Online Puja Services

స్వర్ణ భస్మం ఆపకుండా వాడితే ముసలితనం రానివ్వదంట !!!

18.217.182.45
ఆయుర్వేదము ఎంతో నిగూఢమైనది . ఇది అందరికి వంటబట్టదు. వైద్యం చేయుటకు ఆ నారాయణుడి కృప తప్పక అవసరం. ఆయుర్వేదం అంటే ఏవో చెట్ల పసర్లు , చూర్ణాలు , లేహ్యాలు , ఘృతాలు అని మాత్రమే అనుకుంటారు. కాని ఆయుర్వేదం నందు మరొక గొప్ప విభాగము కలదు. అదే రసౌషధ విభాగం . దీనిగురించి చాలా తక్కువమందికి మాత్రమే తెలుసు . రసౌషధ విభాగంలో లోహాలను శుద్ది చేసి పుటాలు పెట్టి ఔషధరూపంలో ఇస్తారు. ఇవి అతి త్వరగా ఫలితాన్ని ఇచ్చును. దీనికి అత్యంత అనుభవం కలిగిన వైద్యులు చేయగలరు . భగవంతుడి కృప వలన ఇంకా అటువంటి వైద్యులు మన భరతభూమి యందు ఉన్నారు . 

ఇప్పుడు మీకు ఆ భస్మాల గురించి వాటి ఉపయోగాల గురించి సంపూర్ణముగా వివరిస్తాను. భస్మాలలో ప్రముఖస్థానం " స్వర్ణభస్మం " నకు దక్కును. ఇది ఖరీదు అయినను ఇది ఇచ్చే ఫలితాల ముందు ఆ ఖరీదు చాలాతక్కువ . ఇప్పుడు మీకు స్వర్ణభస్మం గురించి వివరిస్తాను . అంతకు ముందు స్వర్ణభస్మం గురించి ఒక పోస్టు పెట్టాను. ఇప్పుడు నేను మరింత వివరంగా , నేను స్వర్ణభస్మం ఇచ్చినవారిలో వచ్చిన ఫలితాలు అనుభవపూర్వకంగా మీకు వివరిస్తాను . 

స్వర్ణభస్మం ఉపయోగాలు  - 

*  స్వర్ణభస్మం త్రిదోష జనితవ్యాధులను పోగొట్టును . విశేషముగా వాతవ్యాధులను హరించును . 
 
 *  శరీరం నందలి వాత, పిత్త , శ్లేష్మాలను సమానస్థితి యందు ఉంచును. 
 
 * వీర్యమును అభివృద్ది చేయును . బలాన్ని కలిగించును. గొప్ప రసాయనఔషధము . 
 
 * స్వర్ణసేవన వలన నేత్రరోగములు హరించి నేత్రాలకు బలము కలుగును. 
 
 *  ఆయుష్షుని పెంచడంలో దీనికిదే సాటి . ఆయువుని వృద్ధిచేయు ఔషధములు లోకము నందు బహు అరుదుగా ఉన్నవి. ఆ ఔషధములలో స్వర్ణభస్మం ప్రధానమైనది. 
 
 *  ఇది అత్యంత శ్రేష్టమైనది  బుద్ధిబలాన్ని , జ్ఞాపకశక్తిని , ఆలోచనాశక్తిని అనగా బుద్ది , స్మృతి , మతిని కలిగించును. 
 
 *  ఉన్మాదం వంటి మానసిక రోగములను పోగొట్టును . 
 
 *  రక్తాన్ని  శుభ్రపరచును. శరీరకాంతి కలిగించును. 
 
 *  పాపము వలన సంక్రమించు రోగములను పోగొట్టు శక్తి కలిగినది . 
 
 *  క్షయరోగమును పోగొట్టటంలో శక్తివంతముగా పనిచేయును . 
 
 *  వ్యాధివలన కాని లేక మరేదైనా కారణం వలన శరీరం చిక్కిపోయినవారికి శరీరాన్ని బాగుచేసి కండపుష్ఠి కలిగించును. 
 
 *  రక్తము నందలి , ఉపిరితిత్తుల యందలి క్రిములను నాశనం చేయును . 
 
 *  జ్వరములను హరించును . 
 
 *  ఇతర ఔషధముల వలన తగ్గని మొండివ్యాధులు ఈ స్వర్ణభస్మ సేవన వలన తగ్గును . 
 
 *  పంచకర్మలు చేసినప్పుడు ఇది ఉపయొగించవలెను . 
 
 *  స్వర్ణభస్మ సేవన చేయువానికి పెట్టుడు మందులు , విషాలు ఎక్కవు. 
 
 *  విషము తిని ప్రాణాపాయ స్థితి యందు ఉన్నవారికి ముందు తామ్రభస్మముతో వాంతి చేయించి పావుతులము స్వర్ణభస్మాన్ని ఒకే మోతాదుగా లోపలికి ఇచ్చిన ప్రాణాలు నిలుచును . లోపలికి ఇచ్చిన వెంటనే ఇది విషము కంటే వేగముగా హృదయమునకు చేరి హృదయాన్ని విషప్రభావం నుండి కాపాడి ప్రాణాన్ని నిలుపును.
 
 * ఇది ఎంత పెద్ద మోతాదు వాడినను ప్రమాదము లేదు . వ్యాది బలాన్ని అనుసరించి 1 తులము 60 మోతాదుల నుండి 100 మోతాదులుగా వాడుకోవచ్చు . 
 
.*  శరీరం నందలి కండరాలు , ఎముకలు , నరాలకు అత్యంత శక్తికి ప్రసాదించును. 
 
 *  రక్తపోటు ( BP ) సమస్య నివారించును . 
 
 *  ఇది ఆపకుండా వాడిన ముసలితనమును దగ్గరకు రానివ్వదు. సమస్త  వాతరోగములను హరించును . 
 
పైన చెప్పిన యోగాలు మాత్రమే కాకుండా మరికొన్ని ఔషధాలలో స్వర్ణాన్ని కలపడం ద్వారా ఔషధ బలం పెరిగి ఫలితం త్వరగా రావటం నేను గమనించాను. స్త్రీలకు , పిల్లలకు దీనికి మూలికాలేహ్యములలో కలిపి ఇవ్వవచ్చు. ముఖ్యముగా స్త్రీలలో గర్భశయ దోషాలు , నెలసరి సమస్యల నివారణ జరిగింది. ముత్యభస్మమునకు దీనికి కలిపి ఇవ్వడం వలన స్త్రీలలో శరీరబలం పెరిగి స్త్రీలు ఎదుర్కొనే క్యాల్షియం సమస్య నివారణ అగును. శరీరకాంతి పెరుగును . ప్రాచీన ఆయుర్వేద గ్రంథాలలో శిశువుకు చేయు స్వర్ణప్రాసన గురించి చాలా చక్కగా వివరించారు . పుష్యార్కయోగం అనగా గురువారం పుష్యమి నక్షత్రం లేదా ఆదివారం పుష్యమి నక్షత్ర సమయాన శిశువునకు స్వర్ణప్రాసన చేయించవలెను . 
 
స్వర్ణప్రాసన అనగా ప్రస్తుతం చేతికి ఉన్న ఉంగరం తీసి శిశువు నాలికమీద రాస్తున్నారు. ఇది పూర్తిగా తప్పు. ఒక గుండుపిన్ను లేదా ఏదైనా సన్నటి వస్తువు తీసుకుని తేనె తగిలించి ఆ తరువాత ఆవునెయ్యి తగిలించి తరువాత స్వర్ణభస్మానికి తగిలించి అప్పుడు శిశువు నాలిక మీద అంటించి లొపలికి ఇవ్వవలెను. కొన్ని ఆయుర్వేద గ్రంథాలలో తల్లి కడుపు నుంచి శిశువు బయటకి వచ్చిన తరువాత శుభ్రపరచి తేనెతో  పాటు స్వర్ణభస్మాన్ని నాలికపైన రాయవలెను అని ఉన్నది. ఈ స్వర్ణభస్మం నిత్యం పిల్లలకు వాడించుచున్న బ్రహుస్పతితో సమానమైన తెలివితేటలు కలవారు , ఏకసంధాగ్రాహుకులుగా తయారగును . 
 
ప్రస్తుత పరిస్థితుల్లో ఈ కరోనా మహమ్మారి నుంచి రక్షించుకోవడానికి రోగనిరోధకశక్తి అత్యంత అవశ్యము.  రోగనిరోధకశక్తి పెరగడానికి స్వర్ణభస్మ సేవన చేయుట అత్యంత ప్రధానం. ఈ స్వర్ణభస్మం కొంచం ఖరీదు ఎక్కువుగా ఉండును. అవకాశం ఉన్నవారు , ధనమును వెచ్చించ గలిగినవారు తప్పక స్వర్ణభస్మ సేవన చేయదగిన సూచన . అనుభవ వైద్యుల సలహా ప్రకారం మాత్రమే వాడగలరు . 
 
తరవాతి పోస్టులో  మరొక  భస్మం గురించి సంపూర్ణముగా వివరిస్తాను . 
 
  గమనిక  -
నాచే రచించబడిన "ఆయుర్వేద మూలికా రహస్యాలు " , " ప్రాచీన ఆయుర్వేద రహస్యాలు "  అను ఈ రెండు గ్రంథముల యందు అత్యంత రహస్యమైన సులభముగా ఇంటి యందు , చుట్టుపక్కల దొరికే మూలికలతోనే పెద్దపెద్ద రోగాలను నయం చేసుకొనే విధముగా అనేక వైద్య యోగాలను ఇచ్చాను. ఈ గ్రంథాలలో ఇచ్చినటువంటి యోగాలు అన్నియు గత 250 సంవత్సరాల నుంచి వంశపారంపర్యముగా మాకు వస్తున్న రహస్యయోగాలు పరోపకారార్థం దాచుకోకుండా ప్రచురించాను.
మన చుట్టుపక్కల ఉండే మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల బొమ్మలతో మొక్కల చిత్రపటాలు ఇవ్వడం జరిగింది.
రైతులకు ఉపయోగపడేవిధముగా చెట్లను , భూమిని బట్టి , రాళ్లని బట్టి భూమి యందు జలమును కనుగొను విధానం , ముహూర్తాలను అనుసరించి ఏయే సమయాలలో పంటలు వేయాలి . ఆయుర్వేద మూలికల సహాయముతో పురుగు మందులు వాడకుండా అత్యంత ఎక్కువ దిగుబడులు సాధించే రహస్య వృక్షయుర్వేద యోగాలు , పశువులకు సంబంధించిన వైద్య యోగాలు కూడా ఇవ్వడం జరిగింది . ఈ గ్రంథాలలో ఇచ్చిన యోగాలు ఉపయోగించటం వలన ఎటువంటి వ్యతిరేక ఫలితాలు రావు.
 
ప్రాచీన ఆయుర్వేద రహస్యాలు గ్రంథం 288 పేజీలు ఉంటుంది . విలువ 350 రూపాయలు మాత్రమే . ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథం 384 పేజీలు ఉంటుంది . విలువ 450 రూపాయలు . కొరియర్ చార్జి 50 రూపాయలు అదనం .పుస్తకములు ఎక్కువ కాలం మన్నిక కొరకు కుట్టించి ఇవ్వడం మరియు అత్యంత నాణ్యమైన తెల్లటి 80GSM పేపరుతో ఉంటాయి.
ఈ రెండు గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా 9885030034 నెంబర్ కి ఫోన్ చేయగలరు. కామెంట్లు , మెస్సేజెస్ సమాధానము ఇవ్వబడదు. కాల్ చేయగలరు .
 
కాళహస్తి వేంకటేశ్వరరావు 
9885030034 
అనువంశిక ఆయుర్వేద వైద్యులు

Quote of the day

From the solemn gloom of the temple children run out to sit in the dust, God watches them play and forgets the priest.…

__________Rabindranath Tagore