Online Puja Services

Pothana Prarthana Padyam

18.118.1.232

పోతన ప్రార్ధనా పద్యం -
స్తోత్రం అనగానే మనకు సంస్కృతంలోనే ఉండాలనే భావం స్థిరపడింది . కొన్ని యుగాలపాటు నిలిచి వెలిగే స్తోత్రాలు సంస్కృతంలో ఉన్నమాట నిజమే . కానీ అంతకు ఏ మాత్రం తగ్గకుండా నిలిచివెలిగేవి పోతన పద్యాలు , ప్రత్యేకించి ప్రార్థనాపద్యాలు . తెలుగు భాషమీద అభిమానం ఉన్నవారు , మనసును  భక్తితో పునీతం చేసుకోదలిచినవారు తప్పకుండా పోతనను చదవాల్సిందే , అర్థం చేసుకోవాల్సిందే , నోరు నొవ్వంగ స్మరించాల్సిందే . కృష్ణుడిలో శివుడిని , శివుడిలో కృష్ణుడిని దర్శించినవాడు పోతన . సరస్వతిని ముందు కూర్చోబెట్టుకుని ఓదార్చినవాడు పోతన . వరప్రసాదమయిన తన ఘంటంతో ప్రహ్లాదుడికి , గజేంద్రుడికి , యశోదకు , బాలక్డిష్ణుడికి తెలుగు నేర్పినవాడు పోతన .
------/////------

పోతన పద్యం -అమ్మలగన్నయమ్మ --తెలియకపోతే తెలుగు తెలియనట్లే . అందరు అమ్మలకు ఒక అమ్మ ఉంది . ఆమె లోకానికే మాత . ఆదిమూలమయిన అమ్మ . చాలా పెద్దమ్మ . దయకు సముద్రంలాంటిది . మనం మనసుపొరల్లో అడుగునుండి నమ్మికతో కొలిస్తే చాలు - ఆయా హృదయాలలో వచ్చి కొలువయ్యే అమ్మ . ఆమె మన అమ్మ - దుర్గమ్మ . మనకు మహత్వ , కవిత్వ , పటుత్వ  సంపదలనిస్తుంది .

Quote of the day

The life of an uneducated man is as useless as the tail of a dog which neither covers its rear end, nor protects it from the bites of insects.…

__________Chanakya