Online Puja Services

గణపతి వక్రతుండములోని విశేషము ఏమిటి ?

3.14.130.24

గణపతి వక్రతుండములోని విశేషము ఏమిటి ? 
- లక్ష్మి రమణ 

ముద్గల పురాణం వినాయకుని తత్వాన్ని విశ్లేషిస్తుంది . ముద్గల మహర్షి రచించిన ఈ పురాణాన్ని వినాయక పురాణం అని కూడా అంటారు . ఈ పురాణం వినాయకుని మహిమని , తత్వాన్ని ఉదాత్తంగా విశ్లేషిస్తుంది . వేదములు, పురాణములో చెప్పిన ఆయన అవతార విశేములోని రహస్యాలని ఇది వివరిస్తారు ఆయన . అక్కడ మనకి గణపతి వక్రతుండములో దాగిన రహస్యం ఏమిటి అనేది తెలియవస్తూ ఉంది . 

వ్యక్తులెప్పుడూ సత్వగుణ సంపన్నులై ఉండాలి . కానీ సాత్వికమైన భావనతో , ప్రవర్తనతో నిండి ఉండే ఈ దైవ గుణం సాధించడం సంసారులకి అంట సులువైన విషయమేమీ కాదు .  రజోగుణ ప్రధానమైన  - కామ క్రోదాడులు, అరిషడ్వార్గాల ప్రభావాన్ని  నియంత్రించాలి . తమోగుణాన్ని తపస్సుతో , నామ జపంతో శాంత పరచాలి .  వీటి వేగాన్ని ఎవరైతే నిగ్రహిస్తారో అటువంటి వారు సుఖంగా ఉండగలరు . సత్వగుణ సంపదతో ప్రకాశించగలరని పరమాత్మ గీతలో చెబుతారు . కానీ అది సులువైన పనికాదని అనుకుంటే, ఏ గుణాన్ని అలవర్చుకోవడానికి ఇంతసాధనా చేశామో , చివరికి ఆ గుణానికి కూడా అతీతమైన మానసిక స్థితిని సాధించాలి .  అంటే దేనితో మొదలయ్యామో దాన్ని కూడా పరమాత్మకు వదిలేయాలి . 

ఇవన్నీ సాధించాలంటే ముందర మన మనసు అంతర్ముఖం కావాలి .  అలా మనసుని తిప్పి అంతర్ముఖం చేసేవాడు గణపతి .  అందుకే ఆయన వక్రతుండుడై ఉంటారు . గణపతి ఉపాసన వల్ల విషయవాంఛల వైపు మాత్రమే మనల్ని నడిపించే చిత్తము అటునుండి ఇటు తిరగగలుగుతుంది . ఆయన ధరించిన అష్ట అవతారాలు తెలియజేసే విషయం ఇదే ! అందుకే ఆ గణపతి తలచుకుంటే మాత్రం ఆ అద్భుతం జరిగి తీరుతుంది . అందుకే ప్రధమ పూజ్యుడయ్యాడు గణపతి. 

ఆయన వక్రతుండము లోని విశేషము అదే .  సెకనులో వెయ్యో వంతులో ఒక కోరికని సృష్టించే మనసుని నియంత్రించి తన వక్రతుండంతో పట్టి పైకి లేపి పరమాత్మ వైపు మళ్లేలా చేస్తారు . అందుకే మూలాధారంలో గణపతి వ్యక్తీకరణని చెబుతారు యోగవిజ్ఞాన సంపన్నులు . ఆయన తొండంతో పట్టి పైకి లేపితేగానీ , మిగిలిన చక్రాల ప్రేరణ జరగదు . అందువల్ల కూడా ఆ గణపతే భగవంతుని మార్గంలో ప్రధమ పూజ్యుడు .  వక్రతుండంతో ఆదుకునే వరదుడు . 

కేవలం ఐహికమైన వాంఛలకు మాత్రమే గణపతి ఆరాధన కాదు . ఆయన వాటిని అనుగ్రహిస్తూనే , చక్కగా మనసుని పరమాత్మవైపు మళ్లించేస్తారు . అదీ ఆయన గొప్పదనం . రూపవిశేషం . అందువల్ల ఆ భగవంతుని ఆరాధించి మోక్షప్రాప్తిని పొందుదాం . 

శుభం .  

Quote of the day

Anger and intolerance are the enemies of correct understanding.…

__________Mahatma Gandhi