Online Puja Services

సిరిసంపదలకు శ్రీమహాలక్ష్మీ అష్టకం

3.145.2.184

సిరిసంపదలకు శ్రీమహాలక్ష్మీ అష్టకం..!!!!!

స్థిరమైన ఐశ్వర్యం కోసం ఆకుపచ్చ చీర కట్టుకున్న 
శ్రీ మహాలక్ష్మికి ఏనుగులు అభిషేకం చేస్తున్నట్టు 
ఉండే చిత్రపటాన్ని తూర్పు వైపు ఉంచి, 
రోజూ మహాలక్ష్మి అష్టకం చదవాలి. 

ప్రతి శుక్రవారం తులసిమాల వెయ్యాలి. 
దీనివల్ల లక్ష్మి చాంచల్యం తగ్గి స్థిరమైన ఐశ్వర్యం లభిస్తుంది

ఐశ్వర్యాభివృద్ధికి మహాలక్ష్మి అష్టకం.

మనం మన కుంటుంబసభ్యులు సిరిసంపదలతో తులతూగేందుకై లక్ష్మీదేవి ఆరాధనను విధిగా చేస్తుంటాం. 
ఆ దేవి సర్వత్రా కొలువయి ఉంది. 

ఆ తల్లి మన శరీరంలో కూడ కొలువై ఉంటుందన్నది చాలామందికి తెలియని విషయం. 
లక్ష్మీదేవి పాదాలలో ఉన్నవారికి గృహసౌభాగ్యం కలుగుతుంది. 
ఒడిలో ఉంటే మంచి సంతానం కలుగుతుంది. తొడలపై ఉంటే రత్నాలు, 
నానా విధాలైన ద్రవ్యాలు లభిస్తాయి. 
కంఠంలో కొలువైతే నగలకు కొదవ ఉండదు. హృదయంలో ఉంటే కోరుకున్న కోరికలు తీరుతాయి. 
ఈ విషయం మార్కండేయపురాణంలో విపులీకరించబడింది. 

ఈ అష్టకాన్ని క్రమం తప్పకుండా పఠించే భక్తుల ఇళ్ళల్లో లక్ష్మీదేవి అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది.

లక్ష్మీఅష్టకం..

నమస్తేస్తు మహామాయే శ్రీ పీఠే సురపూజితే, 
శంకచక్ర గదాహస్తే మహాలక్ష్మీ నమోస్తుతే

దేవతలచేత పూజింపబడే లక్ష్మీ, 
తన హస్త మందే శంఖును, గదను ధరించి 
శ్రీపీఠంపై ఆసీనయైన ఆ మాహాలక్ష్మీకి 
నా నమస్సులు.

నమస్తే గరుడారూడే కోలాసుభయంకరి,
సర్వపాపహరే దేవి మహాలక్ష్మీ నమోస్తుతే

గరుడుని అధిరోహించి కోలాసురునికి 
భయాన్ని కలిగించే సర్వపాపాల్ని పోగొట్టుదానవు అయిన శ్రీ మహాలక్ష్మీ నీకు నా నమస్కారాలు.

సర్వజ్ఞే సర్వవరదే సర్వదుష్టభయంకరి,
సర్వదుఃఖహరే దేవి మహాలక్ష్మీ నమోస్తుతే

సర్వజ్ఞురాలవు, 
అడిగిన వరాలను ఇచ్చే దానవు, 
దుష్టులకు భయం గోల్పెదానవు. 
అందరి దుఃఖాన్ని ప్రారద్రోలేదానవు 
ఐన మహాలక్ష్మీ నీకు నా నమోవాక్కాలు .

సిద్ధిబుద్ధి ప్రదే దేవి భుక్తిముక్తిప్రదాయిని
మంత్రమూర్తే సదా దేవి మహాలక్ష్మీ నమోస్తుతే

సిద్ధిని, బుద్ధిని, భుక్తిని, ముక్తిని ప్రసాదించే దానవు, ఎల్లప్పుడూ మంత్రమూర్తివి అయిన మహాలక్ష్మీదేవివి నీవు..నీకు నా వందనాలు.

ఆద్యన్తరహితే దేవి ఆద్యశక్తి మహేశ్వరి 
యోగజే యోగసంభూతే మహాలక్ష్మీ నమోస్తుతే

ఆది అంతాలులేని దానవు.
నీవు, అద్యాశక్తిని మహేశ్వరివి యోగభాగం నుంచి జన్మించిన యోగ సంభూతురాలవు అయిన మహాలక్ష్మీవి నీవు..నీకు దండాలు.

స్థూలసూక్ష్మ మహారౌద్ర మహాశక్తి మహోదరే,
మహాపాపహరే దేవి మహాలక్ష్మి నమోస్తుతే

సర్వ సామాన్య చర్మచక్షువులకు కనిపించని దానివి. స్థులవిరాట్రూపవు. త్రివిక్రమవు; 
మహారౌద్ర, మహాశక్తి రూపిణివి, 
శరణాగత భక్తుల మహాపాపాల్ని నాశనం చేసి ఆధ్యాత్మికసిరిని(ధనాన్ని) ఇచ్చే మహాలక్ష్మివి.
నీకు నమస్కారం.

పద్మాసనస్థితే దేవి పరబ్రహ్మ స్వరూపిణి,
పరమేశి జగన్మాతః మహాలక్ష్మి నమోస్తుతే

పద్మాసనంలో కూర్చున పరబ్రహ్మ స్వరూపిణివి. పరమేశ్వరిని, జగన్మాతను అయిన మహాలక్ష్మివి, నీకు కైమోడ్పులు.

శ్వేతమ్బరధరే దేవి నానాలంకార భూషితే, 
జగత్థ్సతే జగన్మాతః మహాలక్ష్మీ నమోస్తుతే

తెల్లని వస్త్రాలు ధరించి, 
సర్వాలంకారభూషణాలను కలిగినదానవు, 
జగత్తువు పాలించే జగన్మాతవు అయిన మహాలక్ష్మీవి, నీకు నా నీరాజనాలు.

మాహలక్ష్మ్య ష్టకస్తోత్రం యః పఠేద్భక్తిమాన్నరః
సర్వసిద్ధిమవాప్నొతి రాజ్యం ప్రాప్నోతి సర్వదా

ఈ మహాలక్ష్మీ అష్టకాన్ని భక్తితో ఏ నరుడు పఠిస్తాడో, అతనికి ఎల్లప్పుడు సర్వ సిద్ధులు, 
రాజ్యం కలుగుతాయి.

ఏక కాలే పఠేనిత్యం మహాపాపవినాశనమ్,
ద్వికాలం యః పఠేనిత్యం ధనధాన్యాసమన్వితః

ఎవరయితే ఒకసారి ఈ మహాలక్ష్మీ అష్టకాన్ని పఠిస్తారో వారి మహాపాపాలు నాశనం అవుతాయి. రెండుసార్లు పఠిస్తే వారు ధనధాన్య సమృద్ధి పొందుతారన్నది స్పష్టం.

త్రికాల యః పఠేనిత్యం మహాశత్రువినాశనమ్,
మహాలక్ష్మీర్భవేన్నిత్యం ప్రసన్నా వరదా శుభా.

ఎవరైతే మూడు కాలాలు పఠిస్తారో వారికి 
మహాశత్రు వినాశనం అవుతుంది. 
శ్రీ మహాలక్ష్మీ ఎప్పుడూ వారికి ప్రసన్నురాలై శుభకరమైన వరాల్నీ, సర్వాన్నీ అనుగ్రహిస్తుంది.

ఈ అష్టకాన్ని పఠిస్తే, 
ఆ తల్లి అనుగ్రహం సులభంగా కలుగుతుంది. అందుకే అందరం మహాలక్ష్మీ అష్టకాన్ని పఠించి ఐశ్వర్యాన్ని పొందుదాము.

(సేకరణ)
- శ్రీ రాధా లక్ష్మి 

Quote of the day

Anger and intolerance are the enemies of correct understanding.…

__________Mahatma Gandhi