Online Puja Services

సృష్టికి ముందు ఉండే ఏకైక దైవం!

3.129.217.191
ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ
 
 సృష్టికి ముందు ఉండే ఏకైక దైవం! 
సృష్టి నశించిన తరువాత ఉండే ఏకైక దైవం! 
 ప్రళయము లో సర్వ ప్రపంచం నశింపగా నశించక సదా కొలువై ఉండే దైవం శివుడేనని మహాభారత వచనం. 
 
 శివునికి సృష్టికి గల సంబంధం సముద్రానికి అలకు గల సంబంధం లాంటిది. అలా పుట్టకముందు సముద్రం ఉన్నది. నశించిన తరువాత కూడా సముద్రం ఉంటుంది. అదేవిధంగా సృష్టి ముందు శివుడు ఉన్నాడు. సృష్టి నశించిన తర్వాత కూడా శివుడు ఉన్నాడు. అందుకే యజుర్వేదం. 
              నమో అగ్రీయయ చ ప్రథమాయ చ
  (సృష్టికి ముందరి వాడు ప్రథముడైన శివుడికి వందనం అని శివుడికి నమస్కరించి నది) 
 
 ఎన్నో అలలు సముద్రంలో జనించి, సముద్రంలోనే స్థితి కలిగి చివరికి సముద్రంలోనే లయిస్తూoదో అదేవిధంగా శివుని లోనే సృష్టి జరిగి శివుని లోని స్థితి కలిగి    
 చివరకి శివుని లోనే. 
 అందుకే పరబ్రహ్మం అంటే ఏమిటో "ఐతరేయోపనిషత్" లో వరుణ దేవుడు తన కుమారుడైన" భృగు మహర్షికి" ఇలా వివరించెను. 
 
  నాయనా! సమస్త చరాచర ప్రపంచమంతా దేని నుండి జనించి,దేనిలో స్థితి కలిగి దేనిలో చివరికి లయిస్తూoదో ఆ దైవం శివుడు !అని చెప్పడం జరిగింది.
 
ఒక్క శివుడు తప్ప, బ్రహ్మ విష్ణు రుద్ర ఇంద్రాది దేవతలు సృష్టికి సంబంధించిన వారే. ఒక్క శివుడు మాత్రమే సృష్టికి అతీతమైన వాడు, ఆధారమైనవాడు, 
అధిష్టానం అయినవాడు.
"నీవెవరు?" అని పరమేశ్వరుని ప్రశ్నించిన దేవతలకు పరమేశ్వరుడు  ఏమంటున్నారో వినండి.
 
సృష్టికి ముందు నేనొక్కడినే ఉన్నాను సృష్టి కాలంలో జీవాల జీవులలో  అంతర్యామి గానూ సర్వతునిగానే ఉంటాను. సృష్టి అనంతరం నేనొక్కడినే ఉంటాను. నాకు సదా తోడుగా ఉండి వాడు ఒక్కడు కూడా లేడు అని తెలిపెను. అందుకే" వశిష్ఠ మహర్షి శ్రీ రామునికి" జ్ఞానోపదేశం చేస్తూ, శ్రీ రామ! నీవు గొప్పగా భావించే బ్రహ్మ విష్ణు రుద్రులు అలలు వంటి వారు నీటి బుడగల వంటి వారు. కానీ శివుడు సాగరము లాంటి వాడని శివుని యొక్క వైభవాన్ని ఇలా తెలిపెను. 
 
 ఓ రాఘవ! నేటికి అనేక లక్షల మంది బ్రాహ్మలు, వందలకొలది శంకరులు, వేలకొలది నారాయణులు, గతించిరి అని తెలిపెను.  
  అందుకే నీవు అలను చూడవద్దు, సముద్రాన్ని చూడు అన్నారు. కాబట్టి అలల వంటి దేవతలను వదిలి సాగరం వంటి శివుని సేవించి, తరించు! 
 
ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ.   శివుడే దేవాది దేవుడు.   ఆది దేవుడు,  పరమ పురుషుడు . 
 
- L. రాజేశ్వర్       
 

Quote of the day

I suppose leadership at one time meant muscles; but today it means getting along with people.…

__________Mahatma Gandhi