Online Puja Services

శ్రీ నృసింహ ద్వాదశనామ స్తోత్రం.

13.59.130.130

క్షయ, ఫిట్స్, కుష్ఠు వంటి భయంకరమైన రోగాలు కూడా నయం చేయగల శ్రీ నృసింహ ద్వాదశనామ స్తోత్రం. 
- లక్ష్మి రమణ 

సామాన్యులు కూడా చేసుకోగలిగిన మహామంత్రాలను పురాణాంతర్గతమైన స్తోత్రాలుగా అందించడం కేవలం మహానుభావుడైన ఆ వేదవ్యాసునికే చెల్లింది . సర్వపాపాలను నాశనం చేసే ఈ నృసింహుని 12 నామాలు ప్రతిరోజూ చేసుకోవచ్చు. అలా చేయడం వలన  జ్వరాది బాధలు, వ్యాధులు తొలగిపోతాయి. ఈ దివ్య స్తోత్రాన్ని పఠించడం వలన కలిగే ఫలితం కూడా ఫలశృతిలో చక్కగా చెప్పారు . క్షయ, ఫిట్స్, కుష్ఠు వంటి భయంకరమైన రోగాలు కూడా  భద్ర రాజం అని కూడా పిలిచే ఈ స్తోత్రాన్ని పఠించడం వలన తగ్గిపోతాయి.  వందసార్లు పఠిస్తే  వ్యాధి బంధనం తొలగిపోతుంది.  1000 మార్లు పఠిస్తే , వారిని వాంఛితఫలం వరిస్తుందని ఫలశృతి చెబుతుంది .

శ్రీ నృసింహ ద్వాదశనామ స్తోత్రం

అస్య శ్రీనృసింహ ద్వాదశనామస్తోత్ర మహామంత్రస్య వేదవ్యాసో భగవాన్ ఋషిః అనుష్టుప్ఛందః లక్ష్మీనృసింహో దేవతా శ్రీనృసింహ ప్రీత్యర్థే వినియోగః |

ధ్యానం |

స్వభక్త పక్షపాతేన తద్విపక్ష విదారణమ్ |
నృసింహమద్భుతం వందే పరమానంద విగ్రహమ్ ||

స్తోత్రం |

ప్రథమం తు మహాజ్వాలో ద్వితీయం తూగ్రకేసరీ |
తృతీయం వజ్రదంష్ట్రశ్చ చతుర్థం తు విశారదః || ౧ ||

పంచమం నారసింహశ్చ షష్ఠః కశ్యపమర్దనః |
సప్తమో యాతుహన్తా చ అష్టమో దేవవల్లభః || ౨ ||

నవ ప్రహ్లాదవరదో దశమోఽనంతహస్తకః |
ఏకాదశో మహారుద్రో ద్వాదశో దారుణస్తథా || ౩ ||

ద్వాదశైతాని నామాని నృసింహస్య మహాత్మనః |
మన్త్రరాజేతి విఖ్యాతం సర్వపాపవినాశనమ్ || ౪ ||

క్షయాపస్మారకుష్ఠాది తాపజ్వరనివారణమ్ |
రాజద్వారే మహాఘోరే సంగ్రామే చ జలాంతరే || ౫ ||

గిరిగహ్వార ఆరణ్యే వ్యాఘ్రచోరామయాదిషు |
రణే చ మరణే చైవ శమదం పరమం శుభమ్ || ౬ ||

శతమావర్తయేద్యస్తు ముచ్యతే వ్యాధిబంధనాత్ |
ఆవర్తయేత్సహస్రం తు లభతే వాంఛితం ఫలమ్ || ౭ ||

ఇతి శ్రీ నృసింహ ద్వాదశనామ స్తోత్రం |

శుభం !!

Nrusimha dwadasa Nama Stotram,

#nrusimha #dwadasa #stotram

Quote of the day

The Vedanta recognizes no sin it only recognizes error. And the greatest error, says the Vedanta is to say that you are weak, that you are a sinner, a miserable creature, and that you have no power and you cannot do this and that.…

__________Swamy Vivekananda