Online Puja Services

శ్రీ గణపతి మంగళ మాలికా స్తోత్రం’.

18.217.220.114

కార్యసిద్ధిని పొందేందుకు శ్రీకృష్ణుడు రచించిన స్తోత్రం ‘శ్రీ గణపతి మంగళ మాలికా స్తోత్రం’. 
- లక్ష్మి రమణ 

సిద్ధి, బుద్ధి అనే శక్తిలని అనుగ్రహించేవాడు గణపతి. అందుకే గణపతి ఫోటోలలో లక్ష్మీ, సరస్వతీ సహితంగా ఉన్నట్టు చిత్రిస్తారు.  లక్ష్మీ దేవి ఏ కార్యాన్నయినా సిద్ధింపజేస్తుంది. బుద్ధి కి స్వరూపమైన సరస్వతి అందుకు తగిన విజ్ఞానాన్ని, పట్టుదలని, స్పృరణ శక్తిని , బుద్ధిని అందిస్తుంది . కార్యవిఘ్నలని  ఆ గణపతి తొలగిస్తాడు . ఇవన్నీ సానుకూలంగా ఉన్నప్పుడు, ఇక పట్టిందల్లా బంగారంకాక మానదు కదా ! ఆ విధంగా కార్యసిద్ధిని పొందేందుకు శ్రీకృష్ణుడు రచించిన గొప్ప స్తోత్రం శ్రీ గణపతి మంగళ మాలికా స్తోత్రం. ప్రారంభించిన పని కావడం లేదని బాధ పడేవారు, ఏ పని ప్రారంభించినా ఆటంకాలు ఎదురవుతున్నవారు, ఋణ బాధలనుండి బయట పడలేని వారు, భవసాగరంలో ఈతరాక కొట్టుకునే వారూ  ఈ స్తోత్రాన్ని ప్రతి బుధవారం (వీలయితే ప్రతి రోజూ ), సంకష్ట చతుర్థి రోజూ తప్పక చదువుకోవడం మంచిది . సులువైన, రమ్యమైన ఆ స్తోత్రాన్ని ఇక్కడ పాఠకుల సౌలభ్యం కోసం పొందుపరుస్తున్నాం .

శ్రీ గణపతి మంగళ మాలికా స్తోత్రం. 
 
శ్రీ కంఠ ప్రేమ పుత్రాయ గౌరీ వామాంగ వాసినే
ద్వాత్రింశద్రూప యుక్తాయ శ్రీ గణేశాయ మంగళం!

ఆది పూజ్యాయ దేవాయ దంత మోదక ధారిణే
వల్లభా ప్రాణ కాంతాయ శ్రీ గణేశాయ మంగళం!

లంబోదరాయ శాంతాయ చంద్ర గర్వాప హారిణే
గజాననాయ ప్రభవే శ్రీ గణేశాయ మంగళం!

పంచ హస్తాయ వంద్యాయ పాశాంకుశ ధరాయ చ
శ్రీమతే గజ కర్ణాయ శ్రీ గణేశాయ మంగళం!

ద్వైమాతురాయ బాలాయ హేరాంబాయ మహాత్మనే
వికటాయాఖు వాహాయ శ్రీ గణేశాయ మంగళం!

పృష్ణి శృంగాయాజితాయ క్షిప్రాభీష్టార్థ దాయినే
సిద్ధి బుద్ధి ప్రమోదాయ శ్రీ గణేశాయ మంగళం!

విలంబి యజ్ఞ సూత్రాయ సర్వ విఘ్న నివారిణే
దూర్వాదల సుపూజ్యాయ శ్రీ గణేశాయ మంగళం!

మహాకాయాయ భీమాయ మహాసేనాగ్ర జన్మనే
త్రిపురారీ వరో ధాత్రే శ్రీ గణేశాయ మంగళం!

సింధూర రమ్య వర్ణాయ నాగబద్ధో దరాయ చ
ఆమోదాయ ప్రమోదాయ శ్రీ గణేశాయ మంగళం!

విఘ్న కర్త్రే దుర్ముఖాయ విఘ్న హర్త్రే శివాత్మనే
సుముఖాయైక దంతాయ శ్రీ గణేశాయ మంగళం!

సమస్త గణ నాథాయ విష్ణవే ధూమకేతవే
త్ర్యక్షాయ ఫాల చంద్రాయ శ్రీ గణేశాయ మంగళం!

చతుర్థీశాయ మాన్యాయ సర్వ విద్యా ప్రదాయినే
వక్రతుండాయ కుబ్జాయ శ్రీ గణేశాయ మంగళం!

తుండినే కపిలాక్షాయ శ్రేష్ఠాయ ఋణ హారిణే
ఉద్దండోద్దండ రూపాయ శ్రీ గణేశాయ మంగళం!

కష్ట హర్త్రే ద్విదేహాయ భక్తేష్ట జయదాయినే
వినాయకాయ విభవే శ్రీ గణేశాయ మంగళం!

సచ్చిదానంద రూపాయ నిర్గుణాయ గుణాత్మనే
వటవే లోక గురవే శ్రీ గణేశాయ మంగళం!

శ్రీ చాముండా సుపుత్రాయ ప్రసన్న వదనాయ చ
శ్రీ రాజరాజ సేవ్యాయ శ్రీ గణేశాయ మంగళం!

శ్రీ చాముండా కృపా పాత్ర శ్రీ కృష్ణ ఇంద్రియాం వినిర్మితా
 విభూతి మాతృకా రమ్యాం కల్యాణైశ్వర్యదాయినీం!

శ్రీ మహాగణ నాథస్య శుభాం మంగళ మాలికాం
యః పఠేత్ సతతం వాణీం లక్ష్మీం సిద్ధిమవాప్నుయాత్!

ఇతి శ్రీకృష్ణ విరచితం శ్రీ గణపతి మంగళ మాలికా స్తోత్రం సంపూర్ణం !!

గం గణపతియే నమోన్నమః 

(శ్రీ గణేశ స్తోత్ర నిధి నుండీ గ్రహించబడింది .) 

#ganapatimangalamalikastotram

Tags: ganapati mangala malika stotram, ganapathi, ganesh, ganesa, vinayaka

Quote of the day

You can't cross the sea merely by standing and staring at the water.…

__________Rabindranath Tagore