Online Puja Services

మీరు మీలానే ఉండండి

3.142.53.216

మీరు మీలానే ఉండండి
-సేకరణ : లక్ష్మి రమణ 

           ‘మీరు మీలానే ఉండకుండా మరొకరిలా ఉండలనుకుంతున్నారంటే
        పరిణామక్రమంలో వెనుదిరిగి వెళ్ళి కోతిలా మారాలని అనుకుంటున్నారా?’ 

అంటారు ప్రఖ్యాత ఆధ్యాత్మిక వక్త , యోగా గురువు , ఈషాఫౌండేషన్ వ్యవస్థాపకులు అయిన శ్రీ జగ్గీ వాసుదేవ్. ఆయన ఉపన్యాసాలు చాలా ప్రభావవంతంగా, ఆలోచించే సాధకులకు చాలా లోతైన అర్థాన్ని స్ఫురింపజేసేవిగా ఉంటాయి . శంకరన్ పిళ్ళై ఆయన సృష్టించిన ఒక హాస్యపాత్ర . ఆ పాత్ర ద్వారా క్లిష్టమైన యోగ రహస్యాలని , ప్రవర్తన విధాలనీ చిన్న చిన్న హాస్య కథల ద్వారా ఆయన తెలియజేశారు . ఇది దాదాపు భారతీయ భాషలన్నింటిలోకీ అనువాదమయ్యింది కూడా ! అందులోనుండి ఒక కథ ఇక్కడ చదువుదాం . 

మీకు గొప్ప క్రికెట్ వీరుడు కావాలని ఆశ,అందువల్ల సచిన్ వేసుకునేలాంటి షూ వేసుకుంటారు.అతనిలాగే క్రాఫ్ చేయించుకుంటారు,సచిన్ తన బ్యాట్ ని మీకిస్తాడు.అయితే,వీటివల్ల మీరు అతనిలాగ ఆడగలరా?

మరొకల్లలా నడుచుకుంటే మీరు గెలవగలరని ఎవరు చెప్పారు? మీ చాకచక్యాన్ని ,తెలివితేటల్ని ఎంత బాగా ఎలా ఉపయోగించుకోగలమని ఆలోచించడంలో కదా మీ గెలుపుంది! మరోకరిలా ఉండాలనుకున్తున్నావంటే, వెనుదిరిగి వెళ్లి కోతిల మారాలనుకుంటున్నామని కదా అర్థం!

మీ జీవితాన్నలా ఎందుకు పాడుచేసుకుంటారు? అని ప్రశ్నిస్తూ ఈ చక్కని కథని చెప్తారు శ్రీ వాసుదేవ్ . 

ఓసారి శంకరన్ పిళ్ళై తన స్నేహితులిద్దరితో కలసి రైల్వేస్టేషన్ కి వెళ్ళాడు. ముగ్గురికీ కలిపి ఒక టికెట్ తీసుకున్నాడు. పల్లెటూరి నుంచి వచ్చిన ముగ్గురు ప్రయాణీకులు దీన్ని గమనించారు . ఒక్క టిక్కెట్ తో ముగ్గురు ఎలా ప్రయాణం చేయవచ్చు? అని వాళ్ళకు ఆశ్చర్యం కలిగింది. రైల్లో వీళ్ళు శంకరన్ పిళ్ళై ను జాగ్రత్తగా గమనించసాగారు.

టిక్కెట్ కలెక్టర్ రావడం చూసి, శంకరన్ పిళ్ళై అతని స్నేహితులు టాయిలెట్ లోకి వెళ్లి దాక్కున్నారు. మిగిలిన వాళ్ళను చూశాక, టిక్కెట్ కలెక్టర్ "లోపలఎవరు?  టిక్కెట్ ప్లీజ్" అని అడిగాడు. లోపల నుంచి ఒక చేయి టిక్కెట్ తోటి  జాపబడింది. ఆ తర్వాత కొంతసేపటికి ముగ్గురూ బయటికి వచ్చి కూర్చున్నారు.ఆ పల్లెవాల్లకు వీళ్ళ తంత్రం అర్థమైంది.

"అబ్బ ఎంత గొప్ప ఆలోచన" అనుకునారు.
వాళ్ళు తిరుగు ప్రయాణం మొదలెట్టారు.
ఆ ముగ్గురు కలిసి ఒకే టిక్కెట్ తీసుకునారు.
వెనకాలే   శంకరన్ పిళ్ళై తనమిత్రులతో వచ్చాడు. 

అయితే, ఈసారి  వాళ్ళు కనీసం ఒక్క టిక్కెట్ కూడా తీసుకోకుండా రైలెక్కడం చూసారు ఆ పల్లెవాళ్ళు. వాళ్లకు ఒకటే ఆశ్చర్యం, ఎలా టిక్కెట్ కలెక్టర్ నుంచి తప్పించుకుంటారు వీళ్ళు ?  అని వాళ్లకు అనుమానం.

టిక్కెట్ కలెక్టర్ ను చూడగానే పల్లెవాళ్ళు ముగ్గురూ టాయిలెట్ కు పోయి దాక్కున్నారు. శంకరన్ పిళ్ళై స్నేహితులు ఇద్దరు పక్క దాంట్లో దాక్కున్నారు. పిళ్ళై , జానపదులున్న టాయిలెట్  తలుపు తట్టి "లోపల ఎవరు? టిక్కెట్ ప్లీజ్" అన్నాడు.

ఒక పల్లెవాడు చేయి చాపాడు. శంకరన్ పిళ్ళై ఆ టిక్కెట్ తీసుకుని తన స్నేహితులతో కలిసి దాక్కున్నాడు.

అందుకే గుడ్డిగా ఎదుటివాళ్ళని అనుసరించకూడదు . ఎదుటి వాళ్ళలాగ ఉండాలనుకుంటే, ఉన్నది కూడా పోయే పరిస్థితి ఏర్పడుతుంది. చిన్నప్పటి నుంచి మరొకళ్ళను చూపించి వాళ్ళల ఉండమని మీ పెద్దవాళ్ళు నేర్పించడం వల్ల  వచ్చిన జబ్బు ఇది. ఈ జబ్బు మరింత  పెద్దదై వినాశనానికి దారితేసేలోగా దాన్ని పోగొట్టుకోండి. ఇదే మీరు నేర్చుకోవలసిన రహస్యం.

సద్గురు జగ్గీ వాసుదేవ్

Quote of the day

In a gentle way, you can shake the world.…

__________Mahatma Gandhi