్యాసాలివ్వటమూనా?” అడిగాడు గురువు.

“అవును, మరి అంతేగా?” అన్నాడు శిష్యుడు.

“స్కూల్లో ..ఇంట్లో నీకలాగే నేర్పుతారు. కానీ జీవితం అలా నేర్పదు. నా ఉద్దేశంలో జీవితం
అందరికన్నా మంచి గురువు.

జీవితం నీతో దాదాపు ఎప్పుడూ మాట్లాడదు. అది నిన్ను అటూ ఇటూ తోస్తూ ఉంటుంది. అది తోసినప్పుడల్లా, 'నిద్ర లే! నేను నీకొక విషయాన్ని నేర్పాలి!'అంటున్నట్టే లెక్క,”
అన్నాడాయన నవ్వుతూ.

"నువ్వు జీవితం నేర్పే పాఠాలని నేర్చుకుంటే, బాగుపడతావు. లేకపోతే జీవితం నిన్ను తొయ్యటం మానదు. మనుషులు రెండు రకాలు. కొందరు జీవితం తమని అడ్డదిడ్డంగా తోస్తూ ఉంటే చూస్తూ ఊరుకుంటారు. ఇంకొందరు కోపం తెచ్చుకుని, ఎదురుతిరిగి జీవితాన్ని తోస్తారు.

కానీ వాళ్లు తమ బాస్ నో, ఉద్యోగాన్నో, భర్తనో, భార్యనో ఢీకొంటారు. మనందర్నీ జీవితం ఎటుపడితే అటు తోస్తూ ఉంటుంది. కొందరు చేతులెత్తేస్తారు. కొందరు ఎదురుతిరుగుతారు. కొద్దిమంది పాఠం నేర్చుకుని ముందుకి సాగుతారు. వాళ్లకి జీవితం తమని ఇలాతొయ్యటంబావుంటుంది. ఈ కొద్దిమందికీ, ఆ తొయ్యటం అవసరమనీ, దానివల్ల ఏమైనా నేర్చుకోగలుగుతామనీ అనిపిస్తుంది. వాళ్లు పాఠాలు నేర్చుకుంటూ ముందుకి పోతారు. ఎక్కువమంది వెన్ను చూపిస్తారు.

'నువ్వీ పాఠాన్ని నేర్చుకుంటే, నువ్వు పెద్దయాక తెలివైనవాడివీ ..ధనవంతుడివీ..విజేతవి అయి సంతోషంగా జీవిస్తావు. లేకపోతే, నువ్వు జీవితాంతం నీ ఉద్యోగాన్నో, నీకు దొరికే తక్కువ జీతాన్నో, నీ పై అధికారినో నీ పక్క వారినో నీ సమస్యలకి కారణమని తిట్టుకుంటూ బతుకుతావు.

జీవితంలో ఏదో ఒక రోజున ఎక్కణ్ణించో పెద్ద అవకాశం ఊడిపడుతుందనీ, దాంతో నీ సమస్యలన్నీ తీరిపోతాయని ఆశిస్తూ ఊహాలోకంలో బతుకుతూంటావు.” నీకు విజయం సాధించాలనే కోరిక లేకపోలేదు.

కానీ భధ్రతను కోరుకోవటం వల్ల..ఓడిపోతాననే భయం వల్ల ..తెగించి ప్రయత్నం చేయలేదు..

నీ ఆలోచనా విధానాన్ని మెరుగు పరుచుకో అదే నీకు మేలుచేస్తుంది ..అని ఆశీర్వదించాడు. మన సనాతన గురుకుల విద్యా వ్యవస్థ ను పునరుద్ధరణ చేసుకుకోవడమే మన నిజమైన అస్తిత్వం..అదే మనకు ..మన దేశానికి శ్రీరామ రక్ష...

Quote of the day

Let your life lightly dance on the edges of Time like dew on the tip of a leaf.…

__________Rabindranath Tagore

© 2022 Hithokthi | All Rights Reserved