Online Puja Services

గోపూజ వల్ల అందం ఐశ్వర్యం సిద్ధిస్తాయి.

18.118.121.55

గోపూజ వల్ల అందం ఐశ్వర్యం సిద్ధిస్తాయి. మంగళవారం శుక్రవారం ఇలా చేసి చూడండి . 
- లక్ష్మి రమణ 

అందం కోసం ఆవుని పూజించాలా ? అంటే అవునంటున్నాయి శాస్త్రాలు.  అదెలా అంటారేమో, పూర్తిగా గోమాతని గురించి తెలుసుకుంటే, ఈ సందేహం రానేడాడు. అందం, ఆరోగ్యం, ఐశ్వర్యం, భగవదనుగ్రహం గోసేవవల్ల కలుగుతాయి . ఎన్నో ఈతిబాధలకి గోపూజ పరిష్కారం . మన నిత్యజీవితంలో ఎదురయ్యే సమస్యలని పోగొట్టుకొనేందుకు అనువైన, సులువైన పరిష్కారం గోసేవ. 

దేవలోక గోవు కామధేనువు. దేవేంద్రుని ఆధీనంలో ఉండే కామధేనువు , కల్పవృక్షం కోరినవన్నీ అనుగ్రహిస్తాయి. ఒక్కసారి కామధేనువు చిత్రాన్ని చూడండి .  అందులో గోవు తోక భాగంలో లక్ష్మీదేవి నివశిస్తుంటుంది . అందువల్లనే గోవు తోకను స్పర్శించి ప్రార్థిస్తుంటారు. గోవు పాదాల నుంచి కొమ్ముల వరకు దేవతలు, త్రిమూర్తులు కొలువుండటం వలన గోవును దేవతగా భావించి పూజలు చేస్తుంటారు. 

 సత్వగుణ సంపన్నమైన గోమాత సేవవల్ల , పూజవల్ల కామోద్రేక్తంతో చేసే తప్పుల వలన కలిగే దోషాలు కూడా నివారణ అవుతాయని  ఆధ్యాత్మిక గ్రంథాలలో పేర్కొనడం గమనార్హం . అంటే గోవును పూజించడం మాత్రమే కాకుండా గోవును దేవాలయానికి దానంగా ఇవ్వడం, గోవు వలన మనకు సిద్ధించే పాలు, పెరుగు, వెన్న, నెయ్యి వంటి పదార్థాలను ఇతరులకు దానంగా ఇవ్వడం కూడా గోపూజతో సమానమేనని పండితులు భావిస్తున్నారు. అలాగే దేవ రహస్యాన్ని కనుగొనే మహత్మ్యం గోవుకు మాత్రమే ఉంటుందని శాస్త్రాలు చెపుతున్నాయి. అందువల్లే గోపూజకు శాస్త్రాల్లో కీలక ప్రాముఖ్యత సంతరించుకుంది. 

 గోక్షీరం (ఆవుపాలు)లో చతుస్సముద్రాలుంటాయి. సర్వాంగాలలో సమస్త భువనాలు దాగి ఉం టాయి. ఆవు నుదిటి భాగంలో శివుడు, కొమ్ముల చివరలో మూడుకోట్ల యాభైలక్షల తీర్థాలు వుంటాయి. వాటిపై చల్లిన నీటిని సేవిస్తే, త్రివేణి సంగమంలోని నీటిని శిరస్సు పై చల్లుకున్నంత ఫలితం లభిస్తుంది. నుదుటన శివుడు ఉంటాడు కనుక అక్కడ శివ అష్టోత్త రం, సహస్రనామాలు పఠిస్తూ, బిళ్వ దళాల తో పూజిస్తే,సాక్ష్యాత్తు కాశీ విశ్వేశ్వరుడ్ని పూజించిన ఫలితం దక్కుతుంది. గోవు నాసిక యందు సుబ్రహ్మణ్యస్వామి వుండటం వల్ల నాసికను పూజిస్తే, సంతాన నష్టం ఉండదు. ఆవు చెవివద్ద అశ్వినీ దేవతలు కొలువై ఉం టారు. వారిని స్వర్గలోక వైద్యులు అంటారు. అందువల్ల ఆవు చెవిని పూజిస్తే, సమస్త రోగాల నుండి విముక్తి అవుతుందంటారు. ఆవు కన్నుల దగ్గర సూర్య, చంద్రులు ఉంటారు. వారిని పూజిస్తే, అజ్ఙానమనే చీకటి నశించి జ్ఞానకాంతి, సకల సంపదలు కలుగుతాయి. ఆవు నాలికపై వరుణ దేవుడు వుండటం వల్ల అక్కడ పూజిస్తే శీఘ్ర సంతతి కలుగుతుంది . ఆవు సంకరంలో ఉన్న సరస్వతీదేవిని పూజిస్తే విద్యాప్రాప్తి కలుగుతుంది . ఆవు చెక్కిళ్ళలో కుడి వైపున యముడు, ఎడమవైపున ధర్మదేవత లుంటారు. కనుక వాటిని పూజిస్తే, యమబాధలుండవు, పుణ్యలోకప్రాప్తి. ఆవు పెదవుల్లో ప్రాతఃసంధ్యాది దేవతలుంటారు. వాటిని పూజిస్తే, పాపాలు నశిస్తాయి. ఆవు కంఠంలో ఇంద్రుడిని పూజిస్తే, ఇంద్రియ పాటవాలు, సంతానం కలుగుతుంది. ఆవు పొదుగులో నాలుగు పురుషార్థాలు ఉంటాయి. కనుక ఆ చోట పూజిస్తే, ధర్మార్థ, కామమోక్షాలు కలుగుతాయి. ఆవు గిట్టల చివర 'నాగదేవతలు' ఉంటారు. వాటిని పూజిస్తే, నాగలోక ప్రాప్తి లభిస్తుంది. అంతేకాక భూమిపై నాగుపాముల భయం ఉండదు. ఆవు గిట్టల్లో గంధర్వులుంటారు. కనుక గిట్టలను పూజిస్తే గంధర్వలోక ప్రాప్తి. గిట్టల ప్రక్కన అప్సరసలుంటారు. ఆ భాగాన్ని పూజిస్తే సఖ్యత, సౌందర్యం లభిస్తాయి.  అందువల్ల 'గోమాత' సకల దేవతా స్వరూపంగా భావిస్తారు. 

ఇవేకాకుండా జాతక రీత్యా శని దోషం ఉన్న వారు, గ్రహచారం బాగా లేనివారు, పెళ్లికానివారు గోస్త్రోత్రం చదివితే సత్ఫలితాలు పొందుతారు. శని దోషం ఉన్నవారు ప్రతి శనివారం నల్లని ఆవుకు తవుడు, పచ్చగడ్డి సమర్పించి తొమ్మిది ప్రదక్షిణలు చేస్తే, శని బాధలు తగ్గుతాయి. 

కుజదోషం వల్ల వివాహంలో ఆటంకాలు, ఆలస్యం అయ్యేవారు ప్రతి మంగళవారం 'కందులు' నానబెట్టి ఎర్రని ఆవుకు తొమ్మిది వారాలపాటు తినిపిస్తే, సత్ఫలితాలుంటాయి.

గోవుని ఈ వారం ఆదివారం అనిలేదు, ఏవారమైనా చక్కగా పూజించుకోవచ్చు . గోవుకి ముఖానికి, పృష్టానికి , వెన్నుకీ, కాళ్ళకీ చక్కగా పసుపురాసి , బొట్టు పెట్టి , గంధ పూసి సాక్షాత్తూ అమ్మవారిగా భావించి నిత్యం పూజించే వారికి, గోవులకి ఆహారం ఇచ్చేవారికి  ఎటువంటి కష్టాలూ రావు . దోషాలన్నీ తొలగి సకల శుభాలూ కలుగుతాయి . ప్రతిరోజూ కాకపొతే, కనీసం మంగళవారం శుక్రవారం ఇలా చేసి చూడండి . ఖచ్చితమైన ఫలితాలు పొందుతారు . 

గోవుకు గడ్డి పెట్టేటప్పుడు, తగిన ఆహారాన్ని ఇచ్చేటప్పుడు ఈ శ్లోకాన్ని పఠి౦చడ౦ శుభకర౦. 

"ప౦చభూతశివే! పుణ్యే! పవిత్రే! సూర్య స౦భవే! ప్రతీచ్ఛేమ౦ మయాదత్త౦ సౌరభేయి! నమోస్తుతే!!"

ప౦చ భూతాలకు శుభాన్ని కలిగి౦చే పుణ్యస్వరూపిణీ! పవిత్రురాలా! సౌరశక్తిలోని దివ్యత్వ౦ను నింపుకున్నటువంటి తల్లీ ! నేనిస్తున్న ఈ ద్రవ్యాన్ని స్వీకరి౦చు. సురభీ వ౦శ౦లో కలిగిన తల్లీ! నా నమస్కారాన్ని స్వీకరించి అనుగ్రహించమ్మ ! అని ఈ ప్రార్థన అర్థం . 

శుభం . 

#gopuja

Tags: cow, gopuja, kamadhenuvu, beauty, wealth

Quote of the day

I suppose leadership at one time meant muscles; but today it means getting along with people.…

__________Mahatma Gandhi