Online Puja Services

దత్తాత్రేయుని ఈ జపంతో సర్వబాధలు , పీడలూ తొలగిపోతాయి

18.191.234.62

దత్తాత్రేయుని ఈ జపంతో సర్వబాధలు , పీడలూ తొలగిపోతాయి
- లక్ష్మీరమణ 
  
దత్తాత్రేయుడు జగద్గురువు. ఆస్వామి లీలలు విచిత్రంగా, ఊహకి అందనివిగా ఉంటాయి. సమస్త సంపదలకూ భర్తగా, సమస్త సిద్ధులకూ జన్మనిచ్చిన త్రిమూర్త్యాత్మకుడు దత్తప్రభువు.  ఆయన అనుగ్రహం ఉండాలి గానీ , ఎటువంటి ఈతిబాధలూ కూడా దరిచేరడానికి సాహసం చేయవు. దత్తుడు అంటేనే ఇచ్చేవాడని అర్థం . అందువల్ల దత్తుని ఉపాసించినవారికి జీవితంలో ఎదురనేది ఉండదు. ఎటువంటి బాధలైనా స్మరణ మాత్రం చేత తొలగించగల కరుణాంతరంగుడు శ్రీ దత్తాత్రేయుడు.  ఆయనని ఇలా స్మరించి  పూజిస్తే, కష్టాలన్నీ తొలగిపోతాయాని సూచిస్తున్నారు దైవజ్ఞులు . 
 

1. సర్వరోగ నివారణ చేయగలిగిన దత్త మంత్రం.
 
"నమస్తే భగవన్ దేవ దత్తాత్రేయ జగత్ ప్రభో||
సర్వ రోగ ప్రశమనం కురు శాంతిమ ప్రయచ్ఛమే||"

 
2. సర్వ బాధలనూ నివారించే దత్తాత్రేయుని  మంత్రం.

"నమస్తే భగవన్ దేవ దత్తాత్రేయ జగత్ ప్రభో ||
సర్వ భాధా ప్రశమనం కురు శాంతిం ప్రయచ్ఛమే||"

 
3. పోగొట్టుకున్న వస్తువులు, దొంగలించ బడిన ధనము లేక వస్తువుల తిరిగి పొందదానికి దత్తుని భక్తుడు కార్తవీర్యార్జనుడి స్మరణ ఫలదాయకం . ఆ మంత్రమే ఇది . 
 
“కార్త వీర్యార్జునో నామ రాజా బాహు సహస్రవాన్|| 
తస్య స్మరణ మాత్రేన హృతం నష్టంచ లభ్యతే||”

 
4. దరిద్రం వీడి పోయి, లక్ష్మీమాత అనుగ్రహం సిద్ధించడానికి  దత్త మంత్రం.
 
"దరిద్ర విప్రగ్రేహే య: శాకం భుక్త్వోత్తమ శ్రియమ||
దదౌ శ్రీ దత్త దేవ: సదా దారిద్ర్యాత్ శ్రీ ప్రదోవతు||"

 
5. సంతాన సౌభాగ్యం కోసం దత్త ఉపాసన అత్యంత ఫలదాయకం. సంతానం కోసం దత్తాత్రేయుని  మంత్రం.
 
"దూరీకృత్య పిశాచార్తిం జీవయిత్వా మృతం సుతం||
యో భూదభీష్టదః పాతు సనః సంతాన వృద్ధికృత్||"

 
6. సౌభాగ్య సిద్ధికి దత్త మంత్రం.
 
"జీవయామాస భర్తారం మృతం సత్యాహి మృత్యుహా||
మృత్యుంజయః స యోగీంద్రః సౌభాగ్యం మే ప్రయచ్ఛతు||"

 
7. రుణబాధల విరుగుడు కోసం, అప్పుగా ఇచ్చిన ధనం తిరిగి రావడం కోసం దత్తుని మంత్రం.
 
"అత్రేరాత్మ ప్రదానేన యోముక్తో భగవాన్ ఋణాత్||
దత్తాత్రేయం తమీశానం నమామి ఋణముక్తయే||"

 
8. సర్వ పాపనివారణ కోసం దత్త మంత్రం.
 
“అత్రిపుత్రో మహాతేజా దత్తాత్రేయో మహామునిః||
తస్య స్మరణ మాత్రేన సర్వ పాపైః ప్రముచ్యతే||”

 
9. దత్తాత్రేయ అనుగ్రహ సిద్ధికి  మంత్రం.
 
“అనసూయాసుత శ్రీశ జనపాతక నాశన||
దిగంబర నమో నిత్యం తుభ్యం మే వరదో భవ||”

 
10. ఉన్నత విద్య కోసం దత్త మంత్రం.
 
“విద్వత్సుత మవిద్యం య అగతం లోక నిందితం||
భిన్న జిహ్వం బుధం చక్రే శ్రీ దత్తః శరణం మమ||”

 
11. సర్వ కష్ట నివారణ కోసం దత్త మంత్రం.
 
"అనసూయాత్రి సమభూతో దత్తాత్రేయో దిగంబర: 
స్మర్తృగామీ స్వభక్తానాం ఉధ్ధర్తా భవ సంకటాత్||

 
ఈ మంత్రాలని జపించే విధానం ఇదీ :

ముందుగా మీ సమస్యా పరిష్కారానికి ఏ మంత్రము అవసరమో దానిని తీసుకోండి . ఒక గురువారం ఉదయం పూట ఆ మంత్రాన్ని రోజు 108 సార్లు లేక సమస్య తీవ్రత బట్టి 1008సార్లు గాని జపం చేయాలి. ఇలా 41 రోజులు లేదా 41 వారాలు చేయడం ద్వారా అనుకున్న కోరికలు నెరవేరుతాయి. ఈతిబాధలు తొలగిపోతాయని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు.

#dattatreya

Tags: dattatreya, japam, 

Quote of the day

Anger and intolerance are the enemies of correct understanding.…

__________Mahatma Gandhi