Online Puja Services

భగవన్నామ స్మరణ యొక్క గొప్పతనము ఏమిటి?

13.58.182.29

భగవన్నామ స్మరణ యొక్క గొప్పతనము ఏమిటి?

శ్రీ రామ రక్ష సర్వ జగద్రక్ష
ఒక్క రామనామం నాలుక మీద నర్తిస్తే ఆ నామం నర్తించిన కారణం చేత సమస్తపాపములనుండి వినిర్ముక్తుడు కావచ్చును...

పవి పుష్పంబగు నగ్ని మంచగు నకూపారంబు భూమీస్థలం
బవు శత్రుం డతిమిత్రుఁడౌ విషము దివ్యాహారమౌ నెన్నఁగా
నవనీమండలిలోపలన్ శివ శివే త్యాభాషణోల్లాసికిన్
శివా నీ నామము సర్వవశ్యకరమౌ శ్రీ కాళహస్తీశ్వరా!!

భగవంతునియొక్క నామము సర్వకాల సర్వావస్థలయందు అవసరమే, ఒకమంత్రం చేయడానికి, అంగన్యాస కరన్యాసాలు, కాళ్ళూ చేతులు కదపకుండా కూర్చొని చేయాలి. 

అదే ఒక భగవన్నామం చెప్పడానికి యే అవస్థలోనైనా చెప్పవచ్చు...

హరునకు నవ్విభీషణునక ద్రిజకుం దిరుమంత్ర రాజమై
కరికి సహల్యకుం ద్రుపదకన్యకు నార్తిహరించుచుట్టమై
పరగినయట్టి నీపతిత పావననామము జిహ్వపై నిరం
తరము నటింపజేయుమిక దాశరథీ కరుణాపయోనిధీ!!

అంటాడు గోపన్న....

రామా! నీదివ్యమైన నామాన్ని నా నాలుకమీద నర్తింపచెయ్యి అంటాడు. 
ఆ ఒక్క నామాన్ని పట్టుకొని భగవన్నామాన్ని సతతం జపించిన కారణం చేత సమస్త పాపములనుండి విడుదలై పరమేశ్వరుణ్ణి చేరగలడు...

భగవన్నామము అంత గొప్పది.  భగవన్నామాన్ని ఉచ్ఛరించగలిగిన స్థితి ఒక్క మనుష్య ప్రాణికే వుంది...

         శుభమస్తు
       సమస్త లోకా సుఖినోభవంతు

-- వాట్సాప్ సేకరణ 

Quote of the day

As a single withered tree, if set aflame, causes a whole forest to burn, so does a rascal son destroy a whole family.…

__________Chanakya