Online Puja Services

పసివాడి జీవితం

3.135.219.166

పసివాడి జీవితం
- పరమాచార్య స్వామివారి భక్తులు కుంబకోణం శ్రీనివాస శాస్త్రి గారు చెప్పిన ఈ సంఘటన.

శ్రీ ఆదిశంకరాచార్య శిష్యులైన శ్రీ పద్మపాదాచార్యులు వారి రచనల్లో ఒకచోట, ఆదిశంకరుల గురించిన విశేషణాలు చెబుతూ, “ఆయన అపూర్వ శంకరులు, సాక్షాత పరమేశ్వరుల అవతారం. నాగాభారణాలను, ఏనుగు చర్మాన్ని, పులి చర్మాన్ని, అష్ట ఐశ్వర్యాలను విడిచిపెట్టి, సన్యాస రూపంతో శిష్యులతో వచ్చినవారు ఆదిశంకరులు” అని అంటారు.

ఇప్పుడు శ్రీనివాస శాస్త్రి గారి అనుభవంలో శ్రీ శ్రీ శ్రీ చన్ద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారు, మన పరమాచార్య స్వామివారు కూడా అపూర్వ శంకరులే అని. 

అప్పుడు మహాస్వామివారు శివాస్థానంలో మకాం చేస్తున్నారు. పన్నెండు సంవత్సరముల బాలుడు అక్కడకు వచ్చి స్వామివారి ముందు నిలబడ్డాడు. ఏడుస్తూ స్వామివారికి తన బాధను చెప్పుకుంటున్నాడు. “శ్రీ పెరియవ! నాకు తండ్రి లేడు. మా అమ్మ, చెల్లి బాంబేలో ఒక ఇంటిలో ఉన్నారు. ఆ ఇంట్లో మా అమ్మ వంటమనిషిగా చేస్తోంది. నన్ను ఇక్కడ మద్రాసులో ఒక క్రైస్తవ పాఠశాల వేశారు. ఇప్పుడు నేను ఎనిమిదవ తరగతి చదువుతున్నాను. మంచి మార్కులు తెచ్చుకుంటున్నాను. ఇప్పుడ అక్కడ నన్ను వారు క్రైస్తవంలోకి మారమని, అలా మతం మారితే ఎం.ఏ. డిగ్రీ దాకా చదివించి ఉద్యోగం కూడా ఇప్పిస్తామని చెబుతున్నారు. 

కాని నాకు మతం మారడానికి ఇష్టం లేదు. నాకు ఉపనయనం చేసుకోవాలని ఉంది. నలుగు నెలల నుండి మా అమ్మ దగ్గర నుండి నాకు ఎటువంటి సమాచారము, ఉత్తరాలు రాలేదు. మ తల్లికి, చెల్లికి ఏమి జరిగిందో నాకు తెలియడంలేదు”.

మొత్తం విషయం అంతా స్వామివారికి చెప్పి, ఏడుస్తూ నిలబడ్డాడు. ఆ పిల్లాణ్ణి శివాస్థానంలోనే ఉండమని ఆదేశించారు స్వామివారు. పది, పదిహేను రోజులు గడిచిపోయాయి. ఆ పిల్లాణ్ణి స్వామివారు ఎలా కరుణిస్తారో ఎవరికీ అర్థం కావడంలేదు.

ఒకరోజు పరమాచార్య స్వామివారి దర్శనం కోసం శివాస్థానానికి నలభై మంది భక్తులు వచ్చారు. వారందరూ బాంబే నుండి వచ్చామని, స్వామివారి దర్శనం ముగించుకుని వెళ్ళిపోతున్నారు. వాళ్ళని వెనక్కు పిలవమని శిష్యులను ఆదేశించారు స్వామివారు. అందరూ మరలా స్వామివారి వద్దకు వచ్చారు. స్వామివారు వాళ్ళందరిని పేర్లు ఇతర వివరాలు తెలపమని అడిగారు. అందుకు వారు ఎంతగానో సంతోషించారు.

అందరూ వారి వారి వివరాలు చెబుతున్నప్పుడు, ఒక వ్యక్తి పేరు చెప్పగానే, ఆ పిల్లవాణ్ణి తీసుకురమ్మని శిష్యులకు చెప్పారు స్వామివారు. తన పరిస్థితిని అతనికి చెప్పమని ఆ అబ్బాయిని ఆదేశించారు స్వామివారు. పిల్లవాని పరిస్థితి విని అతను కదిలిపోయాడు. ఆ పిల్లాణ్ణి ఇంతకుముందు ఎప్పుడూ చూడలేదు, కాని అతను చెప్పిన వివరాల ప్రకారం అతని తలి, చెల్లి పనిచేస్తున్నది తన ఇంటిలోనే అని అతను అర్థం చేసుకున్నాడు.

ఆ పిల్లాణ్ణి తను ఇంతకుముందెప్పుడు చూడలేదని, అతని తల్లి, చెల్లి తన ఇంట్లోనే ఉంటారని తెలిపాడు. కాని నాలుగు నెలల క్రితం ఆమె చనిపోయిందని చెప్పాడు. పిల్లాడి పాఠశాల యాజమాన్యానికి చెప్పినా వాళ్ళ నుండి స్పందన లేదని చెప్పాడు. మొత్తం కార్యక్రమాలను పిల్లాడి చెల్లి చేత చేయించాడు. పరమాచార్య స్వామివారి దర్శనం తరువాత మద్రాసుకు వెళ్లి అబ్బాయి గురించి విచారించాలనుకున్నట్టు తెలిపాడు. కాని మహాస్వామివారి అనుగ్రహం వల్ల పరమాచార్య స్వామివారి సన్నిధిలోనే ఆ పిల్లవాడు లభించాడు.

తరువాత మహాస్వామివారు ఇలా ఆదేశించారు. “నీతోపాటు ఈ పిల్లవాణ్ణి బాంబే తీసుకునివెళ్ళు. తన తల్లికి జగవలసిన కార్యక్రమలన్నిటిని ఈ పిల్లాడి చేత చేయించు. నీ స్వంత బిడ్డలాగా ఆదరించు. ఇతని చెల్లి పెళ్లి చేసే బాధ్యత కూడా నీదే”

ఎవరో తెలియని ఇద్దరు వ్యక్తుల మధ్య ఉన్న సంబంధాన్ని తెలుసుకోవడం ఇతరులకు సాధ్యం కాదు, కేవలం అది ఈశ్వరునికే సాధ్యం.

అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।

టెలిగ్రామ్ ఆప్ ద్వారా కంచి పరమాచార్య వైభవం పొందాలనుకునేవారు ఈ టెలిగ్రామ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వగలరు.

t.me/KPDSTrust
#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

Quote of the day

A coward is incapable of exhibiting love; it is the prerogative of the brave.…

__________Mahatma Gandhi