Online Puja Services

పద్నాలుగు లోకాలలో భూలోకం అత్యుత్తమమైనది.

3.14.80.45

పద్నాలుగు లోకాలలో భూలోకం అత్యుత్తమమైనది. ఈ భూలోకంలో భారతఖండం ఇంకా ఉత్తమమైనది. ఇక్కడ మానవుడిగా పుట్టడం ఎన్నోజన్మల పుణ్యఫలం. ఎందుకంటే ఇది ఖర్మభుమి. సులభంగా మోక్షం ఇచ్చే భూమి. ఎందఱో దేవతలు కొలువై ఉన్న భూమి. విష్ణుమూర్తి అవతారాలు దాల్చిన భూమి. కష్టం వెనుకే సుఖం, సుఖం వెనుకే కష్టం, నిత్యం పోరాడుతూనే ఉంటాడు మానవుడు. సులభంగా ఆ విష్ణువు సేవ చేయగల అవకాశం కేవలం మనకే సొంతం. 

ఒక సందర్భంలో కుంతీదేవి (పాండవుల తల్లి) శ్రీకృష్ణుడితో ఇలా అంది. అత్తా కష్టం వస్తే వెంటనే తలచుకుని పిలుస్తావు. నేను వస్తాను. కానీ కష్టాలు పూర్తిగా తొలగిపోవాలి అని ఎందుకు కోరవు? కృష్ణా! కష్టాలు తాత్కాలికంగా ఉంటాయి. అవి వచ్చినప్పుడు మాత్రమే నిన్ను తలుస్తాము. ఆ కష్టాలు లేకపోతె నిన్ను మర్చిపోతాం క్రిష్ణయ్యా. సకలజీవజాతికి ఆధారం నువ్వు. ఒక సమయంలో నువ్వు ఉంటావు, అదే సమయంలో ఉండవు. ప్రతి జీవిలో ఆత్మ రూపంలో కొలువై ఉన్నావు. ఈ విశ్వానికి సృష్టికర్త వి నువ్వు. ఆ కష్టం అనేది లేకపోతె నీకు సేవ చేసే భాగ్యం దొరకదయ్యా. దేవతలకి కుడా నీ సాక్షాత్కారం దుర్లభం. అలాంటిది మాకు మాత్రం పిలవగానే పలుకుతావు.

దేవతలకి కూడా సాధ్యం కాదు ఆయనకి సేవచేయడం. అలాంటిది మనం అనుకున్నదే తడువుగా గుడికి వెళతాం, చేస్తాం. ఏదో ఒకటి కోరుకుంటాం. ఇది ఒక్క మానవుడికి తప్ప దేవతలకి సాధ్యం కాదు. ఎందుకంటే దేవతలకి వారి వారి కార్యాలలో నిమగ్నమై ఉంటారు. చేసే కార్యాలు మానేసి ఆఅ విష్ణు సేవ చేయడానికి అర్హత లేదు. అలాగే రాక్షసులు! వీరికి ఎన్నో వేల ఏళ్ళ తపస్సులు చేస్తే తప్ప సాక్షాత్కారం కుదరదు. కాని ఒక్క మానవుడు మాత్రం కేవలం నామ స్మరణతో అవలీలగా మోక్షాన్ని పొందుతాడు

బి. సునీత 

Quote of the day

Let your life lightly dance on the edges of Time like dew on the tip of a leaf.…

__________Rabindranath Tagore