Online Puja Services

శ్వేతార్క గణపతి స్తోత్రం

3.138.114.38

శ్వేతార్క గణపతి స్తోత్రం 
సేకరణ : లక్ష్మి రమణ 

శ్వేతార్కంలో 'శ్వేతం' అంటే తెలుపు వర్ణం, 'అర్క' అంటే సూర్యుడు. శ్వేతార్క గణపతి అంటే తెల్ల జిల్లేడు గణపతి. శ్వేతార్క మూలంలో వినాయకుడు నివశిస్తాడని ప్రతీతి. దీన్ని మనం పొందగలిగి, గృహంలో ప్రతిష్టించుకోగలిగితే శుభప్రదం. శ్వేతార్క గణపతిని సాక్షాత్తూ గణపతిగా భావించి పూజలు చేస్తారో వారికి జ్ఞాన సంపద సురక్ష సుఖశాంతులు లభిస్తాయి. బాగా పాతబడిన తెల్లజిల్లేడు మొదళ్ళు కొన్ని గణపతి రూపం ధరిస్తాయని, అటువంటి బహు అరుదు అని చెప్పవచ్చు.

తెల్లజిల్లేడు చెట్టు 45 నుండీ నూరేళ్ల వయసులో  సహజంగానే గణపతి రూపం సంతరించుకుంటుంది . ఆదివారం అమావాస్య పుష్యమి[హస్త ] నక్షత్రం రోజున వేరును స్వీకరించాలి. శ్వేతార్క మూల గణపతిని శుద్ధమైన నీటితో కడిగి, తర్వాత దానిపై ఎర్రని వస్త్రం మీద పెట్టి పూజ చేయాలి. పూజలో ఎర్ర చందనం, అక్షతలు, ఎర్రపూలు సింధూరం ఎరుపు రంగు ఉండే వస్తువులే ఎక్కువగా వాడాలి. ధూపదీప నైవేద్యాలు సమర్పించాలి. వీటితో ఒక నాణాన్ని దక్షిణ గా సమర్పించి తర్వాత గణపతిని స్తోత్రం చేయవచ్చు 

శ్వేతార్క మూల గణపతి స్తోత్రం :

ఓం నమో గణపతయే శ్వేతార్క గణపతయే శ్వేతార్కమూల నివాసాయ
వాసుదేవప్రియాయ, దక్షప్రజాపతిరక్షకాయ సూర్యవరదాయ కుమారగురవే
సురాసువందితాయ, సర్వభూషణాయ శశాంక శేఖరాయ
సర్వమాలాలంకృత దేహాయ, ధర్మధ్వజాయ ధర్మరక్షకాయ
త్రాహిత్రాహి దేహిదేహి అవతర అవతర గంగంగణపతయేవక్రతుండ గణపతయే
సర్వపురుషవశంకర, సర్వదుష్ట మృగవశంకర వశీకురు వశీకురు
సర్వదోషాన్ బంధయ బంధయ, సర్వవ్యాధీన్ నికృంతయ నికృంతయ
సర్వవిషాణీ సంహర సంహర సర్వదారిద్ర్య మోచయ మోచయ
సర్వశత్రూనుచ్చాట యోచ్ఛాటయ సర్వసిద్ధింకురుకురు సర్వకార్యణి
సాధయ సాధయగాం గీం గౌం గైం గాం గః హుంఫట్ స్వాహా II

శ్వేతార్క గణపతిని సాక్షాత్తూ గణపతిగా భావించి పూజలు చేస్తారో వారికి జ్ఞాన సంపద సురక్ష సుఖశాంతులు లభిస్తాయి.

Quote of the day

To be idle is a short road to death and to be diligent is a way of life; foolish people are idle, wise people are diligent.…

__________Gautam Buddha