Online Puja Services

వెంటాడే దారిద్య్రాన్ని కూడా తొలగించే శ్రీ స్తోత్రం .

18.218.38.125

జన్మ జన్మల నుండీ వెంటాడే దారిద్య్రాన్ని కూడా తొలగించే శ్రీ స్తోత్రం .
- లక్ష్మి రమణ  

ఫాల్గుణ పంచమి శుక్రవారం కలిసి వచ్చిన రోజు ఫిబ్రవరి 24- 2023.  దేవతలకి అధిపతిగా ఇంద్రునికి అదృష్టం కలుగజేసిన ఆ లక్ష్మీ దేవిని ఈ రోజు ఆరాధించడమా విశేషమైన ఫలితాలని అందిస్తుంది . రాజ్యాధిపత్యం , ఉద్యోగాలలో ఉన్నతి , సంపద పొందడానికి మంత్రపూరితమైన ఈ శ్రీ స్తోత్రాన్ని పఠించాలి. ఈ స్తోత్రంతో లక్ష్మీ దేవిని ఆరాధించడం వలన జన్మ జన్మల నుండీ వెంటాడే దారిద్య్రం కూడా తొలగిపోతుంది. లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది .  దేవీ భాగవతంలోని నవమ స్కందంలో ఈ దివ్యమైన స్తోత్రం చెప్పారు . హితోక్తి పాఠకుల సౌకర్యార్థం ఆ దివ్య స్తోత్రమును ఈ క్రింది లింకులో పొందుపరిచాము . 

శ్రీ స్తోత్రమ్

పురన్దర ఉవాచ:

నమః కమలవాసిన్యై నారాయణ్యై నమో నమః ।
కృష్ణప్రియాయయై సతతం మహాలక్ష్మ్యై నమో నమః ॥ 1 ॥

పద్మపత్రేక్షణాయై చ పద్మాస్యాయై నమో నమః ।
పద్మాసనాయై పద్మిన్యై వైష్ణవ్యై చ నమోనమః ॥ 2 ॥

సర్వసమ్పత్స్వరూపిణ్యై సర్వారాధ్యై నమో నమః ।
హరిభక్తిప్రదాత్ర్యై చ హర్షదాత్ర్యై నమో నమః ॥ 3 ॥

కృష్ణవక్షఃస్థితాయై చ కృష్ణేశాయై నమో నమః ।
చన్ద్రశోభాస్వరూపాయై రత్నపద్మే చ శోభనే ॥ 4 ॥

సమ్పత్త్యధిష్ఠాతృదేవ్యై మహా దేవ్యై నమో నమః ।
నమో వృద్ధిస్వరూపాయై వృద్ధిదాయై నమో నమః ॥ 5 ॥

వైకుణ్ఠే యా మహాలక్ష్మీః యా లక్ష్మీః క్షీరసాగరే ।
స్వర్గలక్ష్మీరిన్ద్రగేహే రాజలక్ష్మీః నృపాలయే ॥ 6 ॥

గృహలక్ష్మీశ్చ గృహిణాం గేహే చ గృహదేవతా ।
సురభిః సాగరే జాతా దక్షిణా యజ్ఞకామినీ ॥ 7 ॥

అదితిర్దేవమాతా త్వం కమలా కమలాలయే ।
స్వాహా త్వం చ హవిర్దానే కావ్యదానే స్వధా స్మృతా ॥ 8 ॥

త్వం హి విష్ణుస్వరూపా చ సర్వాధారా వసున్ధరా ।
శుద్ధసత్త్వస్వరూపా త్వం నారాయణపరాయణా ॥ 9 ॥

క్రోధహింసావర్జితా చ వరదా శారదా శుభా ।
పరమార్థప్రదా త్వం చ హరిదాస్యప్రదా పరా ॥ 10 ॥

యయా వినా జగత్సర్వం భస్మీభూతమసారకమ్ ।
జీవన్మృతం చ విశ్వం చ విశ్వం చ శశ్వత్సర్వం యయా వినా ॥ 11 ॥

సర్వేషాం చ పరా మాతా సర్వబాన్ధవరూపిణీ ।
ధర్మార్థకామమోక్షాణాం త్వం చ కారణరూపిణీ ॥ 12 ॥

యథా మాతా స్తనాన్ధానాం శిశూనాం శైశవే సదా ।
తథా త్వం సర్వదా మాతా సర్వేషాం సర్వరూపతః ॥ 13 ॥

మాతృహీనస్స్తనాన్ధస్తు స చ జీవతి దైవతః ।
త్వయా హీనో జనః కోఽపి న జీవత్యేవ నిశ్చితమ్ ॥ 14 ॥

సుప్రసన్నస్వరూపా త్వం మాం ప్రసన్నా భవామ్బికే ।
వైరిగ్రస్తం చ విషయం దేహి మహ్యం సనాతనీ ॥ 15 ॥

అహం యావత్త్వయా హీనః బన్ధుహీనశ్చ భిక్షుకః ।
సర్వసమ్పద్విహీనశ్చ తావదేవ హరిప్రియే ॥ 16 ॥

జ్ఞానం దేహి చ ధర్మం చ సర్వసౌభాగ్యమీప్సితమ్ ।
ప్రభావం చ ప్రతాపం చ సర్వాధికారమేవ చ ॥ 17 ॥

జయం పరాక్రమం యుద్ధే పరమైశ్వర్యమేవ చ ।
ఇత్యుక్త్వా చ మహేన్ద్రశ్చ సర్వేః సురగణైః సహ ॥ 18 ॥

ప్రణనామ సాశ్రునేత్రో మూర్ధ్నా చైవ పునః పునః ।
బ్రహ్మా చ శఙ్కరశ్చైవ శేపో ధర్మశ్చ కేశవః ॥ 19 ॥

సర్వే చక్రుః పరీహారం సురార్థే చ పునః పునః ।
దేవేభ్యశ్చ వరం దత్వా పుష్పమాలాం మనోహరమ్ ॥ 20 ॥

కేశవాయ దదౌ లక్ష్మీః సన్తుష్టా సురసంసది ।
యయుర్దేవాశ్చ సన్తుష్టాః స్వం స్వ స్థానం చ నారద ॥ 21 ॥

దేవీ యయౌ హరేః స్థానం దృష్ట్వా క్షీరోదశాయినః ।
యయుశ్చైవ స్వగృహం బ్రహ్మేశానౌ చ నారద ॥ 22 ॥

దత్త్వా శుభాశిషం తౌ చ దేవేభ్యః ప్రీతిపూర్వకమ్ ।
ఇదం స్తోత్రం మహాపుణ్యం త్రిసన్ధ్యం చ పఠేన్నరః ॥ 23 ॥

కువేరతుల్యః స భవేద్రాజరాజేశ్వరో మహాన్ ।
పఞ్చలక్షజపేనైవ స్తోత్రసిద్ధిర్భవేన్నృణామ్ ॥ 24 ॥

సిద్ధస్తోత్రం యది పఠేన్మాసమేకం తు సన్తతమ్ ।
మహాసుఖీ చ రాజేన్ద్రో భవిష్యతి న సంశయః ॥ 25 ॥

ఇతి శ్రీదేవీభాగవతే మహాపురాణే నవమస్కన్ధే ద్విచత్వారింశోఽధ్యాయః

 

Quote of the day

The Vedanta recognizes no sin it only recognizes error. And the greatest error, says the Vedanta is to say that you are weak, that you are a sinner, a miserable creature, and that you have no power and you cannot do this and that.…

__________Swamy Vivekananda